REVENUE POSTS
Telanganaలో కొత్తగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా మరో పేరుతో 5 వేల దాకా పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేయబోతోందని ఈమధ్యే Telangana Exams you tube channel లో వీడియో ఇచ్చాం. దానికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది…
ఇందులో ప్రభుత్వం ఎంతమంది JROలను రిక్రూట్ చేయబోతోంది…
ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతోంది…
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా తీసుకుంటే… గతంలో VRO ఎగ్జామ్ ని ఎలా నిర్వహించారు…
గతంలో VROలకు ఇచ్చినట్టే ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తారా… లేదా డిగ్రీ ఉంటుందా…
ఇంటర్ అర్హత ఇస్తే… గతంలో VRO ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది లాంటి డిటైల్స్ ఇచ్చా…
ఈ ఆర్టికల్ మొత్తం చదవండి… లేదంటే కింద ఇచ్చిన వీడియో చూడండి
కింద క్వాలిఫికేషన్ ఏంటి… ఎగ్జామ్ ఏంటి అని ప్రశ్నలు అడుగుతున్నారు…
Telangana Exams you tube channel ను subscribe చేసుకోండి…
గ్రామ స్థాయిలో గతంలో VRO, VRA లు పనిచేసేవారు… దాంతో రెవెన్యూ వ్యవస్థ సాఫీగా సాగేది. ఈ వ్యవస్థలో అవినీతి జరుగుతోంది అంటూ BRS ప్రభుత్వం రద్దు చేసింది… అవినీతికి పాల్పడివారిని శిక్షించాల్సింది పోయి… మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం వల్ల గ్రామస్థాయిలో రెవెన్యూ యాక్టివిటీస్ కి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు… ముఖ్యంగా విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ లాంటి సర్టిఫికెట్లు… రైతులకు పహణీ నకళ్ళు… ఇతర భూమి సంబంధిత సర్టిఫికెట్లకు గ్రామస్థాయిలో సర్టిఫై చేసే వ్యవస్థ లేకుండా పోయింది… మీ సేవాలో అప్లయ్ చేశాక… గ్రామాల్లో రెవెన్యూ అధికారులు లేకపోవడంతో…
మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ ఇన్స్ పెక్టర్లే అన్ని పనులూ చూడాల్సి వస్తోంది… దాంతో సర్టిఫికెట్స్ కోసం తహసిల్దార్ ఆఫీసుల చుట్టూ రైతులు, విద్యార్థులు తిరిగి తిరిగి విసిగిపోతున్నారు. దీంతో పాటు గ్రామాల్లో ఎవైనా శాంతి భద్రతలు తలెత్తినా… ప్రకృతి విపత్తులు, చెరువులకు గండ్లు లాంటి పరిస్థితుల్లో పై అధికారులకు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ అవసరమని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో మొత్తం 10 వేల 954 గ్రామాలు ఉన్నాయి… వీటన్నింటికీ గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులు అవసరం. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా మరో పేరు అయినా… వాళ్ళనైతే నియమించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం… గతంలో పనిచేసిన VROలు మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు… కానీ వాళ్ళని తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి… వాళ్ళల్లో కొందరిపై అవినీతి ఆరోపణలకు తోడు… వాళ్ళల్లో డిగ్రీలు చేసిన వారు ఉండాలి… ఇంకా కొందరు… ఇంకా VRO లుగానే చేయాలా… మాకు ప్రమోషన్లు ఇవ్వరా అని అడుగుతున్నారు…
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని… రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఈ JRO పోస్టులు భర్తీ చేయాలని ఆలోచిస్తోంది.
