---Advertisement---

Bharat Ratna 2024 : హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌..ప్రధానిగా చరణ్ సింగ్ .. భారత రత్నాలు

స్వామినాథన్‌ (M.S. Swamy nathan) 1925 ఆగస్టు 7లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. మెట్రిక్యులేషన్‌ పూర్తయ్యాక స్వామినాథన్‌ కూడా తండ్రిలాగే మెడికల్‌ స్కూల్లో చేరారు. 1943లో బెంగాల్‌ లో వచ్చిన కరవును చూసి తల్లడిల్లిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్యరంగం నుంచి వ్యవసాయ పరిశోధనల వైపు అడుగు వేశారు. భారత్‌లో హరిత విప్లవానికి స్వామినాథన్ నాంది పలికారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో స్వామినాథన్‌ కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల తయారీలో కీలక పాత్ర పోషించారు.

చరణ్ సింగ్ … 23 రోజుల ప్రధాని

చౌదరీ చరణ్ సింగ్ (Chaudary Charan Singh )డిసెంబర్‌ 23, 1903లో ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టారు. మొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ (INC) తరఫున పనిచేశారు. 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరుతో సొంతంగా పార్టీని పెట్టారు. జనతా పార్టీ, జనతా పార్టీ (సెక్యులర్‌)లో పనిచేసి, 1980లో లోక్‌దళ్‌ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967-68, 1970లో రెండు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ టైమ్ లో ఆయన్ని జైల్లో పెట్టారు. తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు చరణ్ సింగ్ హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. మెరార్జీ హయాంలోనే 1979 జనవరి నుంచి జులై వరకు డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి కూడా పనిచేశారు. 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొంతకాలం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. రైతులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. చరణ్ సింగ్ కి ఆరుగురు పిల్లలు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ ఆయన కుమారుడే.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!