ఆంధ్రప్రదేశ్ : DSC 98 లో అర్హత సాధించిన 4,887 మందికి కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. కానీ నిబంధనల పేరుతో 1815 పోస్టులను తగ్గించారు. రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం SC, ST, BC, మైనారిటీ అభ్యర్థులు చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. మినిమం టైం స్కేల్ తో కాంట్రాక్ట్ విధానంలో నియమించిన ఈ పోస్టుల్లో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టారు. దాంతో SC, ST, BC ల్లో చాలామందికి ఉద్యోగాలు రాలేదు.
ఈ రిజర్వేషన్ అమలు చేయడం కాంట్రాక్ట్ విధానంలో కుదరదని ప్రభుత్వం వాళ్ళ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. కొన్ని జిల్లాల్లో SGT పోస్టులు లేకపోవడంతో వేరే జిల్లాల్లో మిగిలిపోయినవి ఆయా జిల్లాల్లో మార్చి సర్దుబాటు చేశారు. ఉమ్మడి కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల వారికి అన్యాయం జరిగిందనీ… తక్కువ మందికే ఉద్యోగాలు వచ్చాయని ఉపాధ్యాయ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.