10 వేల 954 పోస్టులు భర్తీ చేయాలని ఇప్పటికే CCLA నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్ వెళ్ళాయి…
2024 ROR కొత్త చట్టం రాబోతోంది… వచ్చే అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతున్నారు… దీంతో పాటే… JRO పోస్టుల క్రియేషన్ కి సంబంధించి కూడా బిల్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి… అంతకంటే ముందు… ఈ నెలలో జరిగే కేబినెట్ సమావేశంలోనూ ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. అంతేకాదు… ఈ వ్యవస్థలు గ్రేడ్ 1,2,3 వారీగా పోస్టులను విభజించే ఛాన్సుంది. గతంలో VRO లుగా పనిచేసి… ప్రస్తుతం వేర్వేరు శాఖల్లో ఉన్న వాళ్ళల్లో క్వాలిఫైడ్ అభ్యర్థులు అంటే డిగ్రీ పాసైన వారు ఉంటే… వాళ్ళని గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 ల్లో పెట్టి… మిగిలిన పోస్టుల్లో గ్రేడ్ 3 కింద JRO లను రిక్రూట్ చేసే ఛాన్సుంది. పూర్వం పనిచేసిన అందరు VRO లను తిరిగి తీసుకునే అవకాశాలు అయితే అస్సలు లేవు. మొత్తం10 వేల 954 పోస్టులు కూడా డైరెక్ట్ గా TGPSC నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
నెక్ట్స్… జరిగేది ఏంటి
మొత్తం పోస్టులు 10 వేల 954లో ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి అన్నది CCLA తేల్చాలి. ప్రభుత్వానికి నివేదిక పంపుతుంది… కొత్త పోస్టుల క్రియేషన్ కాబట్టి… కేబినెట్ అనుమతి కావాలి. కొత్త పోస్టులకు పే స్కేలు, ఆర్థికంగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది… న్యాయపరమైన అంశాలపై దృష్టి పెడతారు… వాళ్ళ డ్యూటీలను నిర్ధారిస్తారు… అంటే జాబ్ ఛార్ట్, సర్వీసు నిబంధనలు, నియామక విధానంపై నిర్ణయం తీసుకోవాలి…
నిరుద్యోగుల ఎలాంటి అవకాశాలు ?
గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కి మొగ్గు చూపిస్తే… మొత్తం 10 వేల 954 పోస్టులకు నోటిఫికేషన్ పడుతుంది… లేదంటే 8 నుంచి 9 వేల దాకా అయినా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేస్తారు ?
ఎగ్జామ్ ఎలా ?
గతంలో VRO ల భర్తీకి ప్రత్యేకంగా ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 4 కాకుండా విడిగా నిర్వహించేవారు.
ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ ని TSPSC 2018 లో నిర్వహించింది… అప్పట్లో 700 పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. అప్పట్లో ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది… మరి ఇప్పుడు డిగ్రీ పెడతారా… విలేజ్ లెవల్ పోస్టు కాబట్టి… ఇంటర్ తోనే పెడతారా అన్నది చూడాలి…
ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే…
జనరల్ నాలెడ్జ్, సెక్రటరియల్ ఎబిలిటీస్… 150 ప్రశ్నలు…. 150 మార్కులు…
జీకే విభాగంలో
1) కరెంట్ ఎఫైర్స్: ఇంటర్నేషనల్, నేషనల్, రీజినల్
2) జనరల్ సైన్స్ : నిత్య జీవితంలో సైన్స్, పర్యావరణ అంశాలు, ప్రకృతి విపత్తులు
3) జాగ్రఫీ అండ్ ఎకానమీ : ఇండియా, తెలంగాణ
4) భారత రాజ్యాంగం : రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
5) ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం
6) తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
7) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
8) తెలంగాణ ప్రభుత్వ విధానాలు
9) లింగ,బడుగు, బలహీన వర్గాల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు
సెక్రటేరియల్ ఎబిలిటీస్ లో
1) 8వ తరగతి బేసిక్ లో ఇంగ్లీష్
2) మెంటల్ ఎబిలిటీ… వెర్బల్ నాన్ వెర్బల్
3) లాజికల్ రీజనింగ్
4) న్యూమరికల్ ఎబిలిటీస్
5) అర్థమెటికల్ ఎబిలిటీస్
ఎక్కువ శాతం ఇంటర్ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చే ఛాన్సుంది…. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తే మాత్రం గ్రూప్ 3 మోడల్ లో ఎగ్జామ్ జరుగుతుంది. ప్రస్తుతం ఇంటర్ క్వాలిఫై అయిన వారికి కేవలం కానిస్టేబుల్ పోస్టులు తప్ప… వేరే ఛాన్స్ లేదు… అందుకే గతంలో ఇచ్చినట్టే… ఇంటర్ అర్హత ప్రకటించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో…
ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం Telangana exams plus యాప్ లో ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం… గతంలో 2018లో కూడా నిర్వహించాం. చాలామంది జాబ్స్ సంపాదించారు.
జాబ్స్, ఎడ్యుకేషన్ అప్ డేట్స్ కోసం … మీరు ఈ కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి ఆ గ్రూపులో జాయిన్ అవ్వండి.
అలాగే ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 రాసేవాళ్ళకి టెస్టులు నడుస్తున్నాయి. గ్రూప్ 2 లింక్ వీడియో description లో ఇస్తున్నా. 250 రూపాయలు 6 నెలలు … గ్రాండ్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి.
Telangana Exams you tube channel ను subscribe చేసుకోండి…
🎯Join this Telegram group for more Jobs, Exams notifications, Results updates of Central & APPSC, TGPSC etc Updates: Telegram Link🎯
🎯TGPSC Group 2 కోర్సులో జాయిన్ కి లింక్ : TGPSC GROUP.2 COURSE LINK