భారత్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రం గగన్ యాన్. ఇందులో ప్రయాణించేందుకు ఎంపికైన వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోడీ 2024 ఫిబ్రవరి 27 నాడు ప్రకటించారు. వారిని పరిచయం చేశారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళతారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీళ్ళు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నలుగురు వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోడీ పరిచయం చేశారు.
గగన్ యాన్ యాత్ర 2025లో భారత్ నిర్వహిస్తోంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం LVM – మార్క్ 3 రాకెట్ ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగివస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్రజలాల్లో ల్యాండ్ అవుతుంది. శిక్షణలో భాగంగా శారీరక దృఢత్వం, సాంకేతిక విభాగాల్లో వ్యోమగాములు పట్టు సాధించారు. ఈ యాత్ర విజయవంతమైతే మానవసహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ కూడా చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా..
భారత మొదటి అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు.. యుద్ధవిమాన పైలట్లుగా వాయుసేనలో అద్భుతంగా రాణించారు. వారికి 2 వేల నుంచి 3 వేల గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉంది, నలుగురూ పుణెకు దగ్గర్లోని ఖడక్ వాస్లాలో ఉన్న ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)కి ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకొని, పైలట్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వెళ్లారు. అగ్రశ్రేణి యుద్ధ విమానాలైన సుఖోయ్-30MKI. మిగ్-29, మిగ్-21, జాగ్వార్, డోర్నియర్, హాక్ జెట్ లతోపాటు డోర్నియర్, ఏఎన్-32 లాంటి రవాణా విమానాలను కూడా నడిపారు. ఈ నలుగురు.. 13 నెలల పాటు రష్యాలో వ్యోమగామి శిక్షణ పొందారు. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తయారు చేస్తోంది.
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్: 1976లో కేర ళలో జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా నిలిచారు. ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ కూడా దక్కించుకున్నారు. 1998 డిసెంబరులో వాయుసేనలో ఫైటర్ పైలట్ గా చేరారు. 3వేల గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించారు. ‘కేటగిరీ-ఏ’ ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్ హోదాను పొందారు. అమెరికాలోని యూఎస్ స్టాప్ కాలేజీలో శిక్షణ తీసుకున్నారు.
అజిత్ కృష్ణన్: 1982లో చెన్నైలో జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి బంగారు పతకం, స్వోర్డ్ ఆఫ్ ఆనర్ గెల్చుకున్నారు. శిక్షణ తర్వాత 2003 జూన్ లో వాయుసేనలో ఫైటర్ పైలట్ గా చేరారు. యుద్ధం విమానాల చోదకుడిగా 2900 గంటల గగనవిహార అనుభవాన్ని సంపాదించారు. ఫ్లయింగ్ ఇన్ స్టక్టర్ హోదాను సాధించారు.
అంగద్ ప్రతాప్: 1982లో ఉత్తర్ ప్రదేవ్ లోని ప్రయాగ్ రాజ్ లో జన్మించారు. 2004 డిసెంబరులో పైటర్ పైలట్ గా వాయుసేనలోకి ప్రవేశించారు. దాదాపు 2వేల గంటల ఫ్లయింగ్ అనుభవం సంపాదించారు.
శుభాన్షు శుక్లా: 1985లో యూపీలోని లఖ్ నవూలో జన్మించారు. 2006 జూన్ లో ఫైటర్ విమానాల పైలట్ గా చేరారు, దాదాపు 2వేల గంటల ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉంది.
What is Gagan Yan? Who are the four astronauts?
Gagan Yan is India’s ambitious first manned space mission. Prime Minister Narendra Modi announced the astronauts selected to fly in 2024 on February 27. They were introduced. Air Force Group Captains Prashant Balakrishnan Nair, Angad Pratap, Ajith Krishnan and Wing Commander Subhanshu Shukla will go into space. They are going to create history as an Indian team who will make a space trip from Indian territory in an indigenous spacecraft. Prime Minister Narendra Modi introduced the four astronauts at a program held at the Vikram Sarabhai Space Center in Thiruvananthapuram.
India is organizing the Gagan Yatra in 2025. Astronauts are sent into Earth orbit at an altitude of 400 km. LVM-Mark 3 rocket will be used for this purpose. After about 3 days they will return to earth. On the return journey, the spacecraft will land in ocean waters. As part of the training, the astronauts mastered physical fitness and technical disciplines. If this mission is successful, India will also join the ranks of USA, Russia and China in having manned space missions. It is estimated that this project will cost Rs. 9 thousand crores.
Four astronauts who were selected for India’s first space mission, Gagan Yan, excelled as fighter pilots in the Air Force. With 2,000 to 3,000 hours of flying hours of experience, all four were selected for the prestigious National Defense Academy (NDA) at Khadak Wasla near Pune. After completing his training there, he went to the Air Force Academy in Hyderabad for pilot training. Sukhoi-30MKI is the flagship fighter aircraft. They flew MiG-29, MiG-21, Jaguar, Dornier, Hawk jets as well as transport aircraft like Dornier and AN-32. These four have received astronaut training in Russia for 13 months. At present ISRO is manufacturing them at home.
Prashanth Balakrishnan Nair: Born in 1976 in Kerala. He excelled in all disciplines at the Air Force Academy. He also got the ‘Sword of Honour’. He joined the Air Force as a fighter pilot in December 1998. Achieved 3000 hours of flying experience. Obtained the status of ‘Category-A’ Flying Instructor. Trained at US Stop College in America.
Ajith Krishnan: Born in 1982 in Chennai. He won the President’s Gold Medal and Sword of Honor at the Air Force Academy. After training, he joined the Air Force as a fighter pilot in June 2003. He has accumulated 2900 hours of flying experience as a fighter pilot. Achieved the rank of Flying Instructor.
Angad Pratap: Born in 1982 in Prayagraj, Uttar Pradesh. Peter joined the Air Force as a pilot in December 2004. Almost 2000 hours of flying experience.
Subhanshu Shukla: Born in 1985 in Lakh Navoo, UP. Joined as a fighter pilot in June 2006 and has nearly 2000 flying hours of experience.