05 SEPT CURRENT AFFAIRS

05 SEPT CURRENT AFFAIRS

సింగపూర్ లో ప్రధాని నరేంద్రమోడీ

రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 2024 సెప్టెంబర్ 4 నాడు సింగపూర్ కు చేరుకున్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్… మోడీని ఘనంగా ఆహ్వానించారు. ప్రతిష్టాత్మక శ్రీ తెమాసెక్ భవనంలో ఆతిథ్యం ఇచ్చారు. 2024 సెప్టెంబర్ 5 నాడు అధికారికంగా భేటీ అవుతున్నారు. లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకే మోడీ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశం నుంచి పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా మోడీ సింగపూర్ పర్యటిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.  ప్రధాని హోదాలో మోడీ సింగపూర్ లో పర్యటించడం ఇది ఐదోసారి. సింగపూర్ పార్లమెంటు హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు షణ్ముగ రత్నంను కూడా మోడీ కలుసుకుంటారు. సింగపూర్ లో వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. అంతకుముందు మోడీ బ్రూనై పర్యటనలో ఆ దేశ సుల్తాన్ హసనల్లాతో భేటీ అయ్యారు. త్వరలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు మోడీ తెలిపారు.

ట్రంప్ పుస్తకం.. విడుదలైన గంటల్లోనే బెస్ట్ సెల్లర్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా విడుదలైన గంటల్లోనే అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. రూ.7728 (92. 06 డాలర్లు) భారీ ధర ఉన్నా…. అమెజాన్ లో  ‘ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది. జులై నెల పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచారసభలో ట్రంప్ మాట్లాడుతుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. రక్తమోడుతున్న గాయంతో ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్.. ఆ తర్వాత తేరుకొని వేదికపై పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ నినదిస్తున్న సమయంలో తీసిన ఫొటో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. ఆ ఫోటోయే ఈ పుస్తకం కవర్ పేజీపై వాడారు.  ట్రంప్ గత పదవీకాలంలోని ముఖ్య ఘట్టాలతోపాటు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలని ఆయన భావిస్తున్నారో ఈ పుస్తకంలో వివరించారు.  ట్యాక్సులు, అంతర్జాతీయ దౌత్యం, సరిహద్దు భద్రత లాంటి అంశాలను ప్రస్తావించినట్టు అమెజాన్ తెలిపింది. ఈ బుక్ ని ప్రమోట్ చేస్తూ తన సోషల్ మీడియా యాప్ ‘ట్రూత్’లో ట్రంప్ పోస్టు పెట్టారు.

నేపాల్ కరెన్సీ నోట్లపై భారత్ భూభాగంలోని ఫొటోలు

భారత్ తో ఉన్న భూవివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాజేసింది. భారత్ కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలను కొంతకాలంగా తమవిగా చెప్పుకుంటోంది నేపాల్. దాంతో ఆ దేశ కేంద్ర బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్ లను కూడా జత చేసింది. దీనికి సంబంధించి ప్రింటింగ్ ప్రక్రియ మొదలైందని ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఇది పూర్తవుతుందని నేపాల్ కేంద్ర బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. నేపాల్ అప్పటి ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ వివాదాస్పద మ్యాప్ నోట్లను ముద్రించాలని 2024 మే 3న నిర్ణయించింది. భారత్ లోని సిక్కిం, పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాలతో నేపాల్ 1850 కి.మీ. సరిహద్దు ఉంది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీతో పాటు లిపులేఖ్, లింపియాదురా ప్రాంతాలు రెండు దేశాల మధ్య వివాదంగా ఉన్నాయి. ఇవి తమకు చెందినవేనని భారత్ చెబుతోంది.

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పింఛను రద్దు: హిమాచల్ ప్రదేశ్ లో నిర్ణయం

పార్టీ పిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పింఛను సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనిపై సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ 2024 సెప్టెంబర్ 4 నాడు ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఫిరాయింపులను అడ్డుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ (సభ్యుల పింఛన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు 2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. “ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఇకపై పింఛను పొందే అవకాశం ఉండదు” అని ఈ బిల్లులో పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ చట్టాల ప్రకారం.. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్యేలకు నెలకు రూ.36 వేల పింఛను ఇస్తున్నారు.

ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు

‘ప్రపంచ కృత్రిమ మేధ (AI) సదస్సు హైదరాబాద్ లో జరుగుతోంది. 2024 సెప్టెంబర్ 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(HCC)లో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమైంది. సీం రేవంత్ ప్రారంభిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

‘ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సుతో పని(Making AI work for everyone) అనే థీమ్ తో ఈ సదస్సు జరుగుతోంది.  గ్లోబల్ ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ను నిర్వహించడం దేశంలో ఇదే మొదటి సారి. ఐటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి AI రంగంలో పేరున్న దాదాపు 2 వేల మంది ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంజ్, ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ నుంచి పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. AIరంగం అభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చిస్తారు. సమాజంపై AI ప్రభావం, నియంత్రణ, సవాళ్లను చర్చిస్తారు. కొత్త టెక్నాలజీతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టుల గురించి సదస్సులో ప్రదర్శిస్తారు. రెండు రోజుల సదస్సు కోసం ప్రధాన వేదికతో పాటు నాలుగు అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో నిర్మించే ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో AI CITY ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యాత, రాష్ట్రంలో అనుకూల వాతావరణాన్ని ఈ AI Global conference ప్రపంచానికి తెలియచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రథమం: ఏటా 10.2 మిలియన్ టన్నులు

ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని కొత్త స్టడీ తెలిపింది.  భారత్ లో ఏటా ఉత్పత్తి అవుతున్న 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు…. మిగతా దేశాల కంటే రెట్టింపు కన్నా అధికమని తెలిపింది. ఈ జాబితాలో నైజీరియా, ఇండోనేసియా తర్వాత నాలుగో స్థానంలో ఉన్న చైనా వ్యర్ధాల తగ్గింపునకు అద్భుతమైన కృషి చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల నుంచి ప్రపంచంలోని సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా 90వ స్థానంలో, బ్రిటన్ 135వ స్థానంలో ఉన్నాయి. బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల స్టడీ ప్రకారం.. ప్రపంచం మొత్తం మీద ఏటా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. సముద్రాల నుంచి ఎత్తయిన పర్వతాల దాకా ఈ వ్యర్థాలు నిండిపోతున్నాయి. ఈ వ్యర్థాల్లో మూడింట రెండు వంతులు దక్షిణ భూగోళం నుంచి వస్తున్నట్లు స్టడీ తెలిపింది. ఏటా ఉత్పత్తి అవుతున్న ఈ వ్యర్థాలతో దాదాపు 4 కి. మీ. దాకా ఉన్న న్యూయార్క్ సిటీ సెంట్రల్ పార్కును 380 మీటర్ల ఎత్తు ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగు ఎత్తుకు నింపవచ్చని పరిశోధకులు అంటున్నారు.  ప్రపంచవ్యా ప్తంగా 50 వేల నగరాలు, పట్టణాల నుంచి స్థానికంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను ‘నేచర్’ జర్నల్ కోసం వీళ్ళు స్టడీ  చేశారు. నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తున్న నగరంగా గుర్తించారు. ఈ జాబితాలో ఢిల్లీ, కరాచీ కూడా ఉన్నాయి.

GOOD NEWS FOR DEC’ GROUP.2 ASPIRANTS

And if anyone has not joined our Group.2 excellence course… can join. Those writing Group.2 in December must join. TGPSC Group 2 Excellence Series: From Beginner to Officer (EM & TM)https://atvqp.on-app.in/app/oc/447150/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!