మనం ఎప్పటి నుంచో పేపర్ కరెన్సీని (Paper currency) వాడుతున్నాం… కానీ ఇప్పుడు పేపర్ కరెన్సీకి బదులు డిజిటల్ కరెన్సీ అనేది పాపులర్ అవుతోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ (Black Chain Technology) ఆధారంగా… వ్యాలెట్లతో డిజిటల్ కరెన్సీ అనేది ట్రాన్స్ ఫర్ అవుతోంది. దీన్ని మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే (RBI) నిర్వహిస్తోంది.
2022-23 కేంద్ర బడ్జెట్ లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్… భారత్ లో డిజిటల్ కరెన్సీ తెస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత 2022 డిసెంబర్ 1నాడు RBI పైలెట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కరెన్సీని ప్రారంభించింది. డిజిటల్ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ… CBDC అంటారు… దీన్ని ఆర్బీఐ జారీ చేస్తుంది. జనరల్ గా RBI ఫిజికల్ కరెన్సీనోట్లను రిలీజ్ చేస్తుంది… మరి డిజిటల్ కరెన్సీకి ఎవరు బాధ్యులు అంటే… దానికి కూడా ఆర్బీఐ… ప్రభుత్వం గుర్తింపు ఉంటాయి. అంటే మనం అవసరమైతే డిజిటల్ కరెన్సీని… పేపర్ కరెన్సీగా కూడా మార్చుకోవచ్చు.
ఫిజికల్ పేపర్ కరెన్సీని అయితే… బ్యాంకుల్లో భద్రంగా దాచుకుంటాం. మరి డిజిటల్ కరెన్సీ ఎక్కడ దాచుకుంటాం…అంటే… డిజిటల్ కరెన్సీని స్టోర్ చేయడం… వాటితో జరిపే లావాదేవీలను రికార్డ్ చేయడానికి….. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇది ఒకరకంగా డిజిటల్ లెడ్జర్ లాంటిది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ఈ లావాదేవీలన్నీ కూడా ట్రాన్స్ పెరెన్సీగా ఉంటాయి. RBI బ్యాలెన్స్ షీట్ లో కూడా దీన్ని చూపిస్తారు. అందువల్ల డిజిటల్ కరెన్సీ చట్టబద్ధత అనేది ఉంటుంది. భారత్ ఎప్పుడైతే డిజిటల్ కరెన్సీని అధికారికంగా ప్రవేశపెట్టినట్టు ప్రకటించడంతో… ప్రపంచంలోనే వివిధ దేశాలు కూడా దీనిపై దృష్టిపెట్టాయి. స్వీడన్ కేంద్ర బ్యాంక్ కూడా ఇప్పటికే ఈ-క్రోనా పేరుతో డిజిటల్ తరహా కరెన్సీని అమలు చేయడాన్ని పరిశీలిస్తోంది.
అసలు డిజిటల్ కరెన్సీతో మనకు ఉపయోగం ఏంటి ?
మనకు తెలుసు… 10 రూపాయల నోటును ప్రింట్ చేయడానికి RBI కి 96 పైసలు … అంటే దాదాపు రూపాయి ఖర్చవు అవుతోంది… మళ్ళీ దాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు, గ్రామాలకు బ్యాంకుల ద్వారా సరఫరా చేయడానికి… బోల్డంత ఖర్చవుతోంది…. ఫిజికల్ కరెన్సీకి భద్రత కల్పించడం కూడా ఇబ్బందే. అదే డిజిటల్ కరెన్సీ అయితే… తక్కువ ఖర్చుతో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది… ప్రస్తుతం అయితే… సబ్సిడీ పథకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులను… డిజిటల్ కరెన్సీలోనే ఇస్తున్నాయి. ఫిజికల్ పేపర్ కరెన్సీ వినియోగం బాగా తగ్గిపోతోంది… దాంతో బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి.