10 Points about Job Calendar : పక్కాగా కొలువు ! జాబ్ కేలండర్ ఇలా వాడుకోండి

10 Points about Job Calendar : పక్కాగా కొలువు !  జాబ్ కేలండర్ ఇలా వాడుకోండి
  1. జాబ్ కేలండర్ ని అర్థం చేసుకోండి… Understanding the Job calendar

స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ కేలండర్ లో 14 రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది.  ఇందులో 2024 అక్టోబర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 2, గ్రూప్ 3, DSC, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకులాల్లో టీచర్లు, లెక్చరర్లు, వైద్యశాఖలో పోస్టులు, TRANSCO, GENCO… చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూసే పోలీస్ ఉద్యోగాలు… సింగరేణి పోస్టులతో సహా మొత్తం 14 రకాల నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి… ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అన్నది డేట్స్, మంథ్స్ తో సహా ఇచ్చారు.

  1. మీకు ఏ కొలువులకు అర్హత ఉంది ? Identifying relevant opportunities

మీరు మొత్తం ఆ జాబ్ కేలండర్ ను ఒక్కసారి చూసి… అందులో మీకు ఉన్న క్వాలిఫికేషన్ కి మీరు ఏ ఎగ్జామ్ కి eligible తెలుసుకోండి… వాటికి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు పడతాయో చూసుకొని నోట్ చేసుకోండి… మీ మొబైల్ లేదా పీసీలో… మీకు అర్హత ఉన్న కొలువులు… నోటిఫికేషన్లు… వాటికి ఎగ్జామ్స్ జరిగే డేట్స్ ని గుర్తు పెట్టుకోండి.

  1. మీ ఉద్యోగానికి తగ్గట్టుగా టైమ్ లైన్ తయారు చేసుకోవాలి. Creating a Personalized Time Line

మీకు అర్హత ఉన్న ఉద్యోగాల్లో… ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏంటి ? డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళకి… డిసెంబర్ లో జరిగే గ్రూప్ 2 లో పోస్టుల సంఖ్య పెంచితే అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి.. ఆ ప్రస్తావన రాలేదు.  కాబట్టి పోస్టుల సంఖ్య పెంచుతారా లేదంటే… వచ్చే ఏడాది మే నెలలో వేసే నోటిఫికేషన్ దాకా కొత్త వాళ్ళు వెయిట్ చేయక తప్పదు అనిపిస్తోంది.

సరే… మీకు ముందుగా రిలీజ్ అయ్యే నోటిఫికేషన్… మళ్ళీ గ్రూప్ 1… అది కూడా ఎప్పుడు… ఈ ఏడాది అక్టోబర్ లోనే… దానికి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది.  దానికి తగ్గట్టుగా మనం ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి… రోజుకి ఎన్ని గంటలు చదవాలి… లాంటివి ప్లాన్ చేసుకోవాలి.

  1. మీ లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకోండి… Setting clear goals

మీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న గట్టి పట్టుదలగా ఉంటే… మీ లక్ష్యం ఏంటి అన్నదానిపై క్లారిటీ ఉండాలి.  ఇన్ని నోటిఫికేషన్లకు ఎలా ప్రిపేర్ అవ్వాలి… అసలు నేను ఏ జాబ్ కు సూట్ అవుతానో… నాకు జాబ్ వస్తుందో రాదో లాంటి అపోహలు పెట్టుకోకుండా… మీ ప్రిపరేషన్ ను ఎలా ప్రారంభించాలి…ఆయా ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి… సిలబస్ ఎలా ఉంటుంది… నేను అసలు ఏయే ఉద్యోగాలకు అప్లయ్ చేయాలి… వాటిల్లో ఏది అసలు నా టార్గెట్ అన్నది నిర్ణయించుకోవాలి.  కొందరికి గ్రూప్ 1 ఉండొచ్చు… అలాంటి వాళ్ళు… సిలబస్ లో అంశాలు డెప్త్ గా చదవడంతో పాటు… ఎస్సేస్ రాసే స్కిల్ పెంచుకోవలి. గ్రూప్ 2 కొట్టాలి అనుకుంటే… డీప్ స్టడీతో పాటు… అన్ని అంశాలపైనా సమగ్రమైన అవగాహన ఉండాలి.  ఇలా… మీ లక్ష్యానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి.

