9 టిప్స్ తో గ్రూప్ 2 ఆఫీసర్ పోస్ట్ మీ సొంతం… 9 TIPS FOR GROUP.2

9 టిప్స్ తో గ్రూప్ 2 ఆఫీసర్ పోస్ట్ మీ సొంతం… 9 TIPS FOR GROUP.2

చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుకున్నట్టే TGPSC  గ్రూప్2 వాయిదా పడింది.  ప్రస్తుతం ఉన్న 783 పోస్టుల స్థానంలో రెండు వేల పోస్టుల దాకా పెంచాలన్న డిమాండ్ చేశారు.  పోస్టుల సంఖ్య పెంచడంపైనా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. గవర్నమెంట్ పని అది చేస్తుంది… ఇప్పుడు మీరేం చేయాలి… మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి… ఎలా ప్రిపేర్ అవ్వాలి… 4 నెలలకు పైగా టైమ్ ఉంది… ఈ టైమ్ ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు… నేను 9 పాయింట్స్ చెబుతా… అవి రోజూ ఫాలో అవ్వండి… గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారు.

ఈ ఆర్టికల్ ను మీరు వీడియోలో కూడా చూడొచ్చు .. ఈ లింక్ క్లిక్ చేయండి. (CLICK HERE) 9 సూత్రాలతో గ్రూప్ 2 ఆఫీసర్ పోస్ట్ మీ సొంతం

Point No.1 : అన్ని పేపర్ల సిలబస్ తో కంబైన్డ్ స్టడీ 

మీరు మొదటిసారి TGPSC ఎగ్జామ్స్ రాస్తున్నా… లేదంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నా… ముందుగా మీరు Exam pattern, Syllabus ఏంటి అన్నది చూసుకోండి.  మొత్తం నాలుగు పేపర్లకు 150 మార్కుల చొప్పున 600 మార్కులకు పేపర్ ఉంటుంది.  జనరల్ స్టడీస్ తో పాటు మిగతా పేపర్లలో ఏయే సిలబస్ ఉందో చెక్ చేసుకోండి. కొన్ని పేపర్లలో సిలబస్ కామన్ గా ఉంటుంది… అప్పుడు కంబైన్డ్ గా చదువుకోవడం… అంటే జనరల్ స్టడీస్ లో

Indian History- Culture,

Telangana History-culture,

Social Issues, Society

Indian Constitution – Polity

Indian Economy , TG Economy ఇవి కామన్ గా జనరల్ స్టడీస్ తో పాటు మిగతా పేపర్లలో కవర్ అవుతాయి. అందుకే కంబైన్డ్ గా చదువుకోవాలి.

కొత్తగా గ్రూప్ 2 రాసేవాళ్ళే కాదు… పాత వాళ్ళు కూడా ఈ ప్లానింగ్ తో వెళ్ళాలి.

Point 2 : బుక్స్, మెటీరియల్ సేకరించుకోండి

కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు … బుక్స్ సేకరించుకోండి… తెలంగాణ గ్రూప్ 1, 2 అసోసియేషన్ వాళ్ళు ప్రిఫర్ చేసిన బుక్స్ తో పాటు…తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ… ఇంకా స్టేట్ లో ఉన్న ఫేమస్ ఫ్యాకల్టీస్ రాసిన బుక్స్ మార్కెట్లో ఉన్నాయి… వాటిని తీసుకోండి… ఏయేం బుక్స్ గ్రూప్ 2 కి అవసరం అన్నది నేను వీడియో ఇస్తాను… ఫాలో అవ్వండి.

పాత వాళ్ళయితే కొత్తగా బుక్స్ పెద్దగా ఏమీ కొనొద్దు… కేవలం ఎకానమీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఫాలో అవ్వండి.  మార్కెట్లో కొత్తగా వచ్చే బుక్స్ తో పాటు… డైలీ పేపర్లలో ఎకానమీ, పాలిటీ అంటే కోర్టు తీర్పులు లాంటి వాటిని ఫాలో అవ్వండి.  ముఖ్యంగా… కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లు ఇచ్చాయి. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాయి… ఈనెల్లోనే పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. వాటితో పాటు 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండు గవర్నమెంట్స్ ఇచ్చే ఆర్థిక నివేదికలు ఫాలో అవ్వాలి. వాటిని దాచి పెట్టుకోండి.

Point 3 : సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోండి – Day wise, Weekly, Monthly wise

మన యాప్, యూట్యూబ్ ఛానెల్, మన యాప్స్ లో టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళకి అవగాహన ఉండే ఉంటుంది.  ఎంత తోపు UPSC, CIVILS, SSC, TGPSC ఇంకా ఏదైనా సరే… సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోకుండి… మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేరు… మస్ట్ గా సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోండి. ఆ సిలబస్ ఛార్ట్… డే వైజ్, వీక్లీ వైజ్, మంత్లీ వైజ్ గా ఉండాలి… డిసెంబర్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగే వారం ముందు వరకూ కూడా ఈ సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో… మన ఛానెల్ లో వీడియో ఉంది… ఒక్కసారి చూడండి.  లేదంటే మళ్ళీ ఇంకో వీడియో రేపు, ఎల్లుండిలోనే ఇస్తాను.

