---Advertisement---

AP DSC Notification 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

డీఎస్సీ కోసం ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. AP DSC 2024 నోటిఫికేషన్‌ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మొత్తం 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 12 నుంచి DSC ప్రక్రియ ప్రారంభవుతుంది. ఏప్రిల్‌ 7న ఫలితాలు ప్రకటిస్తామని బొత్స తెలిపారు.

6,100 టీచర్ పోస్టుల్లో 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

2,280 SGT పోస్టులు,

42 ప్రిన్సిపల్‌ పోస్టులు,

1,264 TGG పోస్టులు,

215 PGT పోస్టులు ఉన్నాయి..

ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకూ DSC పరీక్షలు జరుగుతాయి. మార్చి 31న ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్‌ 7వ DSC ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభం అవుతోంది. మొత్తం ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు మంత్రి బొత్స

ఏపీ DSC.. ముఖ్యమైన తేదీలు

– ఫిబ్రవరి 12నుంచి అప్లికేషన్స్‌
– మార్చి 5 నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌
– మార్చి 15 నుంచి 30వరకు పరీక్షలు
– ఏప్రిల్‌ 2న ఫైనల్‌ కీ
– ఏప్రిల్‌ 7న తుది ఫలితాల వెల్లడి

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!