---Advertisement---

Staff Selection Commission : టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వం కొలువులు – తెలుగులోనే SSC MTS… ప్రిపరేషన్ ఎలా ?

Staff Selection Commission(SSC) నిర్వహించే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నాన్ టెక్నికల్, హవల్దార్ పోస్టులకు ప్రకటన రిలీజ్ అయింది.  టెన్త్ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయొచ్చు.  తెలుగులో ఎగ్జామ్ రాసుకోడానికి అనుమతి ఉంది.  ఈ పోస్టుల్లో చేరి వారికి ఫస్ట్ నెల నుంచి రూ.35,000 ల దాకా శాలరీ వస్తుంది. మొత్తం 8326 పోస్టులకు ఈసారి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

మొత్తం ఖాళీలు: 8326. ఇందులో MTS : 4887, హవల్దార్ 3439 పోస్టులు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి MTS పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 – ఆగస్టు 1, 2006 మధ్య  పుట్టిన వారై ఉండాలి.

హవల్దార్, MTS లో కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వారికి అర్హత ఉంది. ఆగస్టు 2, 1997 –

ఆగస్టు 1, 2006 మధ్య పుట్టిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.

అన్ని పోస్టుల్లోనూ SC, STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10యేళ్ళ గరిష్ట వయో పరిమితి వర్తిస్తుంది.

ఆన్ లైన్ అప్లయ్ చేసుకోడానికి గడువు: జులై 31.

అప్లికేషన్ ఫీజు: రూ. 100, మహిళలు, SC, ST, దివ్యాంగులు ఫీజులు చెల్లించనక్కర్లేదు

ఎగ్జామ్స్ : అక్టోబరు-నవంబరులో జరుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

APలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి,

విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.

తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్,

Website :https://ssc.gov.in/

ప్రతి యేటా SSC రిలీజ్ చేసే MTS & హవల్దార్ పోస్టులకు ఖాళీలు వేలల్లో ఉంటాయి. దీనికితోడు విద్యార్హత టెన్త్ కావడంతో ఎక్కువ మంది పోటీ పడుతుంటారు.  అభ్యర్థులు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మాత్రం అంత కష్టం కాదు.  గట్టిగా కష్టపడితే ఫస్ట్ ఎటెంప్ట్ లోనే కొలువు కొట్టొచ్చు.  మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ రెండూ లెవెల్-1 ఉద్యోగాలే. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ పోస్టుల్లో చేరినవారు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ

శాఖలు/ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో పనిచేస్తారు. హవల్దార్ గా ఎంపికైనవారు

కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్

బ్యూరోలో సేవలందిస్తారు. హవల్దార్ పోస్టులకు PET, PST ఉంటాయి.

ఎగ్జామ్స్ ఎలా ?

SSC MTS కోసం ఎగ్జామ్ 2 సెషన్లుగా ఉంటుంది. ఈ రెండు సెషన్లలోనూ ప్రతి ప్రశ్నకు 3 మార్కులు.  మొత్తం 270 మార్కులకు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఒక్కో సెషన్ టైమ్ 45 నిమిషాలు.

సెషన్-1లో: న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 మొత్తం 40 ప్రశ్నలు వస్తాయి. వీటికి నెగిటివ్ మార్కింగ్ లేవు.

సెషన్-2లో జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25

మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ సెషన్లో రాంగ్ ఆన్సర్ కి ఒక మార్కు తగ్గిస్తారు.

పరీక్షలో అర్హత పొందాలంటే ప్రతి సెషన్లోనూ జనరల్ అభ్యర్థులు 30, OBC/ EWSలు 25, ఇతర విభాగాల వారు 20

శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కుల పొందినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్లు ప్రకారం ఉద్యోగంలోకి తీసుకుంటారు.

PET : హవల్దార్ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఉంటుంది. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో.. మహిళలు ఒక కిలోమీటర్ని 20 నిమిషాల్లో చేరుకోవాలి.

PND: పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరిగి 81 నెం. మీ. తక్కువ కాకుండా ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఎత్తు, 48 కి. గ్రా. బరువు అవసరం.

ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ?

SSC MTS ఎగ్జామ్ లో  ప్రశ్నలు టెన్త్ లెవల్లోనే ఉంటాయి. తేలికగా, సాధారణ స్థాయిలోనే ఉంటాయి. కొంచెం ప్రిపరేషన్ అయితన ఎక్కువ ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు.

Numerical & Mathematical Ability :

ఇది అంకెలు, సంఖ్యలతో ముడిపడి ఉంటాయి. పూర్ణ సంఖ్యలు, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభ నష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., అంకెల మధ్య సంబంధాలు, బాడ్మాస్, స్క్వేర్, స్క్వేర్ రూట్.. లాంటి లెసన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్ మ్యాథ్స్ పుస్తకాల్లో ఇవన్నీ మీరు నేర్చుకున్నవే. మీరు ముందు నుంచి మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి.

