అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ : Space X ఘనత
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన అంతరిక్ష సంస్థ ‘Space X చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలో మొదటిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది. ‘పొలారిస్ డాన్’ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా 2024 సెప్టెంబర్ 10 నాడు నలుగురు నింగిలోకి వెళ్ళారు. వీళ్ళల్లో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్ మన్ సెప్టెంబర్ 12 నాడు మొదటి క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు. ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా.. అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన మొదటి వ్యక్తిగా ఇస్సాక్ మన్ చరిత్ర సృష్టించారు. తర్వాత- స్పేస్ X ఇంజినీర్ సారా గిల్లిస్ ఆయన్ని ఫాలో అయ్యారు. స్పేస్ X తయారు చేసిన స్పేస్ సూట్ ను వాళ్ళు పరీక్షించారు.
పంచాయతీ బై ఎలక్షన్ లో పేపర్ లెస్ ఓటింగ్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం భోపాల్ జిల్లాలోని పంచాయతీ ఉపఎన్నికను ఒక పోలింగ్ సెంటర్ లో కాగిత రహిత ఓటింగన్ ను విజయవంతంగా నిర్వహించింది. దేశంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ఓటింగులో 84 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. బైరసియా డెవలప్ మెంట్ బ్లాక్ పరిధిలోని రతువా రతన్ పూర్ గ్రామ పంచాయతీ 295 పోలింగ్ కేంద్రంలో 2024 సెప్టెంబర్ 11 నాడు ఈ ప్రయోగాత్మక ఓటింగ్ జరిగింది. ఇందులో ఓటర్ల గుర్తింపుతోపాటు ఓటింగు రికార్డు చేయడానికి వారి సంతకాలు, వేలిముద్రలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు
చేశారు. ఓటింగు శాతం, బ్యాలెట్ లెక్కల తనిఖీ ఆన్ లైనులో కొనసాగింది. ఓటింగు పూర్తయ్యాక బ్యాలెట్ లెక్కలను అభ్యర్థులతోపాటు పోలింగ్ ఏజెంట్లకు ఈ-మెయిల్ ఐడీలో అందుబాటులో ఉంచారు. పంచాయతీ ఎన్నికలో అన్ని ప్రక్రియలు పూర్తిచేసి, పోలింగు కేంద్రానికి రిపోర్టు చేయడానికి 26 మోడల్స్ నింపాల్సి వచ్చింది. తప్పు జరిగి, వివాదాలు తలెత్తి కోర్టు కేసుల దాకా వెళతాయి.
భారత్ కు HAASW అమ్ముతున్న అమెరికా
సముద్ర జలాల్లో భారత యుద్ధ సామర్ధ్యాలు మరింత పెరిగే దిశగా 5.28 కోట్ల డాలర్ల విలువైన ‘High altitude anti submarine warfare (HAASW) సోనో బుయ్ అను మన దేశానికి అమ్మాలని అమెరికా నిర్ణయించింది. సోనో బుయ్ లను గగనతలం నుంచి ప్రయోగిస్తారు. వీటిల్లోని ఎలక్ట్రో- మెకానికల్ సెన్సర్లు నీటిలో ధ్వనులను పసిగట్టి రిమోట్ ప్రాసెసర్లకు చేరవేస్తాయి. MH-60R హెలికాప్టర్ల నుంచి జలాంతర్గామి విధ్వంసక కార్యకలాపాలు చేపట్టడానికి HAASW లు భాతర్ కు ఉపయోగపడతాయని అమెరికా తెలిపింది.
స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం
బాలేశ్వర్: ఉపరితలం నుంచి గగనతలంలోకి (Surface to Air) ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), నౌకాదళం విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీరంలో చాందీపూర్ లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి 2024 సెప్టెంబర్ 12 నాడు ఈ ప్రయోగం నిర్వహించాయి. ఇందులో భాగంగా- భూమిపై ఉంచిన నిట్టనిలువు లాంచర్ నుంచి దూసుకెళ్లిన క్షిపణి.. తక్కువ ఎత్తులో అధిక వేగంతో దూసుకెళ్తున్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు.
భారత సంతతి రచయితకు సింగపూర్ లిటరేచర్ అవార్డు
భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతీ రామ్ (32)కు ప్రతిష్ఠాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు దక్కింది. 2023లో ఆమె రాసిన ‘నైన్ యార్డ్ శారీస్’ అనే English fiction కథానికకు ఈ అవార్డు లభించింది. తరతరాలుగా సింగపూర్, సిడ్నీ, న్యూయార్క్, కనెక్టికట్ లో విస్తరించిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో నానీ యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో Professorగా పనిచేస్తున్నారు ప్రశాంతి. సింగపూర్ లోని విక్టోరియా థియేటర్లో జరిగిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో కవి సిరిల్ వాంగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానల్ ప్రశాంతిని ప్రశంసించింది. ‘మహిళలు ఒకరినొకరు ఎలా ఇబ్బందులు పెట్టుకుంటారో.. కుటుంబాల్లోని పురుషులను ఎలా సమస్యల్లోకి నెడతారో ఆమె చక్కగా వివరించారు’ అని పేర్కొన్నారు. నాన్ ఫిక్షన్ విభాగం (ఇంగ్లీష్)లో భారత సంతతికే చెందిన శుబిగి రావుకు అవార్డు దక్కింది. ‘పల్ప్ 3: ‘యాన్ ఇంటి మేట్ ఇన్వెంటెరీ ఆఫ్ ద బానిష్క్ బుక్ కు ఈ గౌరవం దక్కింది. మొత్తం 17 మంది రచయితలు, అనువాదకులు, హాస్య కళాకారులకు సింగపూర్ లిటరేచర్ అవార్డులను ప్రదానం చేశారు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4
2024-25 నుంచి 2028-29 రూ.70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4ను అమలు చేయనున్నారు. రోడ్లు లేని 25 వేల ఆవాస ప్రాంతాలకు దీని కింద 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.49,087 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.21,087 కోట్లు ఉంటుంది. 2024-25 నుంచి 2031-32 మధ్య రూ.12,461 కోట్లతో జలవిద్యుత్తు ప్రాజెక్టులకు మౌలికవసతుల కల్పన కార్యక్రమాలు చేపడతారు. రోడ్లు, బ్రిడ్జిలతోపాటు ట్రాన్స్ మిషన్ లైన్లు, రైలుమార్గాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిర్మిస్తారు. దాంతో 2031-32 నాటికి జలవిద్యుత్తు సామర్థ్యాన్ని 31,350 మెగావాట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. విద్యుత్తు వాహనాలకు మరో రూ.14,000 కోట్లు ప్రోత్సాహకాలుగా అందిస్తారు.
■కచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేయడానికి రూ.2వేల కోట్లతో మిషన్ మౌసం అమలు చేయనున్నారు. ఇందుకోసం ఆధునిక రాడార్లు, శాటిలైట్ వ్యవస్థలు, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, కృత్రిమ మేథ లాంటివి సమకూరుస్తారు. వ్యవసాయానికి అవసరమైన కచ్చితమైన అంచనాలు అందిస్తారు. ఇప్పుడున్న ఫోర్ కాస్ట్ (ముందస్తు అంచనాలు) స్థానంలో నౌకాస్ట్ (తక్షణ అంచనాలు) వ్యవస్థను వచ్చే అయిదేళ్లలో అమల్లోకి తెస్తారు.
ప్రపంచకప్ తో భారత్ కు రూ.11,637 కోట్లు
దుబాయ్: భారత్ లో 2023 వన్డే ప్రపంచకప్ రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందనీ… పర్యాటక రంగం అత్యధికంగా లబ్ది పొందిందని ICC తెలిపింది. 2023 ప్రపంచకప్, క్రికెట్‌కు సంబంధించి గణనీయమైన ఆర్థిక శక్తిని ప్రదర్శించింది. భారత్ కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది” అని ICC CEO జెఫ్ అలారైస్ తెలిపాడు రికార్డు స్థాయిలో 12.5 లక్షల మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూశారు. వీక్షించారు. 75 శాతం మంది తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ కి హాజర య్యారు. ప్రపంచకప్ మ్యాచ్ లకు వచ్చిన 68 శాతం విదేశీయులు.. భారత దేశాన్ని పర్యాటక కేంద్రంగా సిఫారసు చేస్తామని అన్నారు” అని ఐసీసీ నివేదికలో పేర్కొంది. గత ఏడాది(2023) అక్టోబరు- నవంబరులో జరిగిన ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ ను ఓడించిన ఆసీస్.. ఆరోసారి ప్రపంచకప్ ను అందుకుంది.
విద్యుత్ వాహనాల ప్రోత్సాహకానికి ఫేమ్ స్థానంలో PM E-DRIVE
- PM E-DRIVE రూ.10,900 కోట్ల కేటాయింపులు
- రూ.3,435 కోట్లతో PM-E-Buss Seva payment security mechanism Scheme
దేశంలో విద్యుత్ వాహనాల(EV)ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు FAME స్థానంలో రూ.14,335 కోట్లతో 2 పథకాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అందులో Pm Electric drive revolution in innovative vehicle enhancement (PM E-DRIVE ) పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించారు. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. PM- PM-E-Buss Seva payment security mechanism Scheme (PSM) పథకానికి రూ.3,435 కోట్లు కేటాయించారు.
PM EDRIVE ఎలా ?
- రూ.3,679 కోట్లు: విద్యుత్ విభాగంలోని టూవీలర్స్, త్రీ వీలర్స్ అంబులెన్సులు, ట్రక్కులు, ఇతర EVలకు సబ్సిడీలు అందిస్తారు.
- 28 లక్షల వాహనాలకు: 24.79 లక్షల టూవీలర్స్, 3.16లక్షల త్రీ వీలర్స్, 14,028 బస్సుల కొనుగోలుదార్లకు ఈ పథకంతో ప్రయోజనం లభిస్తుంది..
- రూ.500 కోట్లు: ఇ-అంబులెన్స్‌ల కు
- రూ.500 కోట్లు: ఇ-ట్రక్కుల ప్రోత్సాహకానికి అందిస్తారు.
- రూ.4,391కోట్లు : 14,028 E-బస్సుల సేకరణకు అందిస్తారు. హైదరాబాద్ సహా 9 నగరాల్లో వీటి గిరాకీపై CESL లెక్కలు వేస్తుంది.
- రూ.2,000 కోట్ల వరకు: విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల (EVPCS) ఏర్పాటుకు కేటాయిస్తారు.
PM-E BUSS సేవా పథకం
- ప్రజా రవాణా సంస్థ (PTA)లు E-Bussల కొనుగోళ్ళతో పాటు పాటు 12 ఏళ్ల పాటు వాటిని నిర్వహించడానికి రూ.3,435 కోట్లను కేటాయించారు. 2024-25 నుంచి 2028-29 మధ్య కాలంలో 38,000 ఇ-బస్ లు రోడ్లపైకి రావడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
TGPSC Group 2 Excellence Series: From Beginner to Officer (EM & TM) :https://atvqp.on-app.in/app/oc/447150/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Group.3 Power pack Series Link: https://atvqp.on-app.in/app/oc/533406/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app