Hai Readers …
ఈ ఆర్టికల్ చదువుతున్న వాళ్ళంతా Telangana Exams you tube channel subscribe చేసుకోండి. మన ఛానెల్ లో జీకే, కరెంట్ ఎఫైర్స్, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రభుత్వ విధనాలు… ఇలా కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన… ప్రతి ఎగ్జామ్ లో రాబోయే అంశాలతో వీడియోలు ఇస్తున్నాం. అలాగే ఆగస్టు 15 నుంచి మన Telangana Exams plus app & Exams centre 247 యాప్స్ లో 5 కోర్సులను introduce చేస్తున్నాం.
తెలంగాణ గవర్నమెంట్ జాబ్ కేలండర్ రిలీజ్ చేసింది… అందులో హామీ ఇచ్చినట్టే నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధమవుతోంది. పోస్టులను భర్తీ చేయడంలో కూడా ప్రక్రియను స్పీడప్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది కాలంలో దాదాపు 50 వేల దాకా పోస్టులను ఈ జాబ్ కేలండర్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
నేను ఈ వీడియోలో కొన్ని ముఖ్య విషయాలను మీకు వివరించబోతున్నాను. అందువల్ల వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూండి…
- జాబ్ కేలండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని నోటిఫికేషన్లు ఖచ్చితంగా జారీ చేయబోతోంది.
- ఇక నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులన్నీ కలపి..….గ్రూప్-3లోనే నిర్వహిస్తారు
- వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతతో ఉన్న పోస్టులకు ఒకే ఎగ్జామ్ … అంటే జనరల్ స్టడీస్ పరీక్షను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
ఇలాంటి అనేక కీలక అంశాల గురించి తెలుసుకోడానికి మీరంతా . మీరంతా Telangana Exams you tube channel ను subscribe చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే జాబ్ కేలండర్ ఇచ్చేసింది. అందులో ఉన్న డేట్స్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని TGPSC తో పాటు ఆయన నియామక సంస్థలు డిసైడ్ అయ్యాయి. పైగా వాటిల్లో కొన్ని సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నాయి.
అదెలా అంటే… మనం జూనియర్ అసిస్టెంట్… అకౌంటెంట్… ఇలా ఏవేవో పోస్టులకు విడి విడిగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాం. అన్నింటికీ కూడా విడి విడిగా అప్లయ్ చేసుకోవాలి… విడిగా ఎగ్జామ్స్ రాయాలి. అందుకే రాబోయే జాబ్ కేలండర్ లో… అన్ని ప్రభుత్వ విభాగాల్లో… ఒకే విద్యార్హత అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉన్న పోస్టులన్నీ కూడా ఒకే platform మీదకు తీసుకొస్తారు. ఆ కొలువులు అన్నింటికీ… జనరల్ స్టడీస్ పరీక్షను పేపర్-1గా ఉమ్మడిగా నిర్వహిస్తారు. గతంలో టెక్నికల్, అగ్రికల్చరల్, మెడికల్ జాబ్స్ కి కూడా విడిగా జనరల్ స్టడీస్ పేపర్ ఉండేది… అది కాకుండా సెకండ్ పేపర్… వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు మామూలు డిగ్రీ వాళ్ళతో పాటే… టెక్నికల్, అగ్రికల్చరర్ వాళ్ళకి కూడా జనరల్ స్టడీస్ ని కలపి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. TGPSC తో పాటు… పోలీస్ ఉద్యోగాలు… గురుకుల, వైద్య నియామకాలు… డీఎస్సీ నిర్వహించే విద్యాశాఖ… ఇలా అన్ని విభాగాలు కలసి పనిచేస్తాయి… గతంలో లాగా నా ఎగ్జామ్ నాదే… నీ ఎగ్జామ్ నీదే… అన్నట్టుగా కాకుండా కలసి పనిచేయడమే… ఈ సపంస్కరణల లక్ష్యం.
తెలంగాణ అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ కేలండర్ ప్రకారం… గ్రూప్-1 మెయిన్స్ గతంలో ప్రకటించినట్టే అక్టోబర్ లో జరుగుతాయి. అదే టైమ్ లో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. 2022లో రిలీజ్ అయిన గ్రూప్-2 జాబ్స్ నోటిఫికేషన్ కి ఎగ్జామ్స్ డిసెంబరులో జరుగుతాయి… వీటికి ఇంకా డేట్స్ రాలేదు. వాటిని తొందర్లోనే TGPSC రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో 783 పోస్టులే ఉన్నాయి… పెంచే అవకాశం లేదని అనుకుంటున్నా… ఎలాగూ కొత్త నోటిఫికేషన్ వేస్తారు కాబట్టి.. అందులో పోస్టుల సంఖ్య పెరిగే ఛాన్సుంది.
ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు ఏంటంటే…
ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లలో గ్రూప్-3, 4 కేటగిరీ పోస్టులన్నింటికీ కలిపి ఇక నుంచి గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేస్తారు. అర్హత డిగ్రీయే ఉంటుంది. గతంలో జిల్లా స్థాయి గ్రూప్-4 పోస్టులకు ఇంటర్మీడియట్, రాష్ట్ర స్థాయి గ్రూప్-3 పోస్టులకు డిగ్రీ అర్హత ఉండేది. కానీ ఇప్పుడు గ్రూప్-3, 4 పోస్టులు అన్నింటికీ… ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ గా నిర్ణయిస్తారు. విద్యార్హతలు, పోస్టులు, హోదా ఒకటే కావడంతో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులన్నింటినీ కలిపేస్తారు. ఈ పోస్టులకు గ్రూప్-3 కింద TGSPC కామన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. అంటే ప్రత్యేకంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది ఇక రిలీజ్ కాదు. ఈ కామన్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా అభ్యర్థులు తమకు ఇష్టమైన ఉద్యోగాలకు ఆప్షన్స్ ఎంచుకోడానికి అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళు గ్రూప్-3 కేటగిరీకి పోస్టులకు వెళతారా… లేదంటే గ్రూప్-4 కేటగిరీకి పోస్టులకు వెళతారా అన్నది అభ్యర్థుల నిర్ణయం. పోస్టులను బట్టి ఖాళీలను బట్టి… ఒకేసారి 30, 40 దాకా పోస్టులకు ఆప్షన్స్ ఇచ్చే ఛాన్సు ఉంటుంది. SSC ఎగ్జామ్స్ లో అలాగే ఉంటుంది. అలా ఇవ్వడం ద్వారా… మీకు వచ్చే మెరిట్ ను బట్టి… మీ ఛాయిస్ ని బట్టి… ఉద్యోగం ఎలాట్ అవుతుంది. దీనివల్ల గ్రూప్ 3, గ్రూప్ 4 అని రెండు ఎగ్జామ్స్ నిర్వహించకుండా… ఒకే ఎగ్జామ్ ద్వారా తొందరగా రిక్రూట్ మెంట్ పూర్తి చేయొచ్చు.
ఇక గ్రూప్-1 నోటిఫికేషన్ లోనే… ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి చెందిన Assistant Conservator of Forest పోస్టులకు ఉమ్మడిగా ప్రిలిమ్స్ జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళని మెయిన్స్ కి ఎంపిక చేస్తారు. అటవీశాఖ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రత్యేకంగా మెరిట్ లిస్ట్ ప్రకటించింది… వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక అటవీ రేంజ్ ఆఫీసర్ పోస్టులను గ్రూప్-2లో కలిపేబోతున్నారు. గ్రూప్-2 ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను SRO పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఇంక నెక్ట్స్….
గ్రూప్-1, 2, 3 కేటగిరీల పరిధిలోకి రాకుంటా ఉన్న మిగిలిన ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందిన గెజిటెడ్ స్కేలు పోస్టులను కూడా ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకొస్తారు. కొన్ని పోస్టులకు స్పెషల్ క్వాలిఫికేషన్లు ఉంటాయి. అయేత ఆ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాటన్నింటినీ ఒకే నోటిఫికేషన్ లోకి తీసుకొస్తారు. ఉదాహరణకు హాస్టల్ వార్డెన్స్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు….లాంటివి. వీటికి పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ఇస్తారు.
పేపర్-1 ఎగ్జామ్ గా జనరల్ స్టడీస్ ని కంబైన్డ్ గా నిర్వహిస్తారు. తర్వాత వాళ్ళ పోస్టులకు తగ్గట్టుగా సంబంధిత సబ్జెక్టుల స్పెషలైజే షన్ పరీక్షలను వేరేగా కండక్ట్ చేస్తారు. దాంతో వేర్వేరు నోటిఫికేషన్లతో టైమ్ వేస్ట్ అవ్వకుండా… చూడాలన్నది ప్రభుత్వం ప్లాన్. ఇలా రెండు ఎగ్జామ్స్ లో ఎవరి మార్కులు ఎక్కువ ఉంటే… మెరిట్ జాబితా ప్రకటించి.. డైరెక్ట్ గా రిక్రూట్ మెంట్ పూర్తి చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ స్థాయిలో UPSC, SSC లాంటి ఎగ్జామ్స్ ద్వారా ఖాళీల భర్తీకి ఇలాంటి మెథడ్ నే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ TGPSC తో పాటు మిగిలిన సంస్థలు అన్నింటికీ కలిపి నియామకాలను ఉమ్మడిగా నిర్వహించబోతున్నారు.
అభ్యర్థులు… గ్రూప్,1, గ్రూప్ 2, గ్రూప్.3, గ్రూప్4 ఎగ్జామ్స్ కాకుండా…… ఇంకా వేరే విభాగాలకి మళ్లీ విడిగా అప్లయ్ చేసుకొని… వాటికి సపరేట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు.