వ్యవసాయ శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 917 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆశాఖలో కొన్నేళ్ళుగా పదోన్నతులు లేవు. కొత్తగా నియామకాలు కూడా జరగడం లేదు. దాంతో గ్రౌండ్ లెవల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమవుతోంది. తెలంగాణ వ్యవసాయ శాఖలో ఇప్పటి వరకూ 917 ఖాళీలు ఉన్నాయి. ప్రమోషన్ల ప్రక్రియ కూడా పూర్తయితే మరో 539 పోస్టులు ఖాళీలు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు. నిజానికి కొత్త పోస్టులను ప్రకటిస్తామని 2021లోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అది నెరవేరలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొత్త పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలవుతుందని భావిస్తున్నారు.
Post Views: 93