  1. మీ సొంతంగా స్టడీ ప్లాన్ లేదా సిలబస్ ఛార్ట్ తయారు చేసుకోండి Effective Study planning

మీరు ఏయే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలో అవగాహన వచ్చినప్పుడు … ఆ ఎగ్జామ్ జరిగే డేట్స్ కి తగ్గట్టుగా సిలబస్ ఛార్ట్ లేదా స్టడీ ప్లాన్ రెడీ చేసుకోవాలి… ముందుగా వచ్చేది గ్రూప్ 1 ఎగ్జామ్…2025 ఫిబ్రవరిలో జరుగుతుంది. మీకు అర్హత ఉన్న గ్రూప్ 1 రాసుకోడానికి  సిలబస్ ఛార్ట్ లేదా స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి.  ఇప్పటి నుంచి… గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ కి 7 నెలల టైమ్ ఉంది… ఫుల్లుగా ప్రిపేర్ అవ్వొచ్చు. ఇలా ప్రతి ఎగ్జామ్ కీ స్టడీ ప్లాన్ చేసుకోండి… మీరు మొదటి ఎగ్జామ్ కి వేసుకున్న స్టడీ ప్లాన్ ను … మిగతా ఎగ్జామ్స్ కోసం… కుదించుకోవచ్చు… ఇప్పుడు 7 నెలలు… అప్పుడు ఇంకో ఎగ్జామ్ రాయడానికి 4 లేదా 5 నెలల టైమ్ ఉండొచ్చు… దానికి తగ్గట్టుగా స్టడీ ప్లాన్ లేదా సిలబస్ ఛార్ట్ లో మార్పులు ఉండాలి.  స్టడీ ప్లాన్ లేదా సిలబస్ ఛార్ట్ లేకపోతే ఉద్యోగం కొట్టడం అసాధ్యం. సిలబస్ లో అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా స్టడీ ప్లాన్ ఉండాలి.

అది ఎలా తయారు చేసుకోవాలో సపరేట్ వీడియో ఇస్తున్నా… మన Telangana Exams youtube channel  ఛానెల్ లో

  1. బుక్స్ ఇతర సోర్స్ ఉపయోగం Resource utilization

మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కి ఏ బుక్స్ అవసరం… వెయ్యి బిట్లు, రెండు వేల బిట్లు అని మార్కెట్లో కనిపించే బుక్స్ కొనకుండా… రిఫరెన్స్ బుక్స్… డెప్త్ గా చదువుకోడానికి ఉపయోగపడే తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇతర ప్రముఖ ఫ్యాకల్టీస్ రాసిన బుక్స్ తెచ్చుకోవాలి.  దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు వీడియోలు ఇస్తుంటా… మన ఛానెల్ ను ఫాలో అవ్వండి…

మార్కెట్లో ఉన్న అన్ని పుస్తకాలు కొనవద్దు… కొన్ని స్టాండర్డ్ బుక్స్ కొనాలి.  వాటితో పాటు… డైలీ పేపర్లలో వచ్చే బిట్స్ ప్రిపేర్ అవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కొత్త పథకాలు, కొత్త SEZ లు… లాంటి అప్ డేషన్స్ ఎప్పుడూ మిస్ అవ్వొద్దు.  రోజూ నోట్స్ రాసుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి.  మీరు బుక్స్ ని మాత్రమే నమ్ముకుంటే అప్ డేట్స్ మిస్ అవుతాయి.

  1. బుక్స్ ఫాలో అవుతూ రెగ్యులర్ అప్ డేట్స్ మిస్ అవ్వొద్దు Regular updates Monitoring

జాబ్ కేలండర్ లో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే తెలుసుకుంటూ ఉండాలి.  ఒక్కోసారి నోటిఫికేషన్ లేదా ఎగ్జామ్ షెడ్యూల్ లో అనుకోకుండా మార్పులు జరుగుతాయి.  వాటికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ మార్చుకోవలి కాబట్టి… అప్ డేట్స్ మిస్ అవ్వొద్దు.  అలాంటివి ఏవైనా ఉంటే… మన Exams Centre247 వెబ్ సైట్ లో ఏ రోజుకారోజు ఇస్తాం… ఆ వెబ్ సైట్ ని subscribe చేసుకోండి.

