---Advertisement---

Telangana Jobs 2024: 2 లక్షల ఉద్యోగాలు సరే ! ఖాళీలు 30 వేలేనా ?

తెలంగాణలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదే హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 2 లక్షల కొలువులు ఖాళీగా లేవంటున్నారు నిపుణులు. 30 వేలకు మించి లేవని చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా గ్రూప్ 1 పోస్టులు 60 మాత్రమే ప్రకటించారు. ఇంకా ఈ ఏడాదిలో Retired Employees ని కూడా లెక్కలోకి తీసుకున్నా ఇంకో 20 వేల పోస్టులు పెరిగే ఛాన్సుంది.
2021 లో బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో 1.96 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. ఇది బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. బిశ్వాల్ కమిటీ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల గుర్తింపులో కొన్ని తప్పులు చేసింది. స్టెనో గ్రాఫర్స్, టైపిస్టులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలైన డ్రైవర్ల, స్వీపర్లు లాంటి పోస్టులను కూడా ఇందులో చేర్చింది. కానీ ఈ పోస్టులను ఇప్పటికే ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంటోంది. టైపిస్టుల పోస్టులు ప్రస్తుతం లేవు. వాటి స్థానంలో కంప్యూటర్ ఆపరేటర్లును రిక్రూట్ చేసుకున్నారు. ఖాళీ ఉద్యోగాల్లో కొన్నింటిని tspsc, ఇతర ఏజెన్సీలకు ఇచ్చి Direct Recruitment ద్వారా భర్తీ చేస్తారు. ఇంకొన్ని ప్రమోషన్లతో ఫిలప్ అవుతాయి. ఎంత చేసినా ఖాళీలు 25 వేల నుంచి 30 వేలు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు.
2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 యేళ్ళకు పెంచడం కూడా నిరుద్యోగులకు శాపంగా మారింది. రెండేళ్ళుగా రిటైర్మెంట్స్ తగ్గాయి. ఈ సంవత్సరమే ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు.
అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం… ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కాకున్నా… కనీసం 50 నుంచి 60 వేల కొలువులు అయినా భర్తీ చేయాలి. అప్పుడే నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం కలుగుతుంది.

COMING SOON….

---Advertisement---

Related Post

---Advertisement---

LATEST Post

error: Content is protected !!