సంఘర్షణ ప్రభావిత దేశాలలో చిక్కుకుపోయిన తన పౌరులను తిరిగి తీసుకురావడానికి భారతదేశం అనేక విజయవంతమైన మిషన్లను ప్రారంభించింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్‌లు ఉన్నాయి:
- ఆపరేషన్ అజయ్ (2023): ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ మిలిటెంట్ల దాడులతో ఉద్రిక్తతలు పెరగడంతో ఇజ్రాయెల్ నుంచి భారతీయులు తిరిగి తెచ్చేందుకు ప్రారంభించారు. ఆ సమయంలో దాదాపు 18,000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు
- ఆపరేషన్ కావేరి (2023): సుడాన్ లో ఘర్షణలు తలెత్తడంతో భారతీయులు, విదేశీ పౌరులను తరలించడానికి ఆపరేషన్ కావేరి చేపట్టారు. దాదాపు 2,500 మంది భారతీయులను వాయు, సముద్రం మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు
- ఆపరేషన్ దోస్త్ (2023): ఫిబ్రవరిలో 2023 టర్కీ-సిరియా భూకంపం రెండు దేశాలను నాశనం చేశాక… సిరియా, టర్కీలకు సాయం చేయడానికి ప్రారంభించారు.
- ఆపరేషన్ గంగా (2022): 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పొరుగు దేశాల్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు చేపట్టారు. రొమేనియా, హంగేరి, పోలాండ్, మోల్డోవా, స్లోవేకియా నుంచి దాదాపు 16,000 మంది భారతీయులు భారతదేశానికి తిరిగి వచ్చారు.
- ఆపరేషన్ దేవి శక్తి (2021): కాబూల్ తాలిబాన్ల వశం కావడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి భారత వైమానిక దళం ఈ ఆపరేషన్ నిర్వహించింది
TGPSC Group 2 Excellence Series: From Beginner to Officer (EM & TM) by Telangana Exams Plus app.
CLICK HERE : JOIN GROUP.2 COURSE FOR DECEMBER EXAMS