25 Economy Revision Topics : ఈ 25 టాపిక్స్ పై లుక్కేయండి: 80% మార్కులు పక్కా !

25 Economy Revision Topics : ఈ 25 టాపిక్స్ పై లుక్కేయండి: 80% మార్కులు పక్కా !

ఎకానమీ అంటే చాలా మందికి భయం… ఎంత చదివినా ఓ పట్టాన అర్థం కాదని అంటుంటారు. అయితే గ్రూప్ 3 ఎకానమీయే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్. ఆ ఒక్క సబ్జెక్ట్ మీదే 150 మార్కులకు పేపర్ ఉంది. అందుకే రాబోయే tgpsc గ్రూప్ 2 & గ్రూప్ 3 లో ఎకానమీలో ఏ టాపిక్స్ చదివితే బెటర్ అనేది 20 టాపిక్స్ సజెస్ట్ చేశాను. చదవండి… అలాగే దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది. దాన్ని చూస్తే మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది.

నవంబర్ లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది… డిసెంబర్లో గ్రూప్ 2 ఉంది… ఈ రెండు పరీక్షలకు…  ఎకానమీ నుంచి నేను చెప్పబోయే 20 టాపిక్స్ మీద పట్టు సంపాదించండి… మీకు తిరుగు లేదు…

ఈ వీడియో లింక్ కింద ఇస్తున్నా… వీడియో కూడా చూడండి… ఎనానమీ మీద పూర్తిగా పట్టు వస్తుంది. అలాగే మన Telangana Exams youtube channel ను subscribe చేసుకోండి.

1) భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు… నీతి ఆయోగ్.

పంచ వర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్ మీద దృష్టి పెట్టండి. పంచ వర్ష ప్రణాళికల్లో ప్రభుత్వాలు తీసుకున్న సంక్షేమ పథకాలు… ఎవరిని ఉద్దేశించినవి… అంటే పేదలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు… ఇలా ఆ తర్వాత వచ్చిన నీతి ఆయోగ్ నిర్మాణం… ఆయోగ్ వచ్చాక చేపట్టిన సంస్కరణలు… తీసుకున్న నిర్ణయాలు… ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ లెసన్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

2) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్:

2024 -25 సంవత్సరానికి….కేంద్ర ప్రభుత్వంతో పాటు… రాష్ట్ర బడ్జెట్ ను ఎ టూ జడ్ ప్రిపేర్ అవ్వండి.  కొత్త పన్నుల విధానాలు… కొత్త స్కీమ్ లు, అభివృద్ధి పథకాలకు నిధులు… ముఖ్యమైన శాఖలకు కేటాయింపులు… తగ్గాయా… పెరిగాయా… అలాగే GST అప్‌డేట్స్ మీద దృష్టి  పెట్టండి.

3) మానిటరీ పాలసీ:

RBI రెపో రేటు మార్పులు, ద్రవ్యోల్బణం లక్ష్యం వృద్ధిపై ప్రభావంపై లేటెస్ట్ అప్ డేట్స్ చూసుకోవాలి… గత కొంత కాలంగా రెపోరేటులో ఎలాంటి మార్పులు తేవడం లేదు… అలాగే ద్రవ్యోల్భణ ప్రభావం ఎలా ఉంది… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత దేశం ఎలా ఎదుగుతుందో… చూడాలి.

4. పేదరికం, నిరుద్యోగం:

భారత దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్యపై లేటెస్ట్ అప్ డేట్స్ కావాలి… అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం… MGNREGA పథకం… ఈ పథకంలో గత 2024 ఏప్రిల్ 1 నుంచి కూలీలకు ఇచ్చే డైలీ వేజ్ ను పెంచారు… దాని మీద మన టెస్టులతో పాటు… వీడియోల్లో కూడా అప్ డేట్స్ ఇచ్చాం. చూడండి…

5. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ:

భారత్ వ్యవసాయం మీద ఆధారపడి దేశం మీకు తెలుసు… అగ్రికల్చర్ మీద ఎకానమీలో ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి… పంటలకు కనీస మద్దతు ధర… MSP ఏ పంటకు ఎలా ఉంది… కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం… పీఎం కిసాన్… రాష్ట్రంలో రైతుల భరోసా… అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… భారీ ఎత్తున వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది… అది తెలుసుకోవాలి… కేంద్ర, రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవాలి… అలాగే ఫసల్ బీమా యోజన లాంటి పథకాలు… వ్యవసాయంతో పాటు… దాని మీద ఆధారపడి పాడి పరిశ్రమ, ఫౌల్ట్రీ లో ప్రభుత్వ నిర్ణయాలను కూడా తెలుసుకోవాలి.

6. బ్యాంకింగ్ రంగ సంస్కరణలు:

బ్యాంకుల రీక్యాపిటలైజేషన్… ఈమధ్య బ్యాంకుల విలీనం జరుగుతున్నాయి… అలాగే బ్యంకుల్లో పెరిగిపోతున్న మొండి బకాయిలు… NPAలు ఇంకా … ప్రభుత్వ రంగ సంస్థలు విలీనం అవుతున్నాయి. బ్యాకింగ్ లో పెరిగిపోతున్న డిజిటల్ వ్యవస్థ… ఆర్భీఐ కొత్త నిర్ణయాలు… సంస్కరణలు.  ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY), మైక్రోఫైనాన్స్ మరియు డిజిటల్ బ్యాంకింగ్.

7. విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు:

కేంద్ర ప్రభుత్వం FDI విధానాలు… ఇటీవల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలు… ఏవి 100శాతం FDIలకు అనుమతి ఉంది… వేటికి లేదు… తెలుసుకోవాలి… కొత్తగా వచ్చిన FDIలపై దృష్టి పెట్టాలి. అలాగే భారతదేశం యొక్క వాణిజ్య లోటు, FTAల ఒప్పందాలు. విదేశాతలతో వ్యూహాత్మక భాగస్వామ్యం…

8. భారతదేశంపై గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ :

ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నాయి. బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధాలు… రష్యా – ఉక్రెయిన్ వార్ తో చమురు ధరల హెచ్చుతగ్గులు, వాణిజ్య అంతరాయాలు. ఇజ్రాయెల్ … లెబనాన్… ఇరాన్ యుద్ధం పరిస్థితులతో ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్.  ఇటు బంగ్లాదేశ్ లో సంక్షోభంతో… మన దేశంతో వాణిజ్యంపై ప్రభావం తెలుసుకోవాలి.

9. ద్రవ్యోల్బణ ధోరణులు:

దేశంలో ద్రవ్యోల్భణ పరిస్థితి ఎలా ఉంది… ఆహారం, ఇంధనం, వస్తువుల ధరలలో ఇటీవలి ద్రవ్యోల్బణం పోకడలు… నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం… లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

10. ఇండియన్ స్టార్టప్స్, MSME సెక్టార్

దేశ జనాభాపై స్టార్టప్స్ ప్రభావం… వాటిని ఆదుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పోత్సాహకాలు…  ప్రభుత్వ పథకాలు, సవాళ్లు, ఇటీవలి వృద్ధి పోకడల గురించి అవగాహన పెంచుకోవాలి.

11. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ వ్యవస్థలు :

ప్రపంచ వ్యాప్తంగా UPIలావాదేవీలు రికార్డులు సృష్టించడం… డిజిటల్ బ్యాంకింగ్ లో సంస్కరణలు, ఇ-కామర్స్ లో పెట్టుబడులు పెరగడం… విదేశాల్లో భారత్ డిజిటల్ ప్రభావంపై అవగాహన పెంచుకోవాలి.

12 గ్రీన్ ఎకానమీ ఇనిషియేటివ్స్:

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్, కార్బన్ క్రెడిట్స్, క్లైమేట్ ఫైనాన్స్… శక్తి రంగ సంస్కరణలు కూడా ఇందులో ప్రధానం. పునరుత్పాదక ఇంధన విధానాలు, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు). ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన  పీఎం Edrive స్కీమ్… ఈవీలకు రాయితీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు… రాష్ట్రాలకు ప్రజారవాణా అంటే ఆర్టీసీలకు EV బస్సులు ఇవ్వడం… లాంటి చర్యలు.

13. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్:

మేకిన్ ఇండియా అమల్లోకి వచ్చాక… దాని అభివృద్ధి ఎలా ఉంది… అలాగే తయారీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపించింది… ఆ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు. కొత్తగా మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా అభివృద్ధిలో భాగంగా తీసుకున్న చర్యలు, గత 2024-25 బడ్జెట్ లో కొత్త ప్రోత్సాహకాలు

14 స్కిల్ డెవలప్ మెంట్ దిశగా సంస్కరణలు:

స్కిల్ ఇండియా, జాతీయ విద్యా విధానం (NEP) 2020 వంటి పథకాలు తెలుసుకోవాలి… అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన కోటి మందికి 5000 రూపాయల చొప్పున ఇంటర్నెషిప్ పథకం… కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి నెల వేతనం ఇవ్వడం… EPFలో జమ చేయడం… లాంటివి.  ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న స్కిల్ యూనివర్సిటీ… ITI ల్లో స్కిల్డ్ కోర్సులను ప్రవేశపెట్టడం… లాంటి చర్యలు

15. విదేశీ మారక నిల్వలు, కరెన్సీ నిర్వహణ:

ఫారెక్స్ నిల్వలు ఎలా ఉన్నాయి… రూపాయి-డాలర్ మారకపు రేటు… స్టాక్ మార్కెట్లో అస్థిరత… అంశాలు… డాలర్ రేటు మళ్ళీ పెరిగింది… అలాగే బంగారంపై ప్రభావం…

16. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి పథకాలు, కార్మిక సంస్కరణలు:

వేతనాలపై కోడ్, లేబర్ కోడ్ సంస్కరణలు గిగ్ ఎకానమీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు. రాష్ట్రంలో డెలివరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం… లాంటి స్కీమ్స్.

17. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్ మస్ట్ గా వస్తాయి… PM-KISAN, ఆయుష్మాన్ భారత్, ప్రత్యక్ష నగదు బదిలీలు (DBT). 2024-25 కేంద్ర , రాష్ట్రాల బడ్జెట్ లో తెచ్చిన కొత్త పథకాలు… అమలు విధానం తెలుసుకోవాలి.

18. మౌలిక సదుపాయాల అభివృద్ధి:

దేశవ్యాప్తంగా… నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (NIP), రోడ్‌వేలు, రైల్వేలు, స్మార్ట్ సిటీల అభివృద్ధికి నిధులు… ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఫోర్త్ సిటీ, రింగ్ రోడ్స్, కొత్త ఫ్రైఓవర్లు, మూసీ ప్రక్షాళన లాంటి కార్యక్రమాలు.

19. వాతావరణ మార్పు ఆర్థిక ప్రభావం: గ్లోబల్ వార్మింగ్, వాతావరణ ఉపశమన వ్యూహాలు భారతదేశం యొక్క కట్టుబాట్లు. అంతర్జాతీయ కాప్ సదస్సులు, UNO తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో భారత్ పాత్ర లాంటివి చదవాలి.

20) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 : కొత్త బడ్జెట్ లో వివిధ వర్గాలకు కేటాయింపులు, కొత్త పథకాలు, ఆరు గ్యారంటీల స్కీములు – వాటి అమలు – నిధులు

21) తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్, ఐటీ సర్వీస్ సెక్టార్ అభివృద్ధి  కొత్త పరిశ్రమలు, FDIలు, పెట్టుబడులు

22) తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వాటి అభివృద్ధి, కేటాయింపులు

23) తెలంగాణలో కొత్త ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, కొత్త స్కీములు, పాలసీలు

24)  తెలంగాణలో నిరుద్యోగ, స్కిల్ డెవలప్ మెంట్ పాలసీ

25) తెలంగాణలో నీటిపారుదల రంగం, కొత్త ప్రాజెక్టులు, ఒడిదుడుకులు

ఇంకా: చేనేత, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ,

టూరిజం అభివృద్ధి , పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన

తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ రోల్

తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధి

అటవీశాఖ, మైనింగ్ శాఖల ఆదాయం

రెవెన్యూ, రియల్ ఎస్టేట్ రంగం, అర్భన్ డెవలప్ మెంట్

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్

భారత ఎగుమతుల్లో తెలంగాణ పాత్ర… ముఖ్యంగా ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ సేవలు

తెలంగాణలో స్వయం ఉపాధి సంఘాలు, వాళ్ళకి కల్పించిన వడ్డీ రాయితీలు, ప్రోత్సాహకాలు

ECONOMY 25 TOPICS

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!