రాష్ట్రంలో ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. త్వరలోనే పోలీసు శాఖలో 15వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలోనూ మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వైద్యశాఖలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్‌నర్సులకు హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జాయినింగ్ లెటర్స్ అందించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు సీఎం. కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించామని త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పారు.
Post Views: 94