---Advertisement---

ప్లాస్టిక్ డిప్లొమాతో అద్భుతంగా కెరీర్ : Amazing career with plastic diploma

మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ప్లాస్టిక్ వాడకం లేకుండా జీవించే పరిస్థితి లేదు. ఇలా మన జీవితాలతో ముడిపడిపోయిన ప్లాస్టిక్ రంగంలో కెరీర్ ను డెవలప్ చేసుకుంటే భవిష్యత్తుకు ఏ మాత్రం ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని Central Institute of Petro Chemicals Engineering & Technology (CPET) ప్లాస్టిక్‌ వస్తువులు తయారీ విభాగంలో ముఖ్య సంస్థ. ఇది హైదరాబాద్, విజయవాడ సహా దేశంలో అనేక ప్రాంతాల్లో Diploma, PG Diploma కోర్సులను అందిస్తోంది. వాటిల్లో ప్రవేశాలకు 2024 సంవత్సరానికి ప్రకటన వెలువడింది.

ప్లాస్టిక్, అనుబంధ విభాగాలకు చెందిన పరిశ్రమల్లో ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో Central Institute of Petro Chemicals Engineering & Technology (CPET) ఏర్పాటైంది. దీన్ని అంతకుముందు Central Institute of Plastic Engineering & Technology అని పిలిచేవారు.
ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే కేంద్రాల్లో ప్లాస్టిక్ లో Diploma, PG Diploma కోర్సులను అందిస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టుతో వీటిల్లో జాయిన్ అవ్వొచ్చు. అంతేకాదు… కోర్సు పూర్తయ్యాక Campus Recruitment తో మంచి సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ONGC, Voltas, Milton, Celo, L & T, Maruti Suzuki, Reliance, IFB, BPL, HCL, Asian Paints, Butter Fly, TATA లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగాల్లో తీసుకుంటున్నాయి.
Automative, Packaging, Consumer Goods, Machine Manufacturing, Electrical & Electronics, Research & Development లాంటి రంగాల్లో Plasticపై నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. మొదట్లో జీతాలు తక్కువైనా కొన్నేళ్ల అనుభవం సంపాదిస్తే మంచి శాలరీస్ అందుతాయి. అవసరమైతే సొంతంగా పరిశ్రమను కూడా పెట్టుకోవచ్చు.
దేశంలోని 30 CPET కేంద్రాల్లో Diploma, PG Diploma కోర్సులను అందిస్తున్నారు.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో కూడా కేంద్రాలు ఉన్నాయి.

ఏ కోర్సులకు ఏ అర్హతలు?
1) Diploma in Plastics mould Technology (DPMT)
Duration: 3 Years(6 Semisters)
Edu.Qln: 10th/ సమాన స్థాయి ఉత్తీర్ణత. పరీక్షలు రాసి, ఫలితాల కోసం చూస్తున్నవాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Entrance Test :
General Knowledge : 25, Science 20, English 5 Qnsవస్తాయి.

2) Diploma in Plastics Technology (DPT)
Duration : 3 Yrs (6 Semisters)
Edu.Qln: 10th/సమాన స్థాయి ఉత్తీర్ణత.
పరీక్షలు రాసి, ఫలితాల కోసం చూస్తున్నవాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Entrance Test :
General Knowledge : 25, Science 20, English 5 Qnsవస్తాయి.

3) Post Diploma in plastics Mould design with CAD/CAM (PD-PMD)
Duration: 18 Months (3 Semisters)
Edn.Qln: Mechanical/Plastic Technology/ Tool/ Production/ Automobile/ Mechatranics/ Tool Die & Making / CPET నుంచి DPMT/DPT వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. చివరి ఏడాది కోర్సులో ఉన్నవాళ్ళు కూడా అర్హులే
Entrance Exam:
GK -20, Science-10, Eng-10 qns & సంబంధిత Diploma నుంచి 10 ప్రశ్నలు

4) Post Gradudate Diploma in Plastics processing & Testing (PGD-PPT)
Duration: 2 Yrs (4 Semisters)
Qln: ఏదైనా సైన్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు కూడా అర్హులే.
Entrance Exam:
GK- 20, Science 10, English 10, B.Sc స్థాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్‌ 10 ప్రశ్నలు వస్తాయి.

