---Advertisement---

ఇస్రో పుష్పక్ పరీక్ష సక్సెస్ : ISRO Pushpak success

అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్ ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ఇస్రో కీలక ముందడుగు వేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన Reusable Launch Vehicle (RLV) LX-02 స్వయంగా ల్యాండయ్యే పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి 2024 March 22 నాడు ఉదయం 7.10 గంటలకు ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో ఎక్స్ (ట్విటర్)లో తెలిపింది. విమానం రెక్కల తరహాలో రూపొందించిన ఈ పునర్వినియోగ రాకెట్కు ఇస్రో ‘పుష్పక్ అని పేరు పెట్టింది. ఈ సిరీస్ లో ఇస్రో నిర్వహించిన రెండో పరీక్ష ఇది. గతేడాది కూడా RLV-LEX01 పేరిట ఇస్రో మొదటిసారి పుష్పక్ (PUSHPAK)ను పరీక్షించింది. ఇప్పుడు స్వతంత్య్ర ల్యాండింగ్ కు సంబంధఇంచిన సామర్థ్యాన్ని LEX-02 ద్వారా మరోసారి పరీక్షించింది. దీనికోసం భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ లో పుష్పక్ ను Runwayకు 4 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. మొదట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అక్కడి నుంచి ప్రయాణిస్తూ Runway దగ్గరకు చేరుకున్న పుష్పక్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
అత్యంత కచ్చితత్వంతో Runwayపై దిగిన ఈ వాహక నౌక.. పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేకులు, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో తనకు తానే ఆగిపోయింది. ఎంతో సంక్లిష్టమైన ఈ పరీక్షను విజయవంతం చేసిన బృందాన్ని ఇస్రో (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందించారు. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే సమయంలో RLV విధానం ఎలా ఉంటుంది, హైస్పీడ్ ల్యాండింగ్ ను అది ఎలా నియంత్రించగలుగుతుంది లాంటి పరిస్థితులను ఈ మిషన్ విజయ వంతంగా ప్రదర్శించిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

Isro Pushpak success

ISRO has taken a major step forward in the process of bringing back the rocket which was once launched as part of space debris control. The Reusable Launch Vehicle (RLV) LX-02, specially developed for this purpose, has successfully conducted the self-landing test.
ISRO X said on Twitter that the test was conducted on March 22, 2024 at 7.10 am from the Aeronautical Test Range in Chitradurga, Karnataka. ISRO has named this reusable rocket ‘Pushpak’, modeled on the wings of an airplane. This is the second test conducted by ISRO in this series. Last year also ISRO first tested Pushpak (PUSHPAK) named RLV-LEX01. Now the capability of independent landing has been tested once again by LEX-02. For this, Pushpak was taken to a height of 4.5 km at a distance of 4 km from the runway in a Chinook helicopter of the Indian Air Force. Though there were some bumps in the beginning, Pushpak reached the runway and landed safely.
This carrier which landed on the runway with the utmost precision, stopped itself with the help of parachute, landing gear brakes and nose wheel steering system. ISRO Chairman S Somnath congratulated the team for successfully completing this highly complex test. Sources in ISRO said that the mission successfully demonstrated how the RLV would operate during its return from space and how it could handle a high-speed landing.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!