  1. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి Application Process guidance

Tgpsc లో One time registration ఉంటుంది.  కాబట్టి… ఇంకా ఎవరైనా డిగ్రీ పూర్తి చేసిన వారు OTR చేయకపోతే చేయండి… నోటిఫికేషన్లు పడినప్పుడు… ఆ OTR లో ఏవైనా ఎడిట్ చేయాలనుకుంటే… అడ్రెస్ లేదా LOCAL AREA … ఇంకా ఏవైనా చేసుకొని… ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.  OTR పూర్తి చేసేటప్పుడు… మీ చదువులు, స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోండి… వీలుంటే దాన్ని కూడా ఏ ఛార్ట్ లాగా రాసుకొని అప్లికేషన్ ఫిల్ చేయండి మొదలుపెట్టండి… అప్పుడు మీకు ఈజీ అవుతుంది.

  1. Mock Tests & Practice

మీరు ఎగ్జామ్స్ ని ప్రాక్టీస్ చేయకుండా… అసలు ఎగ్జామ్ రాయలేరు.  అందుకే ప్రతి లెసన్ కీ మాక్ టెస్టులు రాయాలి.  అందులో మీకు ఏవైనా తప్పులు పోతే… మళ్ళీ ఆ లెసన్ లో ఆ పార్ట్ చదువుకోవాలి… మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో పాటు… ప్రీవియస్ ఇయర్ క్వొశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి.  అప్పుడే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు. Exams centre247/Telangana Exams plus  యాప్ లో ఉండే వీడియో కోర్సులు, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల కోర్సుల్లో జాయిన్ అవ్వాలి.

Telangana Exams plus యాప్ లో  గ్రూప్ 1 ,2,3 తో పాటు… పోలీస్ ఉద్యోగాలకు సపరేట్ గా టెస్ట్ సిరీస్ ని ఈ ఆగస్ట్ 15కి ప్రారంభిస్తున్నాం.  ఐదు టెస్ట్ సిరీసెస్ ఆ రోజు స్టార్ట్ అవుతాయి.

ఇక నుంచి మేం నిర్వహించే టెస్ట్ సిరీస్ లను 6 నెలల వాలిడిటీతో 199 రూపాయలు… 1 year వ్యాలిడిటీతో   399కు అందిస్తాం.  కొత్త యాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నాం. మీకు ఇష్టమైన కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.  నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా… అన్ని రకాల కోర్సులను ఆగస్టు 15 కల్లా అప్ డేట్ చేసి పెడతాం.. వాటిల్లో జాయిన్ అవ్వండి. ఇందులో ప్రతి లెసన్ కి మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు… మళ్ళీ సబ్జెక్టు వైజ్ గా గ్రాండ్ టెస్టులు కూడా పెట్టే ఆలోచన ఉంది. దీనికి తోడు… ప్రతి కోర్సుకి విడి విడిగా ఎలా ప్రిపేర్ అవ్వాలి… ప్రీవియస్ ఇయర్స్ లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి… లాంటి preparation videos అందిస్తాం. వీటితో పాటు… గతంలో సివిల్స్, గ్రూప్స్ విజేతల సక్సెస్ ప్లాన్స్ ని … Telangana exams youtube channel తో పాటు… exams centre247 job calander, TG job calander, telangana job calander, telangana jobs
TG jobs, TGPSCwebsite
లో కూడా ఇస్తాం.

  1. పాజిటివ్ దృక్పథం ఉండాలి Staying Motivated and Focused:

మన లక్ష్యాన్ని చేరుకోవాలి… మనం ఏది ఏమైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే… తప్పనిసరిగా పాజిటివ్ దృక్పథంతో ఉండాలి… ఇన్ని లక్షల మంది రాస్తున్నారు… మనకు ఉద్యోగం వస్తుందా… లేదంటే…ఆ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు… లాంటి రూమర్స్ ని నమ్మొద్దు… ఎవరైనా చెప్పినా లైట్ తీసుకోండి.  మీరు గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి అంటే… ఫోకస్ దాని మీదే ఉండాలి… వేరే విషయాల మీద మనస్సు పెట్టి… distract అవ్వొద్దు.

అలాగే జాబ్ కేలండర్ వచ్చింది… ఏ నోటిఫికేషన్ ఎప్పుడు… ఎగ్జామ్ ఎప్పుడు అన్నదానిపై క్లారిటీ ఉంది… అలాంటప్పుడు… టెన్షన్ ఎందుకు పడాలి… హాయిగా కూల్ గా అర్థం చేసుకుంటూ… హెల్త్ ని కాపాడుకుంటూ ప్రిపేర్ అవ్వండి.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!