---Advertisement---

Mangalyan-2 Mission : అంగారక గ్రహంపైకి మరో ప్రయోగం: మంగళయాన్-2 మిషన్

Mangalyan

సూర్యుడు, చంద్రుడిపై తర్వాత అంగారక గ్రహం రహస్యాలను అన్వేషించేందుకు ఇస్రో మంగళయాన్ 2 ప్రయోగించనుంది. మంగళయాన్‌-1 చారిత్రాత్మక విజయం సాధించడంతో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహంపై మరో ప్రయోగం చేయబోతోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ సక్సెస్ తర్వాత, రెండో ఎడిషన్ మార్టిన్ ఉపరితలంపై రోవర్, హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడం ద్వారా ఓ అడుగు ముందుకు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మిషన్ సక్సెస్‌తో USA, China తర్వాత అంగారక గ్రహంపై Spaceshipను విజయవంతంగా ల్యాండ్ చేసిన మూడో దేశంగా భారతదేశం నిలవనుంది.
ఇస్రోకు చెందిన రోవర్ అంగారకుడిపైకి విప్లవాత్మకంగా చేరనుంది. ఎయిర్‌బ్యాగ్‌లు, ర్యాంప్‌లు లాంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించకుండా, రోవర్ అధునాతన స్కై క్రేన్‌తో మార్స్ ఉపరితలంపైకి సున్నితంగా లాండ్ చేస్తారు. ఈ వ్యవస్థతో అంగారక గ్రహంపై గల క్లిష్టమైన భూభాగంలో కూడా సురక్షితమైన, ఖచ్చితమైన ల్యాండింగ్‌ చేయొచ్చు. బహుశా 20 యేళ్ళ తర్వాత రెడ్ ప్లానెట్‌పై భవిష్యత్తులో మానవ ల్యాండింగ్స్ కోసం ఈ పద్ధతి ఉపయోగించవచ్చు. వీటితో పాటు సూపర్సోనిక్ పారాచూట్ డెవలప్ చేశారు.
అంగారక గ్రహం పలుచని వాతావరణాన్ని కలిగి ఉంది, భూమి కంటే 1% దట్టమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. అందువల్ల పురాతన పారాచూట్‌లు ఇక్కడ పనిచేయవు. ఒక వ్యోమనౌక అధిక వేగంతో అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, దానికి సూపర్‌సోనిక్ పారాచూట్ అవసరం, ఇది వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇది నియంత్రిత, స్థిరమైన ల్యాండింగ్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఘర్షణ కారణంగా ఏర్పడై తీవ్రమైన వేడిని తగ్గిస్తుంది. 2021లో రోవర్ ల్యాండింగ్ కోసం నాసా ఇదే విధానాన్ని ఉపయోగించింది.

అంగారక గ్రహంపై ప్రయోగాలు ఎందుకు ?

సౌర వ్యవస్థలో ఎన్నో గ్రహాలు ఉన్నా… అంగారక గ్రహంపైనే పరిశోధనలకు శాస్త్రవేత్తలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అంటే… వేసవిలో 20 డిగ్రీల సెల్సియస్ నుంచి శీతాకాలంలో మైనస్ 73 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్రమైన ఉష్ణోగ్రత వైవిధ్యాలు అంగారక గ్రహంపై ఉన్నాయి. స్పేస్ ఏజెన్సీలు పంపిన 50కి పైగా మిషన్లలో 50% కంటే సక్సెస్ రేటు ఉన్నప్పటికీ, అంతరిక్ష పరిశోధనలో మార్స్ చాలా ఎక్కువ దేశాలు లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంది.

అంగారక గ్రహంపై దృష్టికి కారణాలు ఇవే !

విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందేమోనని తెలుసుకునే ప్రయత్నం మనుషులు చేస్తున్నారు. అంగారక గ్రహం, సౌర వ్యవస్థలో భూమిని పోలి ఉండే గ్రహం. అందువల్ల అంగారకుడిపై జీవం ఉందోమో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. అంగారక గ్రహం ఒకప్పుడు సమృద్ధిగా నీరు, నదులు, మంచి దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉంది. నివాసయోగ్యమైనది కూడా ఉండేదని కొన్ని పరిశోధనలు తెలిపాయి..
అంగారక గ్రహంపై అగ్నిపర్వతాలు, ఉల్కల ప్రభావం క్రేటర్స్, ఇతర భౌగోళిక ప్రక్రియలను అధ్యయనం చేయడం వల్ల ఆ గ్రహం గురించి మరింత తెలుసుకునే ఛాన్సు ఉంటుంది. ఈ పరిశోధనలతో వాతావరణ నమూనాలు అంగారక గ్రహం నిర్మాణం, పరిణామం గురించి కీలక సమాచారం సేకరించవచ్చు. దాంతో భూ గ్రహాన్ని గురించి మరింత అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అంగారక గ్రహ అన్వేషణకు రోబోటిక్ మిషన్లు ఉపయోగిస్తున్నారు. వీటి సాయంతో భవిష్యత్తులో అంతరిక్షంలో అనేక అన్వేషణల కోసం మనుషుల అవసరం ఉండదు. అంతేకాదు ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఈ మిషన్స్ వనరులను గుర్తిస్తాయి. అలాగే గ్రహం మీద ఎదురయ్యే సవాళ్లను అంచనా వేస్తాయి.

Mangalyan-2 Mission: Another mission to Mars: Mangalyan-2 Mission

ISRO’s Mangalyaan 2 will be launched to explore the mysteries of the Sun, Moon and then Mars. After the historic success of Mangalyaan-1, the Indian Space Research Organization (ISRO) is going to launch another mission to Mars. After the success of Mars Orbiter Mission Mangalyaan, the second edition aims to go a step further by landing a rover and helicopter on the Martian surface. The decision was taken on the occasion of National Technology Day at the Space Application Centre. With the success of this mission, India will become the third country after USA and China to successfully land a Spaceship on Mars.
ISRO’s rover will reach Mars in a revolutionary way. Instead of using traditional methods like airbags and ramps, the rover will gently land on the Martian surface with an advanced sky crane. This system enables safe and precise landings even in difficult terrain on Mars. This method could be used for future human landings on the Red Planet, perhaps 20 years from now. Along with these, the supersonic parachute was developed.
Mars has a thin atmosphere, about 1% denser than Earth. Hence ancient parachutes will not work here. When a spacecraft enters the Martian atmosphere at high speed, it needs a supersonic parachute, which greatly slows it down. It is used to make a controlled and stable landing. Reduces intense heat generated due to friction. NASA used a similar approach for the rover landing in 2021.

Why experiments on Mars?

Although there are many planets in the solar system, why scientists are interested in research on Mars itself is that there are extreme temperature variations on Mars, from 20 degrees Celsius in summer to minus 73 degrees Celsius in winter. Despite a success rate of more than 50% of the more than 50 missions sent by space agencies, Mars remains one of the most targeted projects in space exploration.

These are the reasons for focusing on Mars!

Humans are trying to find out if there is life elsewhere in the universe. Mars is an Earth-like planet in the solar system. Therefore, experiments are being conducted to find out whether there is life on Mars. Mars once had abundant water, rivers, and a fairly dense atmosphere. Some studies have shown that it was habitable too.
Studying volcanoes, meteorite impact craters, and other geologic processes on Mars offers a chance to learn more about the planet. With these findings, climate models can gather important information about the formation and evolution of Mars. With that there will be an opportunity to understand more about the planet Earth.
Robotic missions are used for Mars exploration. With the help of these, humans will not be needed for many explorations in space in the future. Moreover, the cost is also reduced. These missions identify resources. Also assess the challenges faced on the planet.

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!