దేశవ్యాప్తంగా జరుగుతున్న JEE Mains పేపర్ 1 లో ఉదయం వచ్చిన ప్రశ్నాపత్రం కాస్త మధ్యస్థంగానే ఉంది. కానీ రెండో విడతలో వచ్చిన క్వశ్చన్ పేపర్ లో మ్యాథ్స్ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయంటున్నారు విద్యానిపుణులు. ఉదయం పేపర్ లో ఫిజిక్స్ (Physics) ఈజీగా ఉంటే, రసాయన శాస్త్రం (Chemistry) మధ్యస్థంగా ఉంది. ఇక మ్యాథ్స్ (Matsh) నుంచి కొన్ని ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఉన్నాయి. ఈ పేపర్ లో 300 కి 300 మార్కులు తెచ్చుకోవడం విద్యార్థులకు అవకాశం ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఇచ్చిన వాదన – కారణం, స్టేట్ మెంట్ 1, స్టేట్ మెంట్ 2 లాంటివి 8 ప్రశ్నలు దాకా వచ్చాయి. ఈ పేపర్లో ప్రతి విద్యార్థి కూడా 100 మార్కులు తెచ్చుకోవడం కష్టం ఏమీ కాదంటున్నారు సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్. అయితే రెండో విడతలో ఇచ్చిన పేపర్ లో మ్యాథ్స్ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉన్నాయి. ఈ పేపర్ లోనూ 300 మార్కులు వచ్చే ఛాన్సుంది. NCERT నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఫిజిక్స్ లో థియరీ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. 100 మార్కులు తెచ్చుకోవడం ఈజీయే.