Point 4 : Time Management 

టైమ్… టైమ్…. టైమ్… Time management (Click for video) లేకపోతే కూడా మీరు ఏ ఎగ్జామ్ ను కొట్టలేరు.  రోజుకి ఎన్నిగంటలు ప్రిపేర్ అవ్వాలి… ఏ టైమ్ లో ఏం ప్రిపేర్ అవుతారు… ఏ సబ్జెక్టుకు ఎంత ప్రిపేర్ అవ్వాలి… ఇవన్నీ కూడా సిలబస్ ఛార్ట్ తయారు చేసుకున్నప్పుడే … అందులో ఓ కాలమ్ పెట్టుకుంటే సరిపోతుంది.  గ్రూప్ 2కి నాలుగు నెలలకు పైగా టైమ్ ఉంది… దానికి తగ్గట్టుగా మీ టైమ్ ని సెట్ చేసుకోండి… ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు.  సోషల్ మీడియా అకౌంట్స్ ని ఈ రోజే సైన్ అవుట్ అయిపోండి… మన whats app channel, whats group లేదంటే Telegram గ్రూప్ ఫాలో అవ్వండి. మిగతా వాటి నుంచి లెఫ్ట్ అయిపోండి… ముఖ్యంగా ఫేస్ బుక్… చేత్తో… పైకి తిప్పుకునే ఇన్ స్టా రీల్స్ కి దూరంగా ఉండండి.  ప్రతిరోజులో… ప్రతి నిమిషాన్ని ఎలా సద్వినియోగం చేసుంటున్నాను… అన్నది గమనించుకోండి… రాత్రి మీరు పడుకునే ముందు ఒక్కసారి ఇవాళ టైమ్ వేస్ట్ ఎప్పుడు అయింది… రేపు అది కాకుండా ఏం చేయాలి అన్నది ప్లాన్ చేసుకోండి.

Point 5 : విశ్లేషణాత్మకంగా చదవండి… బిట్స్ చదవొద్దు – బేసిక్స్ పై పట్టు

గ్రూప్ 1 కి అయినా… గ్రూప్ 2 కి అయినా … మీరు క్వొశ్చన్ బ్యాంక్స్, బిట్స్ బ్యాంక్స్ చదివితే ఉద్యోగం రాదు. తప్పనిసరిగా థియరీని విశ్లేషణాత్మకంగా చదవాలి.  తెలుగు అకాడమీ, అంబేద్కర్ వర్సిటీ లేదంటే కొందరు సీనియర్ ఫ్యాకల్టీస్ రాసిన బుక్స్ లో థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుంది.  అది చదవండి… ఏ లెసన్ కి ఆ లెసన్ మీకు మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి… అప్పుడే మీరు చదివింది గుర్తుండి పోతుంది.  అలాగే బేసిక్స్ మీద పట్టు ఉండాలి… ప్రతి సబ్జెక్టులో బేసిక్స్ మీద పట్టు ఉంటే … మీరు 25 నుంచి 30 శాతం ప్రశ్నలకు ఈజీగా సమాధానం రాయగలుగుతారు.

Point 6 :  నోట్స్ రాసే అలవాటు ఉందా ?

మీకు నోట్సు రాసుకునే అలవాటు ఉందా ? లేకపోతే అలవాటు చేసుకోండి… బద్దకించవద్దు… ఏ రోజు చదువుకున్నవి ఆరోజు నోట్సు రాయడం అలవాటు చేసుకోండి… నోట్స్ ఎలా రాయాలి అన్నది కూడా మన Telangana exams you tube channel లో వీడియో ఉంది… చూడండి… నోట్స్ రాయడం అంటే… మీరు చదివే పుస్తకాన్ని మొత్తం నోట్సులో ఎక్కీయడం కాదు… పాయింట్స్ వైజ్ గా రాసుకోండి… మైండ్ మ్యాప్స్ గీసుకోండి… షార్ట్ కట్స్ రాసుకోండి… ఈజీగా గుర్తుండిపోతాయి. ఎగ్జామ్ ముందు రివిజన్ టైమ్ లో ఈ నోట్స్ ను రిఫర్ చేసుకుంటే… మీరు ఎగ్జామ్ కి హండ్రెడ్ పర్సంట్ కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చు.

