ఫిబ్రవరి 2 నాడు అంతర్జాతీయ పాస్ వర్డ్స్ మార్చే రోజుగా జరుపుకుంటారు. అంటే International Change Password Day. ఇలాంటి డే కూడా ఉందా అని ఆశ్చర్యం కలగవచ్చు. ఉంది… అది చాలా అవసరం కూడా. పాస్ వర్డ్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోడానికి చాలామంది ఈజీగా ఉండేలా పెట్టుకుంటారు. అలా పెట్టడం వల్ల సైబర్ క్రిమినల్స్ కు దొరికిపోతున్నారు. వాళ్ళు లక్షలు, కోట్లల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. మెయిల్స్, అకౌంట్స్ హ్యాక్ చేసి… బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు ఇంకొందరు.
చాలామంది తొందరగా గుర్తుకు రావడానికి పాస్ వర్డ్ ను ఈజీగా పెడతారు. జీమెయిల్, పేమెంట్ యాప్స్, ఈ-కామర్స్ యాప్స్, బ్యాంక్ ఖాతాలకు పాస్ వర్డ్స్ కావాలి. స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టుకుంటేనే మన అకౌంట్ భద్రంగా ఉంటుంది. 2023లో చాలామంది యూజ్ చేసని 10 పాస్ వర్డ్స్ చూడండి… మీరే ఆశ్చర్యపోతారు. మరీ ఇంత ఈజీగా పెట్టుకున్నారా అనుకుంటారు.
123456, 123456789, qwerty, password, 12345, qwerty123, 1q2w3e, 12345678, 111111, 1234567890
ఏంటి ఇంత ఈజీ పాస్ట్ వర్డ్స్ పెట్టుకున్నారేంటి అనుకుంటున్నారు కదా… వీటిని కనిపెట్టడం సైబర్ క్రిమినల్స్ కు చాలా ఈజీ. ర్యాండమ్ గా ఇలాంటి పాస్ వర్డ్స్ కొడుతూ… బ్యాంకుల్లో అమౌంట్స్ ని కొల్లగొట్టేస్తున్నారు క్రిమినల్స్. సో… మీరు ఇప్పటికైనా మీ పాస్ వర్డ్ మార్చుకోండి… చాలా స్ట్రాంగ్ గా ఉండేలా పెట్టుకోండి. తరుచుగా వాటిని మారుస్తుండాలి… అలాగే అన్ని అకౌంట్స్ కి ఒకటే పాస్ వర్డ్ పెట్టకుండా… చిన్న చిన్న మార్పులతో వేరే వేరే పాస్ వర్డ్స్ పెట్టుకుంటే బెటర్. ఒక వేళ ఒకటి లీకైనా మీకు ఇబ్బంది ఉండదు. నష్టం కొంతవరకే ఉంటుంది. అన్నీ ఒకటే పాస్ వర్డ్ అయితే…మీ అకౌంట్స్ అన్నీ సైబర్ క్రిమినల్స్ ఊడ్చేస్తారు గుర్తుంచుకోండి. మీ పాస్ వర్డ్ ఎవరికీ షేర్ చేయొద్దు. అది ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది.