---Advertisement---

Indian Currency-Rupee Symbol:  కరెన్సీ – రూపాయి సింబల్

ప్రతి దేశం యొక్క అధికారిక కరెన్సీకి ఓ సింబల్ అనేది ఉంది. అది విశిష్ట చిహ్నం కూడా… అంటే అమెరికా డాలర్ లని  మనం డాలర్ అని రాయకుండా… దానికి సింబల్ వాడితే సరిపోతుంది. అలా రూపాయికి కూడా ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచన 2010లో మన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. అందులో భాగంగానే 2010 జులై 15న భారత కరెన్సీని గుర్తు చేసే విశిష్ట చిహ్నానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ డిజైన్ ను బాంబే IIT ఎక్స్ స్టూడెంట్ డి. ఉదయ్ కుమార్ రూపొందించారు. ఈ రూపాయి చిహ్నాన్ని తయారు చేయడానికి… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2009 మార్చి నెలలో దేశవ్యాప్తంగా పోటీని ప్రకటించింది… అందులో దాదాపు 3 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి.  అప్పట్లో RBI డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్ ఆధ్వర్యంలోని కమిటీ … ఈ డి. ఉదయ్ కుమార్ తయారు చేసిన రూపీ సింబల్ ను ఎంపిక చేసింది.  అతనికి రెండున్నర లక్షల బహుమతిని కూడా ఇచ్చారు.  ఆ తర్వాత ఈ సింబల్ వెంటనే అమల్లోకి రాలేదు.  మన దేశంలో ఈ రూపీ సింబల్ ఇంప్లిమెంట్ చేయడానికి 6 నెలల టైమ్ పట్టింది.  అలాగే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి దాదాపు రెండేళ్ళు పట్టింది. 2010 జులై 15న రూపీ సింబల్ కు ఆమోదం లభించింది… రెండేళ్ళు అంటే దాదాపుగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశంతో జరిపే  లావాదేవీల్లో ఈ రూపీ సింబల్ ను వాడుతున్నాయి.

మన రూపీ సింబల్ విశిష్టత ఏంటో ఓసారి చూద్దాం… ఇది దేవనాగరి లిపిలోని ర…. రోమన్ అక్షరం R ల కలయికతో ఏర్పడింది… ఇందులోని రెండు సమాంతర రేఖలు… దీని విలువ రూపాయికి సమానమని సూచిస్తాయి… విదేశాల్లో పరిస్థితి ఏంటి… ఏయే దేశాలకు ఇలాంటి విశిష్ట చిహ్నాలు ఉన్నాయి అంటే… ఇప్పటిదాకా ప్రపంచంలో అమెరికాకు డాలర్ కు S సింబల్ ఉంది… తర్వాత బ్రిటీష్ కి పౌండ్… L ఆకారంలో ఉంటూ… యూరోపియన్ యూనియన్ యూరో సింబల్ … E ఆకారంలో ఉంటుంది… జపాన్ కు యెన్ కరెన్సీ సింబల్…. ఇది Y ఆకారంలో ఉన్నాయి. ఈ నాలుగు దేశాల తర్వాత… మన ఇండియాకు మాత్రమే Specific symbol ఉంది.

మనకు రూపీ స్సెసిఫిక్ సింబల్ వచ్చాక… కరెన్సీ నోట్లు, నాణేలపై ఈ గుర్తు ప్రింట్ చేస్తున్నారు. అలాగే కంప్యూటర్లు, రైటింగ్ లో.. టైపింగ్ లోనూ వాడుతున్నారు… ఈ గుర్తు అమల్లోకి రాకముందు ఎలా వాడే వాళ్ళం అంటే… ఇండియన్ కరెన్సీని Re లేదా Rs. అని రాసేవాళ్ళం. అయితే ఈ రూపాయి అనేది మన పొరుగు దేశాల్లో కూడా అదే పేరుతో కొనసాగుతోంది. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియాల కరెన్సీని కూడా రూపాయి అనే అంటారు.

రూపాయి specific symbol వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ?

రూపాయికి బ్రండ్ ఇమేజ్ ఏర్పడింది.  అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. అసలు ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మొదటి 5 స్థానాల్లో ఉంది. మన specific symbolతో అంతర్జాతీయ మన కరెన్సీతో ట్రేడింగ్ ఇంప్రూవ్ అవుతోంది. అంతర్జాతీయంగా మన దేశ రూపాయికి పెరిగిన ఆదరణతో దేశంలోకి పెట్టుబడులు కూడా వస్తాయి.

 

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!