---Advertisement---

భారత్ లో తగ్గుతున్న పేదరికం

భారతదేశం పేదరికాన్ని (Poverty) నిర్మూలించిందని విఖ్యాత అమెరికన్ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్ స్టడీస్ (Brookings Studies) తెలిపింది.  2011-12లో దేశ జనాభాలో 12. 2 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా 2022-23లో వారి సంఖ్య 2 శాతానికి తగ్గిందని ఆర్థిక వేత్తలు సూర్జిత్ భల్లా, కరణ్ భాసిన్ (Surjith Bhalla, Karan Bhasin) అధ్యయనంతో తెలిపారు.  2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా ఈ స్టడీ జరిగింది. భారత్ లో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9 శాతం చొప్పున పెరుగుతోంది. గ్రామీణ పేదరికం 2.5 శాతానికి, పట్టణ పేదరికం ఒక శాతానికి తగ్గాయి. గ్రామీణ, పట్టణ అసమానతలు కూడా తగ్గిపోయాయి.

గినీ సూచి (Gini Index) ప్రకారం 100 పాయింట్లు అనేవి అత్యధిక అసమానతను సూచిస్తాయి. భారత్ లో పట్టణ గినీ సూచి 36.7 నుంచి 31.9కీ, గ్రామీణ గినీ సూచి 28.7 నుంచి 27కూ తగ్గిందని అధ్యయనం తెలిపింది. అధిక ఆర్థికాభివృద్ధి రేటు, అసమానతల తగ్గుదల కలసి భారత్ లో పేదరికాన్ని నిర్మూలిస్తున్నాయని వివరించింది. అంతకుముందు దారిద్య్ర స్థాయిలు తగ్గడానికి 30 ఏళ్లు పడితే 2011-12 నుంచి 11 ఏళ్లలోనే అదే స్థాయి తగ్గుదలను సాధించడం విశేషమని ఆర్థికవేత్తలు తెలిపారు.

Decreasing poverty in India

Famous American analysis firm Brookings Studies has said that India has eradicated poverty. In 2011-12, 12.2 percent of the country’s population was below the poverty line, but in 2022-23, their number has reduced to 2 percent, according to a study by economists Surjit Bhalla and Karan Bhasin. The study was based on the consumption expenditure data released by the Government of India for the year 2022-23. Real per capita income in India has been growing at an annual rate of 2.9 percent since 2011-12. Rural poverty has come down to 2.5 percent and urban poverty has come down to one percent. Rural and urban disparities have also reduced.

According to the Gini Index, 100 points represent the highest inequality. According to the study, the urban Gini index in India has decreased from 36.7 to 31.9 and the rural Gini index has decreased from 28.7 to 27. It explained that the high rate of economic development and reduction in inequality are eradicating poverty in India. Economists said that while earlier it took 30 years to reduce the poverty levels, the same level of reduction was achieved within 11 years from 2011-12.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!