ఏదైనా సాధించాలంటే లక్ష్యం సరిగా ఉండాలి… టైమ్ అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. అప్పుడే ఎంత పెద్ద టార్గట్ అయినా సాధించవచ్చని నిరూపించారు రేణు రాజ్. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ రెండో ర్యాంక్ సాధించారు. డాక్టర్ గా చదువు ప్రారంభించారు రేణు రాజ్. కానీ తన సేవలకు ఇంకా విస్తరించాలంటే కలెక్టర్ అవడం ఒక్కటే మార్గం అనుకున్నారు. అందుకే సివిల్స్ సాధించి కలెక్టర్ అయ్యారు.
Union Public Service Commission (UPSC) నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి… IAS కు సెలెక్ట్ అయ్యారు రేణు రాజ్. ఇప్పుడు కేరళలో జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

రేణు రాజ్ ది కేరళలోని కొట్టాయం గ్రామం. తన చదువంతా అక్కడే కొనసాగింది. తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గృహిణి. మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళు కూడా డాక్టర్లే. తను కూడా డాక్టర్ కోర్సులో చేరి చదువు పూర్తి చేసింది రేణు రాజ్. తర్వాత డాక్టర్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. కానీ సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉండేది. డాక్టర్‌గా ఎవరో కొందరు రోగులకు మాత్రం సాయం చేయగలను. అదే సివిల్స్ చేసి… కలెక్టర్ అయితే ఇంకా వేల మందికి సాయం చేయొచ్చని నిర్ణయించుకుంది రేణు రాజ్. దాంతో డాక్టర్‌గా పనిచేస్తూనే… UPSC Civils Services పరీక్షకు ప్రిపేర్ అయ్యారు
రేణు రాజ్.. రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు. ఇలా ఏడు నెలల పాటు ప్రిపరేషన్ కొనసాగించారు. మిగిలిన టైమ్ ని డాక్టర్ వృత్తికి కేటాయించేది. ఇలా UPSC Civils Prelims క్లియర్ చేసింది. ఆ తర్వాత Civils Mains Examsకు ప్రిపేర్ అయ్యేటప్పుడు… తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలనుకున్నారు. అలాగైతే సాధించగలమని భావించారు. అందుకే కొన్ని రోజుల పాటు డాక్టర్ వృత్తిని మానేసింది. ఇక పూర్తిగా తన టైమ్ అంతా Civils Mains Exam కోసం కేటాయించారు. IAS Officer కావాలి అన్న ఆశయంతోనే చాలా కష్టపడింది రేణు రాజ్. చివరికి… తన కృషి, పట్టుదల అంతకుముంది లక్ష్యం సాధించాలన్న బలమైన కోరికతో… మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో రెండో ర్యాంకు సాధించింది. చిన్నతనం నుంచి ఉన్న తన IAS కలను అలా సాధించుకుంది
2022లో IAS అయిన శ్రీరామ్ వెంకట్‌రామన్‌ను పెళ్లి చేసుకుంది. అతను కూడా UPSC Civils 2012లో రెండో ర్యాంకు సాధించి IAS అయ్యారు. ఎంత కష్టమైనా సరే… మనం లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే… అంత మంచిది… తలుచుకుంటే సాధించలేనది ఏదీ ఉండదని నిరూపించింది రేణు రాజ్. డాక్టర్ గా పనిచేస్తూనే కలెక్టర్ పదవిని సాధించింది.