Reasoning Ability & Problem solving :

ఇందుదలో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్- డీకోడింగ్, ఎనాలజీ, డైరెక్షన్లు, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు, వయసును లెక్కించడం, క్యాలెండర్, క్లాక్… లాంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మ్యాథ్స్ లో బేసిక్స్ మీద పట్టు ఉండాలి. ఎక్కువ అనలిటకల్ ప్రశ్నలు ఇస్తారు. బాగా ఆలోచిస్తే.. ఆన్సర్లు రాయొచ్చు.

General Awareness :

హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, కళలు, సంస్కృతి లాంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి హైస్కూల్ సోషల్ పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది.

English Language & Comprehension : అభ్యర్థి Basic Englishని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.

Fill in the blanks, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్ధాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను systematicలో అమర్చడం, కాంప్రహెన్షన్.. లాంటి అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్ స్థాయి ఇంగ్లీష్ టెక్ట్స్ బుక్స్ లోని గ్రామర్ ఫాలో అయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

ఫైనల్ గా ఈ సూచనలు పాటించండి:

SSC MTS నోటిఫికేషన్ లో ఇచ్చిన సిలబస్ ను పరిశీలించండి. వాటిని బాగా చదవండి. ఈ ఎగ్జామ్ అక్టోబరు-నవంబరులో జరుగుతుంది. అందువల్ల మీరు గట్టిగా ప్రిపరేషన్ మొదలుపెడితే 100 నుంచి 150 డేస్ టైమ్ ఉంటుంది. ఈ టైమ్ అనేది మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి సరిపోతుంది.

(1) ముందుగా… సిలబస్ లోని అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ… సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోండి. డే వైస్, వీక్లీ వైస్, మంత్లీ వైస్ గా ఉండాలి… మీరు పెట్టుకున్న లెసన్స్… ఏ రోజు కారోజు పూర్తయ్యేలా ఉండాలి. ఛార్ట్ తయారు చేసుకొని దాన్ని ఆచరించకపోతే ఉపయోగం లేదు. ముందు ఒక్క నెల ఖచ్చితంగా మన ఛార్ట్ ఫాలో అయ్యామా లేదా అన్నది చెక్ చేసుకోండి. తర్వాత దాంట్లో మార్పులు, చేర్పులు ఉంటే చేసుకోండి. ఒక వేళ మీరు కొన్ని సబ్జెక్టులు లేదంటే లెసన్స్ లో తక్కువ మార్కులు వస్తున్నాయి… కొంచెం వెనకబడి ఉన్నాం అనుకుంటే… అడిషనల్ టైమ్ కేటాయించుకొని… మీ సిలబస్ ఛార్ట్ లో మార్పులు చేసుకోండి.

(2) సిలబస్ లో ఇచ్చిన అంశాల ప్రకారం 8,9,10 క్లాసుల మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ పుస్తకాలు బాగా స్టడీ చేయండి.

(3) అన్ని విభాగాలకూ సమాన ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల మీకు అవగాహన లేనివి… లేదంటే కొంచెం హార్డ్ అనుకున్న సబ్జెక్టులు లేదా లెసన్స్ కి అడిషనల్ టైమ్ పెట్టి ప్రాక్టీస్ చేయండి.

(4) ఎగ్జామ్స్ లో… ముఖ్యంగా మ్యాథ్స్ లో స్పీడ్ కోసం షార్ట్ కట్ మెథడ్స్… స్పీడ్ మ్యాథ్స్ అలవాటు చేసుకోవాలి. రి.

(5) ఒక్కసారి సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యాక… ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. దాని వల్ల ప్రశ్నల స్థాయి ఎలా ఉంది… ఏయే అంశాలకు ప్రియారిటీ ఇస్తున్నారన్నది తెలుస్తుంది. ఎక్కువగా మాక్ టెస్టులు రాయాలి. ఎన్ని ఎక్కువ రాస్తే అంత మంచిది…

(6) కనీసం 20 గ్రాండ్ టెస్టులు అయినా రాయాలి. గ్రాండ్ టెస్టు పూర్తి అవగానే… మీకు తప్పులు ఎక్కడెక్కడ పోయాయో గమనించాలి. సబ్జెక్టులు, లెసన్స్ వారీగా ఎక్కడ తప్పు చేస్తున్నారో చూసుకొని వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి.

(7) చివరి వారం, పది రోజులు రివిజన్ కు కేటాయించండి.

Ssc mts ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చు… కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లయ్ చేయండి…

ఆన్ లైన్ అప్లయ్ చేసుకోడానికి గడువు: జులై 31. అంటే ఈ నెలాఖరు దాకా ఉంది.

https://youtu.be/7Ik3Ursz9cM

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!