మనం GPS ఫాలో అవుతూ కూడా అప్పుడప్పుడూ రోడ్ మీద దారి తప్పుతాం… ఎటో వెళ్ళిపోతుంటాం. కానీ విమానం ఖచ్చితంగా ఒక ప్లేస్ లో ఎలా దిగగలుగుతోంది?
ఎలా అంటే…..
విమానంలో FMS (Flight Management System) అని ఉంటుంది. ఫ్లైట్ స్టార్ట్ చేసే ముందు Pilots FMS లో ఎక్కడికి వెళ్ళాలి అని ఫీడ్ చేస్తారు. బయలు దేరే airport నుంచి వెళ్లే airport వరకు ఒక fixed way ఉంటుంది…. ఆ రూట్ లోనే విమానం వెళ్తుంది. పక్కకి వెళ్ళడానికి వీలు పడదు. ఒక వేళ దారిలో ఏదైనా ఇబ్బంది అంటే… వాతావరణం సరిగా లేకపోతే… పర్మిషన్ తీసుకొని కొంచెం రూట్ మార్చుకొని తిరిగి మాములు రూట్ లోకి రావాల్సి ఉంటుంది.
అలాగే, FMS లో ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ తో ఆటో పైలట్ విమానాన్ని దిగాల్సిన airport వరకు తీసుకు వెళ్తుంది. తరువాత ILS (Instrument Landing System) ద్వారా గైడెన్స్ తీసుకొంటూ పైలట్ విమానాన్ని ల్యాండ్ చేస్తారు.