ఈ కోర్సులన్నీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఉన్నాయి. PD-PMD తప్ప మిగిలిన కోర్సులు విజయవాడలో ఉన్నాయి. అన్ని కోర్సులకూ ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
Entrance Exam ఎలా ఉంటుంది ?
అన్ని కోర్సులకూ Entrance Test ను Onlineలో విడిగా నిర్వహిస్తారు. Time duration 60 Minutes.
ప్రశ్నలన్నీ Objective తరహాలో ఉంటాయి. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కులు లేవు.
Model Papers కావాలి అంటే CPET వెబ్‌సైట్‌లో ఉన్నాయి. GK లో
Sports, History, Politics, Computer Science, Entertainment, Current Affairs ప్రశ్నలు వస్తాయి. 3 Years డిప్లొమా కోర్సుల్లో Science, English ప్రశ్నలు Tenth సిలబస్‌ స్థాయిలో ఉంటాయి.

CPET ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు చివరి తేదీ: మే 31.
ఎగ్జామ్ ఫీజు: రూ.100.
ప్రవేశ పరీక్ష తేదీ: 2024 June, 9
పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ ను సందర్శించండి. https://www.cipet.gov.in/

====================================================================

Amazing career with plastic diploma

We cannot live without the use of plastic from the time we wake up in the morning to the time we go to bed at night. Experts say that if we develop a career in the field of plastic, which is so closely connected with our lives, there will be no harm in the future.

The Central Institute of Petro Chemicals Engineering & Technology (CPET) under the Central Government is a key institution in the plastic goods manufacturing sector. It offers Diploma and PG Diploma courses in many parts of the country including Hyderabad and Vijayawada. The announcement for admissions in them has been released for the year 2024.

Central Institute of Petro Chemicals Engineering & Technology (CPET) has been established in Chennai under the Ministry of Chemicals and Fertilizers with the aim of providing employment in the industries of plastics and allied sectors. It was earlier known as Central Institute of Plastic Engineering & Technology.
Diploma and PG Diploma courses in Plastics are being offered in the centers working under the auspices of this organization. You can join these by taking the entrance test. Moreover… After completing the course, there is a chance to get jobs in good companies with Campus Recruitment. Big companies like ONGC, Voltas, Milton, Celo, L & T, Maruti Suzuki, Reliance, IFB, BPL, HCL, Asian Paints, Butter Fly, TATA are hiring.
Opportunities are provided to those who have expertise in Plastic in fields like Automotive, Packaging, Consumer Goods, Machine Manufacturing, Electrical & Electronics, Research & Development. Although initially the salaries are low, after gaining a few years of experience, you will get better salaries. If necessary, you can also set up your own industry.
Diploma and PG Diploma courses are offered in 30 CPET centers of the country.
Our two Telugu states also have centers in Hyderabad and Vijayawada.

What are the qualifications for which courses?
1) Diploma in Plastics Mold Technology (DPMT)

Duration: 3 Years(6 Semesters)
Edu.Qln: 10th/ Equivalent Pass. Those who have written the exams and are looking for the results can also apply.
Entrance Test :
General Knowledge : 25, Science 20, English 5 Qns.

2) Diploma in Plastics Technology (DPT)
Duration : 3 Yrs (6 Semesters)
Edu.Qln: 10th/Equivalent Pass.
Those who have written the exams and are looking for the results can also apply.
Entrance Test :
General Knowledge : 25, Science 20, English 5 Qns.

3) Post Diploma in plastics Mold design with CAD/CAM (PD-PMD)
Duration: 18 Months (3 Semesters)
Edn.Qln: Mechanical/Plastic Technology/ Tool/ Production/ Automobile/ Mechatronics/ Tool Die & Making / Three year diploma pass in any of these from CPET to DPMT/DPT. Those in final year course are also eligible
Entrance Exam:
10 questions from GK-20, Science-10, Eng-10 qns & related Diploma

4) Post Graduate Diploma in Plastics Processing & Testing (PGD-PPT)
Duration: 2 Yrs (4 Semesters)
Qln: Any science degree pass can apply. Those studying final year courses are also eligible.
Entrance Exam:
GK- 20, Science 10, English 10, B.Sc level Chemistry, Physics, Biology, Maths 10 questions will come.

All these courses are in Hyderabad campus. Other than PD-PMD courses are in Vijayawada. Any age can apply for all courses.
How is the entrance exam?
Entrance Test for all courses will be conducted separately online. Time duration 60 Minutes.
All the questions are objective type. There will be total 50 questions. No negative marks.
Model Papers are available on CPET website. In GK
Sports, History, Politics, Computer Science, Entertainment, Current Affairs questions will come. In 3 Years Diploma Courses, Science and English questions are at Tenth Syllabus level.

Last Date for CPET Online Applications: May 31.
Exam Fee: Rs.100.
Entrance Test Date: 2024 June, 9
Visit this website for complete details.  https://www.cipet.gov.in/

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!