02 SEPT CURRENT AFFAIRS

02 SEPT CURRENT AFFAIRS

మధ్యతరగతి కోసం వందే భారత్ స్లీపర్

మధ్య తరగతి ప్రయాణీకుల కోసం వందే భారత్ స్లీపర్ కోచ్ లు రాబోతున్నాయి. ఒక రాత్రిలో 800 నుంచి 1200 కి.మీ. ప్రయాణిం చేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను తీసుకొస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2024 సెప్టెంబర్ 1 నాడు…  బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML)ను సందర్శించారు. ఇక్కడ రూపొందించిన వందే భారత్ స్లీపర్ ప్రొటోటైప్ (పైలట్ వెర్షన్) రైలును రైల్వే సహాయ మంత్రి వి. సోమణ్ణతో కలిసి ఆవిష్కరించారు. రాబోయే పది రోజుల పాటు ఈ బోగీలను పట్టాలపై ప్రయోగాత్మకంగా నడిపించి వచ్చే మూడు నెలల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఏడాదిన్నర తర్వాత ప్రతి నెలా రెండు లేదా మూడు రైళ్లను తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. ప్రోటోటైప్ వెర్షన్లను కఠిన పరిస్థితుల్లో కూడా పరీక్షిస్తామన్నారు.  16 కోచ్ లతో ఉండే ఈ అత్యాధునిక వందే భారత్ స్లీపర్  రైలులో టికెట్ ధరలు రాజధాని రైళ్ల టికెట్ ధరతో దాదాపు సమానంగా ఉంటాయి.  BEML ఆవరణలో వందే భారత్ రైళ్ల తయారీ యూనిట్ కు  కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకు స్థాపన చేశారు.

 అరుదైన వ్యాధుల జాబితాలో 8వ స్థానంలో తెలంగాణ, ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలో అరుదైన వ్యాధులున్న టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ (8వ స్థానం)లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 7 వ స్థానంలో ఉంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు దేశవ్యాప్తంగా 13,479 మంది ఉండగా… తెలంగాణలో 661 మంది, ఏపీలో 684 మంది ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వివరాలను ఇటీవలే కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటుకు సమర్పించింది. మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 1,976 మంది, మహారాష్ట్రలో 1,387, కర్ణాటకలో 1,275, తమిళనాడులో 1,201, అసోంలో 898, ఢిల్లీలో 879, ఆంధ్రప్రదేశ్లో 684, తెలంగాణలో 661, పశ్చిమ బెంగాల్ లో 642, బిహార్ 608 మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో 75 శాతం (10,211 మంది) ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. టాప్ టెన్ లో 4 దక్షిణాది రాష్ట్రాలు ఉండగా అక్కడ 28 శాతం కేసులు ఉన్నాయి. 63 రకాల వ్యాధులు అరుదైనవిగా కేంద్రం గుర్తించింది. చికిత్స అందించేందుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపింది.

రోగ నిరోధక శక్తి లోపాలు, గౌచర్స్ వ్యాధి, మ్యూకోపాలిసాకరిడోసెస్, పాంపే, ఫాబ్రీ, మాపుల్ సిరప్ యూరిన్ వ్యాధులు, ఆర్గానిక్ అసిడెమియాస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్టియోజెనిసిస్, కొన్ని రకాల కండరాల క్షీణత లాంటివి అరుదైన వ్యాధుల జాబితాలో ఉన్నాయి.  అరుదైన వ్యాధులతో బాదపడుతున్నవారి చికిత్సకు రూ.50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 2021 వరకు ఇది రూ.20లక్షల వరకే ఉండగా దాన్ని రూ.30 లక్షలకు పెంచామని కేంద్రం పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.24.20 కోట్లు, గత నాలుగేళ్లలో రూ.136.34 కోట్లు కేటాయించామని తెలిపింది.

రష్యా ‘నిఘా తిమింగలం’.. హ్వాల్దిమిర్ మృతి

 రష్యా నిఘా తిమింగలం ‘హ్వాల్దిమిర్’ అనే బెలుగా తిమింగలం చనిపోయింది. 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు ఉన్న ఈ తిమింగలం 2024 ఆగస్టు 31న స్థావంజర్ దగ్గరలోని బే ఆఫ్ రిసవికాలో చనిపోయి ఉందని గుర్తించారు. 2019లో ఉత్తర నార్వేలోని హామర్ ఫెస్ట్ దగ్గర్లో మొదటిసారిగా తిమింగలం కనిపించింది. దీనికి నార్వే నుంచి ‘హ్వాల్’ రష్యా నుంచి ‘వాల్దిమిర్’ పేర్లు కలిపి ‘హ్వాల్టిమిర్’ అని పేరు పెట్టారు. దీని మెడకు సెయింట్ పీటర్స్ బర్గ్ అనే లేబుల్ ఉండటంతో ఇది రష్యా నిఘావర్గంలో భాగమని వార్తలొచ్చాయి. రష్యా స్పైగా ఇది వార్తల్లోకెక్కింది. రష్యా మాత్రం అలాంటిదేమీ లేదని వాదించింది. మెరైన్ మైండ్ వ్యవస్థాపకుడు, హ్వాల్దిమిర్ సంరక్షణ బాధ్యతలు చూసుకునే సెబాస్టియన్ స్ట్రాండ్… తిమింగలం చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

జపాన్ యానిమేటర్ కు రామన్ మెగసెసె అవార్డు

ఆసియన్ నోబెల్ ప్రైజ్ గా భావించే రామన్ మెగసెసె అవార్డు 2024కి ప్రముఖ జపాన్ యానిమేటర్ హయావో మియా జాకీకి దక్కింది. స్పిరిటెడ్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరో ముగ్గురికి, ఓ సంస్థకు 2024 రామన్ మెగసెసె అవార్డు దక్కింది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తామని నిర్వాహక కమిటీ తెలిపింది. వియత్నాం డాక్టర్ న్గుయెన్, మాజీ బౌద్ధ సన్యాసి కర్మపుంట్ షా, ఇండోనేషియాకు చెందిన ఫర్విజీ ఫర్హాన్ కు  అవార్డులు దక్కాయి.  థాయ్ లాండ్ కి చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకు కూడా రామన్ మెగసెసే అవార్డు 2024 దక్కింది.

ఇంకా ఎవరైనా మన Group.2 excellence course లో జాయిన్ అవ్వకపోతే… జాయిన్ అవ్వగలరు. డిసెంబర్ లో Group.2 రాసేవాళ్ళు తప్పనిసరిగా చేరండి.

TGPSC Group 2 Excellence Series: From Beginner to Officer (EM & TM)

https://atvqp.on-app.in/app/oc/447150/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

 

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!