రూ.2.5 లక్షల ఉద్యోగం వదిలేశాడు…:సివిల్స్ టాపర్ ఆదిత్య సక్సెస్ స్టోరీ

రూ.2.5 లక్షల ఉద్యోగం వదిలేశాడు…:సివిల్స్ టాపర్ ఆదిత్య సక్సెస్ స్టోరీ

సివిల్స్ టాపర్ ఆదిత్య శ్రీవాస్తవ (Aditya Srivastava)… బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి… పట్టా తీసుకుంటూనే… ప్రపంచ దిగ్గజ సంస్థ గోల్డ్ మన్ సాచెస్ లో నెలకు 2.5 లక్షల రూపాయల జీతంతో మంచి ఉద్యోగం సంపాదించాడు. బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశాడు… అయినా ఏదో తెలియని అసంతృప్తి… జనానికి ఇంకా ఏదో సేవ చేయాలన్న ఆలోచన… పేదలను ఆదుకోవాలన్న తపనతో ఉద్యోగానికి రిజైన్ చేసి UPSC సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.
మొదటిసారి ఫెయిల్
రెండోసారి పాక్షిక విజయం
మూడోసారి పూర్తి విజయం… అనుకున్న లక్ష్యం చేరాడు
ఇది అలాంటిది ఇలాంటిది కాదు… ఏకంగా సివిల్స్ లో దేశవ్యాప్తంగా నెంబర్ 1 ర్యాంక్…

Civils Topper ఆదిత్యశ్రీవాస్తవ సక్సెస్ సీక్రెట్ ఏంటి ?

* ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ప్రాథమిక అంశాల నుంచి సొంతంగా చదువుకున్నాను. ఇద్దరు మెంటర్స్ సాయం తీసుకొని Civils Exam గురించి తెలుసుకుంటూ prepare అయ్యారు.
*ఒక వైపు Text books చదువుతూనే మరోవైపు Model Tests రాశారు..
*అక్టోబర్ 2020 నుంచి preparation మొదలు పెట్టి 2021లో మొదటిసారి Civils రాశారు. అప్పుడు ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. 85 మార్కులు మాత్రమే రావడంతో మెయిన్స్ కి అర్హత సాధించలేదు. ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. Hard work తో పాటు smart work చేశారు.
*రక రకాల టెస్ట్ సిరీస్ లు రాశారు. ఒక టాపిక్ రాకపోతే ఎన్ని గంటలైనా కానీ దాని మీదే కూర్చునేవారు.
*ప్రిలిమ్స్ మీద బాగా దృష్టిపెట్టి… Civils 2nd attempt లో 114 మార్కులతో మెయిన్స్, ఇంటర్వ్యూలకూ అర్హత సాధించి..IPSకు ఎంపికయ్యారు. రెండోసారి లక్ష్యానికి దగ్గరగా వచ్చినా తాను అనుకున్న IAS రాలేదు.
* రోజుకు ఇన్ని గంటలు చదవాలని rule ఏమీ పెట్టుకోలేదు. ఎంత టైమ్ పట్టినా…. డైలీ టార్గెట్స్ పూర్తిచేసేవారు.
* వ్యాసాలు రాసేటప్పుడు వాక్య నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై బాగా దృష్టిపెట్టారు
* మిగతా టాపర్లు ఏ పుస్తకాలు చదివారో… తాను కూడా అవే చదివారు. తనలో వేరే ఎలాంటి ప్రత్యేకతలు లేవని ఆదిత్య చెప్పారు.
* మన Preparationలో స్థిరత్వం, వ్యక్తిత్వంలో నిజాయతీ, సమాధానాల్లో stratight forwardness (ముక్కుసూటితనం) ఉండాలి. ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలి.
* అప్పుడే మిగతా వాళ్ళ కంటే మనల్ని భిన్నంగా నిలబెడతాయి.
* స్థిరత్వం (constiency) అనేదే UPSC preparation మంత్రం. నిరంతర ప్రేరణ ఉండాలి. ఎక్కడా సంకల్పం సడలకూడదు. * యుద్ధంలో వ్యూహం ఎంత ముఖ్యమో ఈ Preparationలో Planning కూడా అంతే ముఖ్యం. అనుకున్న ప్లాన్ ను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకూడదు.
* ఒకవేళ అది మంచి రిజల్ట్స్ ఇవ్వలేదని భావిస్తే… మళ్లీ ఆలోచించి వ్యూహాత్మకంగా plan రెడీ చేసుకోవాలి.
* అభ్యర్ధులు అందరూ అవే పుస్తకాలు చదువుతారు. కానీ ఎలా చదువుతున్నాం అనే దానిలోనే Success అనేది ఉంది.
* ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా వీలైనన్ని Model Mock Interviewsకు attend కావాలి. అప్పుడే మనం ఎక్కడ బలంగా ఉన్నాం…. ఎక్కడ ఇంకా improve చేసుకోవాలి తెలుస్తుంది.

ఆదిత్యకు మార్కులు ఎన్నంటే ? ఏ సబ్జెక్ట్ తో స్కోరింగ్ ?

Civils Topper గా Aditya Srivastava స్కోరు 54.27% వచ్చింది. మెయిన్స్ పరీక్షలో 1750 మార్కులకు 1089 సాధించారు.

*ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆసక్తి ఉన్న సబ్జెక్టు కావడంతో ఆప్షనల్ గా దాన్ని ఎంచుకున్నారు.
*అభ్యర్ధులు ఈ సబ్జెక్టు అయితే స్కోరింగ్ కి అవకాశాలు ఎక్కువ, మరో సబ్జెక్టు అయితే సులభం అని అనుకోకుండా మొదటి నుంచి ఎందులో పట్టు ఉంటే ఆ సబ్జెక్టులోనే ప్రయత్నించాలి.
* విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేసే ఆప్షనల్ విషయంలో పొరపాట్లు చేయొద్దు.
* 2022లో IPS కు ఎంపికైనా.. తిరిగి IAS కోసం ప్రయత్నించడానికి కారణం ఏంటంటే… మనకు వచ్చింది చేయడం కాదు, నచ్చినదాని కోసం పోరాడాలి అని…
* UPSC Preparation లో మన తప్పులే మనకు మెయిన్ గా పోటీగా నిలుస్తాయి. వాటిని ఓడిస్తే అప్పుడు విజయావకాశాలు మెరుగుపడతాయి.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!