ఉన్నత చదువుల కోసం సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. కెరియర్ తో పాటు లైఫ్ ని మలుపు తిప్పే ఈ కీలక నిర్ణయానికి ముందు.. అక్కడి వాతావరణ, సామాజిక స్థితిగతులపై ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. తెలిసినవాళ్ళు చెప్పారని… లేదంటే మనం వెళ్తున్న దేశంలో ఫ్రెండ్స్ ఉన్నారన్న ఆలోచనతో మనం కూడా వెళ్ళాలని అనుకోవడం కరెక్ట్ కాదు. విదేశాల్లో చదువుకోడానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకునే ముందే కొన్ని ముఖ్యవిషయాలపై అవగాహన పెంచుకోవాలి.
ఏ చదివే యూనివర్సిటీ ఏంటి:
మీరు ఎంచుకున్న కోర్సు ఏ దేశంలో… ఏ యూనివర్సిటీలో ఉంది? ఇంజినీరింగ్, సైన్స్, లా. మేనేజ్మెంట్, మెడిసన్…. ఇలా వివిధ విభాగాల కోర్సులు USA, UKలో అందుబాటులో ఉన్నాయి. ఇంజినీరింగ్, సైన్స్ కి సంబంధించిన కోర్సులకు జర్మనీ బెటర్ గా ఉంది. ఆస్ట్రేలియా, కెనడాల్లో పరిశోధనకు సంబంధించిన కోర్సులు బాగుంటాయి. మీకు ఎందుకు ఆసక్తి ఉంది…ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలని అనుకుంటున్నారు… లాంటివి బేరీజు వేసుకొని మీరు చదుకోవాల్సిన దేశాన్ని ఎంచుకోవాలి.
బడ్జెట్ చాలా ముఖ్యం
విదేశాల్లో చదవాలనే కల నెరవేరాలంటే ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ట్యూషన్ ఫీజు, వసతి ఖర్చులు, పుస్తకాలు, లైఫ్ ఇన్సూరెన్స్… మొదలైన వాటికి ఎంత ఖర్చు అవుతుందో ముందే బడ్జెట్ వేసుకోవాలి.
ఆరోగ్యం చూసుకోండి:
మీరు వెళ్ళబోతున్న ఆ దేశ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి. మొదటి నుంచీ అలవాటున్న వాతావరణానికి భిన్నమైన పరిస్థితులు విదేశాల్లో ఉంటాయి. ఆ టైమ్ లో మీకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకోసం ఈ ఆరోగ్య ఖర్చులు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాలి. వైద్యఖర్చుల కోసం ఆరోగ్య బీమా తీసుకోవాలి.
ఇతర కార్యక్రమాలు:
చదువే కాదు… ఇతర విషయాల్లోనూ చురుగ్గా ఉండాలి. యూనివర్సిటీల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటలు, సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉండాలి.
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే ఆసక్తి: చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత బెటర్. అలాంటి వాటిపైనే విద్యార్థి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. యూనివర్సిటీ ఆవరణల్లోనే
కాకుండా డార్మెటరీలు, అపార్ట్మెంట్లలో ఉంటే… విదేశీ సంస్కృతీ సంప్రదాయాల విషయంలో అవగాహన పెరుగుతుంది. అలాగే మనం ఉంటున్న దేశ సంప్రదాయాలను కూడా తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
చట్టాలు, ఆంక్షలు:
విదేశీ చట్టాలు, ఆంక్షల గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వాటి గురించి అవగాహన పెంచుకోవాలి. ఉదాకు: యూకేలో ఉన్న కొత్త నియమాల ప్రకారం వర్క్ వీసాలను పొందడానికి ముందే కోర్సులను పూర్తిచేయాలి. ఏ యూనివర్సిటీలో, ఏ దేశంలో చదవాలో డిసైడ్ అయ్యేముందు… అక్కడి చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి. ఆ దేశంలో వాతావరణం, వెళ్లబోయే దేశానికి సంబంధించిన సాంఘిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. అక్కడ బాధ్యతగా ఉండాలి… అలా ఉంటూనే ఉన్నత విద్యను చదువుకుంటూనే… మన దేశానికి కూడా గర్వకారణంగా నిలవాలి.
ఉద్యోగావకాశాలు: విదేశాల్లో చదువుకుంటే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తారు. అయితే తాము ఎంచుకున్న రంగంలో కోర్సు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం దొరుకుతుందో లేదో… ముందే చూసుకోవాలి. కొన్ని దేశాల యూనివర్సిటీలకు అంతర్జాతీయంగా మంచి పేరు ఉంటుంది. పరిశ్రమలతోనూ వాటికి రిలేషన్ ఉంటుంది. దానివల్ల ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆయా యూనివర్సిటీలను గుర్తించి జాయిన్ అయితే బెటర్.
Foreign Studies: Are you going abroad for studies? Know these!
The number of students going abroad for higher studies is increasing every year. Before making this important decision which will turn your life along with your career, you should definitely understand the climate and social conditions there. It is not correct to think that we should also go with the idea that people who know us have told us… or that we have friends in the country we are going to. Before taking the decision to study abroad, there are some important things to be aware of.
What is the University studying:
In which country…which university is your chosen course? Engineering, Science, Law. Courses in different departments such as Management, Medicine… are available in USA, UK. Germany is better for engineering and science related courses. Research related courses are good in Australia and Canada. Why are you interested…what kind of career do you want to choose…and choose the country where you want to study.
Budget is very important
To fulfill the dream of studying abroad, the financial situation should be good. Tuition fees, accommodation expenses, books, life insurance etc. should be budgeted beforehand.
Take care of your health:
Know the climate of the country you are going to. From the beginning, the conditions abroad are different from the environment that one is used to. During that time there is a possibility that you will face health problems. For that we also need to know how these health costs are. Health insurance should be taken for medical expenses.
Other Programs:
Not just studying… should be active in other things too. Participate in cultural programs organized in universities. Should be active in cultural performances, games and service activities.
Curiosity is the desire to know: The sooner you adapt to the surrounding conditions, the better. A student’s success depends on such things. Within the university premises
Apart from that, if in dormitories and apartments… awareness of foreign cultural traditions will increase. We should also know the traditions of the country we live in. If you don’t know about them, you will have to face difficulties.
Laws and Restrictions:
Be aware of foreign laws and restrictions. Otherwise you will have to face difficulties. Therefore, awareness should be raised about them. Eg: New rules in UK require completion of courses before getting work visas. Before deciding which university or country to study in, you should create awareness about the laws there. The climate in that country, the social and political conditions of the destination country should be increased. We should be responsible there…while studying higher education while staying like that…we should also be proud of our country.
Job opportunities: Many people think that studying abroad will lead to more job opportunities. But they should check first whether they will get a job immediately after completing the course in their chosen field. Universities of some countries have good international reputation. They have relation with industries also. It can also lead to job opportunities. That is why it is better to identify the respective universities and join.