ఇక్కడ మీకో చిన్న సజెషన్…. మైండ్ మ్యాప్స్, షార్ట్ కట్స్ కి అలాగే ప్రీవియస్ ఇయర్ Upsc, ssc, మన స్టేట్ తో పాటు ఏపీ ఇతర స్టేట్ బోర్డుల్లో వచ్చిన pyqs ని వాటికి ఆన్సర్లు… మైండ్ మ్యాప్స్ ని మేం మన Exam Centre 247 whatsapp channel లో ఇస్తున్నాం. అందులో జాయిన్ అవ్వండి. ఇది వాట్సాప్ గ్రూప్ కాదు… ఛానెల్.

ఆ లింక్  ఇదే : Whats app Channel Link

Point7 : డైలీ కరెంట్ ఎఫైర్స్ ఫాలో అవ్వాలి

ఏ రోజు కరెంట్ ఎఫైర్స్ ఆ రోజే ప్రిపేర్ అవ్వాలి… అన్ని కలిపి లాస్ట్ లో చూసుకునే అలవాటు చేసుకోవద్దు. కనీసం ఏడాది ముందు నుంచీ… అంటే 2023 డిసెంబర్ నుంచి మీరు కరెంట్ ఎఫైర్స్ చూసుకోవాలి… అంతకుముందు కూడా ఏవైనా పాపులర్ టాపిక్స్ ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వాలి.  అంటే ఉమెన్ రిజర్వేషన్లు లాంటివి….

కరెంట్ ఎఫైర్స్ అంటే డైలీ జరిగే రీజినల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలే కాదు… వాటిని అన్ని సబ్జెక్టులకు అన్వయించుకోవాలి… Currents Affairs connectivity అనేది ఉండాలి.  అంటే పాలిటీలో… కోర్టు తీర్పులు, కొత్త చట్టాలు… కొత్త పథకాలు లాంటివి వస్తే… వాటికి గతంలో ఎలా ఉండేవి అన్నది అన్వయించి చదువుకోవాలి… సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఎకనామీ అంశాల్లో కూడా ఇలా ఇలా Currents Affairs connectivity అనేది ఉండాలి. అది ఎలా తెలుస్తుంది అని కొందరు confuse అవుతారు…   మన ఎగ్జామ్ సిరీస్ లో జాయిన్ అయిన వారికి ఏ రోజుకారోజు నేను విశ్లేషణ అందిస్తాను. వీడియోల రూపంలో…  ఇలా Currents Affairs connectivity తో elaborate గా చదివితేనే మీరు గ్రూప్ 2 లో విజయం సాధిస్తారు… గ్రూప్ 2 ఆఫీసర్ అవడం ఆషామాషీ కాదు అని గుర్తుంచుకోండి. బిట్స్ చదువుకోపోతే ఉద్యోగం రాదు.

Point8 లెసన్ వైజ్ మాక్ టెస్టులు రాయాలి… గ్రాండ్ టెస్టులు, ప్రీవియస్ క్వొశ్చన్ పేపర్స్ 

టెస్టులు రాయకుండా… డైరెక్ట్ గా ఎగ్జామ్ రాద్దాం అని ఆశలు పెట్టుకోవద్దు… పాయింట్ నెంబర్ 5లో చెప్పినట్టు… తప్పనిసరిగా… ఏ లెసన్ కి ఆ లెసన్ మాక్ టెస్టులు రాయాలి.  మన దగ్గర మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల సిరీస్ ఉంది. అప్ డేషన్ కోసం ప్రస్తుతం unpublish చేశాను.  10 డేస్ లో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తాను. మీరు మాక్ టెస్టులతో పాటు గ్రాండ్ టెస్టులు… ప్రీవియస్ ఇయర్ క్వొశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ మస్ట్ గా చేయాలి.

Point 9 : పాజిటివ్ దృక్పథం

ఇది లాస్ట్ పాయింట్. ఎగ్జామ్ కి నాలుగు నెలలే టైమ్ ఉంది… ఈ సమయంలో మీరు మానసికంగా… శారీరకంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి… ఇంకా కొందరికి  ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.  అందువల్ల వాటి గురించి టెన్షన్ పడొద్దు… మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి… పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్ళండి… నాకు ఉద్యోగం వస్తే… నేను గ్రూప్ 2 స్థాయి అధికారిగా బాధ్యతలు చేపడితే… నా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మనస్సులో మీకు మీరు సర్ది చెప్పుకోండి… మీరు ఎంత పాజిటివ్ గా ముందుకెళితే… మీ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుందని భావించుకోండి… ఇంకా చెప్పాలంటే… ఈ పాజిటివ్ యాటిట్యూడ్ కూడా మీ రివిజన్లో ఒక పార్ట్ అనుకోండి… అందుకే నేను నైన్త్ పాయింట్ గా ఇది చెప్పాను.

9 పాయింట్స్ ఏంటో ఓసారి బ్రీఫ్ గా రివిజన్ చేద్దాం.

