AP Police Constable Recruitment 2024 : వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన పోలీస్ కానిస్టేబుల్ (AP Police constable ) నియామక ప్రక్రియను టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టబోతోంది. నియామక ప్రక్రియ తిరిగి ప్రారంభించేందుకు న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మొత్తం ఏపీలో 6500 పోలీస్ ఉద్యోగాలు (Police Jobs) ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు నెలాఖరులోగా షెడ్యూల్ (Schedule) విడుదల అయ్యే అవకాశముంది.
వైసీపీ ప్రభుత్వం (YCP Govt) చేపట్టిన కానిస్టేబుల్ (Constable) నియామక ప్రక్రియపై కోర్టుల్లో కేసులు ఫైల్ అయ్యాయి. వాటి ప్రోగ్రెస్ కనుక్కొని రిక్రూట్ మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. DGP ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ PH రామకృష్ణ ఈ అంశంపై సమీక్ష జరిపారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ ప్రారంభించి… అందుకు సంబంధించిన షెడ్యూల్ ను నిర్ణయించే అవకాశముంది.
ఏటా 6,500 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చినా… అది అమలు కాలేదు. ఆయన ఐదేళ్ళ పాలనలో ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. చివరకు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత కూడా ఆ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ముందుకు పోలేదు.
కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమ్స్ (Police jobs prelims) నిర్వహించి, ఫలితాలు ప్రకటించారు. కానీ ఆ తర్వాత దశలను పట్టించుకోలేదు. ఇప్పుడు NDA ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది.
ప్రిలిమ్స్ లో 95,208 మంది అర్హత
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రిలిమ్స్ కు 4,58,219 మంది హాజరయ్యారు. వాళ్ళల్లో 95,208 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 2023 ఫిబ్రవరి 5న ఈ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళకి రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (PMT, PET) పరీక్షలు నిర్వహించాలి. 2023 మార్చి 13 నుంచి 20 వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్ ఇచ్చి హాల్ టికెట్లు కూడా ఇష్యూ చేశారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ MLA ఎన్నికల పేరు చెప్పి వాయిదా వేశారు.
అభ్యర్థుల కష్టాలు
నోటిఫికేషన్ జారీ చేయడానికి రెండేళ్ల ముందు నుంచే నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు NDA ప్రభుత్వం నియామక ప్రక్రియ మొదలు పెడుతుండటంతో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు.