JEE Main ర్యాంకులు ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ (NTA) తెలిపింది. దాంతో JEE అడ్వాన్స్‌డ్‌కు అప్లయ్ చేసుకోడానికి తేదీలను IIT మద్రాస్ మార్చింది. JEE మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే IITల్లో B.Techలో చేరేందుకు JEE Advanced రాసే అవకాశం కల్పిస్తారు. ఈసారి Advanced పరీక్షను IIT Madras నిర్వహిస్తోంది.
NTA ఏప్రిల్ 25న JEE Main మెయిన్ ర్యాంకులు వెల్లడిస్తే IIT Madras ఏప్రిల్ 27 నుంచి మే 7 సాయంత్రం 5 గంటల వరకు అడ్వాన్స్‌డ్‌కు అప్లికేషన్లను తీసుకునేలా షెడ్యూల్‌లో మార్పు చేసింది. JEE Advanced Exam మాత్రం మే 26న జరుగుతుందని ప్రకటించింది. JEE Main చివరి విడత పేపర్-1 పరీక్షలు ఏప్రిల్ 9న ముగిశాయి. పేపర్-1కు ఈసారి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2.60 లక్షల మంది JEE Mainకు దరఖాస్తు చేసుకోగా 2.40 లక్షల మంది పరీక్షలు రాసినట్టు తెలుస్తోంది.
JEE Main Ranks on 25th April
The National Testing Agency (NTA) said that the JEE Main ranks will be released on April 25. So IIT Madras has changed the dates to apply for JEE Advanced. Only 2.50 lakh candidates who secure the minimum marks in JEE Main will be given an opportunity to write JEE Advanced to get admission in B.Tech in IITs. This time Advanced exam is conducted by IIT Madras.
While NTA will declare the JEE Main ranks on April 25, IIT Madras has changed the schedule to take applications for Advanced from April 27 to May 7 at 5 pm. JEE Advanced Exam has announced that it will be held on May 26. JEE Main Final Phase Paper-1 Exams ended on April 9. 12 lakh people have applied for paper-1 this time. More than 95 percent students attended. Around 2.60 lakh people have applied for JEE Main and 2.40 lakh people have appeared in the two Telugu states.