Point No.1

ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ మీద అవగాహన పెంచుకోవాలి… ఏయే పేపర్లో ఏ సిలబస్ ఉంది… GS తో పాటు మిగతా పేపర్లలో కంబైన్డ్ గా వచ్చే టాపిక్స్ ఏంటి  చూసుకోవాలి.  అన్నింటికీ కలిపి ప్రిపరేషన్ అవ్వాలి.

Point No.2

బుక్స్, మెటీరియల్ సేకరించుకోండి.  కొత్త వాళ్ళయితే అకాడమీ, అంబేద్కర్ వర్సిటీ, సీనియర్ ఫ్యాకల్టీస్ రాసిన బుక్స్ తీసుకోండి. పాతవాళ్ళయితే కొత్తగా బుక్స్ కొనవద్దు… అప్ డేట్స్ సేకరించండి… బడ్జెట్స్, ఆర్థిక నివేదికలు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొత్త పథకాలు… ఎకానమీలో ఫిగర్స్ అప్ డేట్ లో ఉండండి.

Point No.3

సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోండి – డే, వీక్లీ, మంత్లీ… ఇది లేకుండా మీరు ఏ ఎగ్జామ్ కూడా కొట్టలేరు… మీకంటూ ఓ ప్లానింగ్ ఉండాలి అంటే… సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోవాలి… రెడీ చేసుకుంటే సరిపోదు ….దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.

Point No.4

టైమ్ మేనేజ్ మెంట్ చాలా అవసరం.  గ్రూప్ 2 ఎగ్జామ్ కి నాలుగు నెలలకు పైగా టైమ్ ఉంది. అప్పటిదాకా మనం చదవాలంటే… ఏ రోజు ఏం చదువుకోవాలి… ఎంత టైమ్ చదవాలో ప్లానింగ్ ఉండాలి.  నిమిషం కూడా టైమ్ వేస్ట్ చేయొద్దు. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి.

Point No.5

విశ్లేషణాత్మకంగా చదవండి… బిట్స్ చదవొద్దు – బేసిక్స్ పై పట్టు ఉండాలి.

బిట్స్ బ్యాంక్స్, క్వొశ్చన్ బ్యాంక్స్ చదివితే మీరు గ్రూప్ 2 ఆఫీసర్ కాలేదు… గ్రూప్ 2 యే కాదు… ఏ ఉద్యోగం సంపాదించలేరు. ప్రతి సబ్జెక్టును  లోతుగా స్టడీ చేయాల్సిందే…

Point No.6

నోట్స్ రాసే అలవాటు ఉందా ? లేకపోతే ఇవాళ్టి నుంచే… ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి.  సివిల్స్ ఉద్యోగాలు కొట్టిన వారు కూడా సొంతంగా నోట్స్  రాసుకున్నామని చెబుతుంటారు.  మైండ్ మ్యాప్స్, షార్ట్ కట్స్ తో నోట్స్ రాయండి.. చాట భారతాలు కాదు. ఈ మైండ్స్ మ్యాప్స్ కోసం మన Whats app channel ఫాలో అవ్వండి… లింక్ వీడియో description లో ఉంది.

Point No.7

డైలీ కరెంట్ ఎఫైర్స్ ఫాలో అవ్వాలి.. కనీసం ఏడాది ముందు నుంచీ CA ఫాలో అవ్వండి. ఏ రోజుకారోజు ఫినిష్ అయిపోవాలి… అన్నీ కలిపి లాస్ట్ లో చూసుకుందాం అనుకోవద్దు. అలాగే సబ్జెక్టులతో…Currents Affairs connectivity చేసుకోండి… అప్పుడే మీకు బెనిఫిట్ ఉంటుంది.

Point No.8

లెసన్ వైజ్ మాక్ టెస్టులు రాయాలి… గ్రాండ్ టెస్టులు, ప్రీవియస్ క్వొశ్చన్ పేపర్స్ కవర్ చేయాలి. లెసన్ వైజ్ గా మెటీరియల్ చదువుకుంటూ… మాక్ టెస్టులు రాస్తే… మీకు తప్పులు పోతే… వాటిని మళ్ళీ చదువుకోడానికి ఛాన్స్ ఉంటుంది. మేం యాప్స్ లో ఇచ్చే టెస్ట్ సిరీస్ లో ఇలాంటి మాక్ టెస్టులే ఉంటాయి.

Point No.9

లాస్ట్ పాయింట్… నైన్త్ పాయింట్… పాజిటివ్ దృక్పథం ఉండాలి… నేను గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి… అని గట్టి పట్టుదల ఉండాలి… గవర్నమెంట్ ను తిట్టుకుంటూ… ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ చదవకండి… ప్రశాంతంగా ఉండండి…

థ్యాంక్యూ… ఆల్ ది బెస్ట్.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!