పారా ఒలింపిక్స్ లో తొలి పతకం ప్రీతి పాల్ కి
పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కి తొలి పతకం అథ్లెటిక్స్ లో వచ్చింది. మహిళల టీ-35… 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ (23) కాంస్యం గెలిచి పారిస్ లో భారత్ పతకాల పట్టికను తెరిచింది. 2024 ఆగస్టు 30నాడు జరిగిన పోరులో ఆమె 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. చైనా అథ్లెట్లు జౌ జియా (13.58 సెకన్లు), గువా కియాంక్వియాన్ (13, 74 సెకన్లు) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన ప్రీతి పాల్.. బలహీన, వంకర కాళ్లతో పుట్టింది. దాంతో చాలా రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంది. తన కాళ్లలో బలం పెంచి సాధారణ స్థితికి తీసుకురావడానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొన్నేళ్లు కాలిపర్స్ కూడా ధరించింది. అయినా ఉపయోగం లేదు. 17 ఏళ్లప్పుడు పారా ఒలింపిక్స్ గురించి తెలిశాక ప్రతీపాల్ లో కొత్తగా ఆలోచింది. పారా అథ్లెట్ ఫాతిమా ఖాతూన్ ను కలిసింది. పరుగులో సాధన చేసి తనూ పారా అథ్లెట్ గా మారింది. తర్వాతి ఏడాదే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడింది. 100 మీ, 200 మీలో జాతీయ ఉత్తమ అథ్లెట్ గా ఎదిగింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ లో ఈ రెండు విభాగాల్లోనూ కాంస్యాలు సాధించింది. ఇప్పుడు పారాలింపిక్స్ లో పోటీ పడ్డ తొలిసారే 100 మీ.లో కాంస్యం సాధించింది. ఆమె 200 మీ.లోనూ బరిలో పోటీ పడుతోంది.
భారత్ కు మూడో అణుజలాంతర్గామి
భారత నౌకాదళంలో రెండో అణుశక్తి జలాంతర్గామి INS అరిఘాత్ చేరిన తర్వాత 3వ సబ్ మెరైన్ కూడా మరో 6 నెలల్లో రెడీ అవుతున్నట్టు తెలిసింది. INS అరిదమన్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ అణుశక్తి జలాంతర్గామి మరో ఆరు నెలల్లో నౌకాదళంలో చేరబోతోంది. అరిదమన్ కు ప్రస్తుతం సముద్ర పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి రెండు జలాంతర్గాముల కంటే ఇది పెద్దది. INS అర్ధమాన్ తోపాటు మరో అణు జలాంతర్గామిని కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 125 మీటర్ల పొడవు, 7వేల టన్నుల బరువుతో ఈ రెండింటిని తయారు చేస్తున్నారు. వీటిల్లో మొదటి రెండు సబ్ మెరైన్ల కంటే అధికంగా K-4 క్షిపణులను తీసుకెళ్లగలదు. 1990లో రహస్యంగా ప్రారంభించిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ వెస్సల్ (ATV) ప్రాజెక్టులో భాగంగా ఈ నాలుగు జలాంతర్గాములను నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.90,000 కోట్లకు పైగా ఉంది. అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాముల కంటే ఇవి చిన్నవి. చైనా వాడే 6 జిన్ శ్రేణి జలాంతర్గాముల్లో JL-3 క్షిపణులను అమర్చారు. ఇవి 10వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి.
భారతీయుల్లో ఐరన్, కాల్షియం, ఫోలేట్ లోపం
భారతీయులలో ఐరన్, కాల్షియం, పోలేట్ తో పాటు కొన్ని కీలక సూక్ష్మపోషకాల లోపం ఉందని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించిన ఓ స్టడీ తెలిపింది. దేశంలో అన్ని వయసుల వారిలోనూ ఈ ధోరణి కనిపిస్తోందని తెలిపింది. ఆరోగ్యానికి ఎంతో కీలకమైన ఈ మూడు లోపిస్తున్నట్టు తెలిపింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులతో పాటు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. ‘గ్లోబల్ డైటరీ డేటాబేస్’ నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రపంచ జనాభాలో 99.3 శాతం మందిలో పోషకాహార లోపాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సప్లిమెంట్ల రూపంలో కాకుండా ఆహారం ద్వారా 185 దేశాల్లోని ప్రజలు 15 కీలక సూక్ష్మపోషకాలను ఏ స్థాయిలో తీసుకుంటున్నారని పరిశీలించారు.
* ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది అయోడిన్, విటమిన్ ఇ, కాల్షియాన్ని సరిపడినంత తీసుకోవట్లేదు.
* మగవాళ్ళతో పోలిస్తే మహిళల్లో అయోడిన్, విటమిన్ B12, ఐరన్ లోపం ఎక్కువగా ఉంది. మరోవైపు మగవాళ్ళల్లో మెగ్నీషియం, విటమిన్ B6, జింక్, విటమిన్ C లోపం అధికంగా ఉంది.
* భారత దేశంలో మగవాళ్ళతో పోలిస్తే మహిళలు అయోడిన్ తక్కువగా తీసుకుంటున్నారు. అందుకే మగవాళ్ళల్లో జింక్, మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంది.
2035 నాటికి అమ్ములపొదిలో 5.5 తరం స్టెల్త్ ఫైటర్!
భారత్ సరికొత్త యుద్ధ విమానాలను రెడీ చేస్తోంది. వైమానిక దళంలో అతికొద్ది దేశాల దగ్గరున్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’ (DRDO) అభివృద్ధి చేయనుంది. 5.5 తరం స్టెల్త్ ఫైటర్ నమూనాను Aviation Expo ఐడాక్స్ 2024లో DRDO ప్రదర్శించింది. 2035 లో ఇవి భారత వైమానికదళంలో చేరగి. ఈ విమానాలు రెడీ అయితే, స్టెల్త్ ఫైటర్ల టెక్నాలజీ కలిగిన అతి కొద్ది దేశాల్లో భారత్ కు డా ఒకటి అవుతుంది. తమిళనాడులోని సూలూరులో జరిగిన Expoలో ఫైటర్ జెట్ నమూనాను DRDO ప్రదర్శించింది. 27 టన్నుల బరువు ఉండే ఈ AMCA విమానాలకు క్షిపణులు సహా భారీ ఆయుధ సామగ్రిని మోయగల సామర్థ్యం ఉంటుంది. అభివృద్ధి దశలో ఉన్న ఈ AMCA 2034 నాటికి ట్రయల్స్ పూర్తి చేసుకుంటుందని DRDO చైర్మన్ సమీర్ వి కామత్ చెప్పారు.
సాక్షి మాలిక్ ఆత్మకథ ‘విట్నెస్’
భారత అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకరైన సాక్షి మలిక్ ఆత్మకథ పుస్తక రూపంలో రాబోతుంది. ‘విట్నెస్’ పేరుతో ఉన్న ఈ పుస్తకాన్ని అక్టోబర్ లో ఆవిష్కరించబోతున్నారు. సాక్షితో పాటు ఈ పుస్తకానికి సహ రచయితగా జొనాథన్ సెల్వరాజ్ వ్యవహరించారు. ఈ బుక్ లో సాక్షి చిన్నతనం, రెజ్లింగ్ లోకి ఎలా ప్రవేశించింది… రియో ఒలింపిక్స్ లో కాంస్యం గెలవడం, ఆ తర్వాత ఎదుర్కొన్న సవాళ్లు, గాయాలు, చివరగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై పోరాటం లాంటి వివరాలన్నీ ఈ విట్నెస్ బుక్ లో ఉండబోతున్నాయి. ఈ పుస్తకం నా జీవితంలోని ఎత్తుపల్లాలు, విజయాలు.. ఇలా అన్ని వాస్తవ విషయాలను వివరించాను. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా అని సాక్షి తెలిపింది. ఒలింపిక్స్ లో (2016 రియో) పతకం గెలిచిన ఏకైక భారత మహిళా రెజ్లర్ ఉన్నారు సాక్షి. 2023 డిసెంబర్ లో ఆమె ఆటకు గుడ్ బై చెప్పారు.
కాలుష్యంపై పోరుకు రూ.2,500 కోట్ల నౌక
సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణకేంద్రం (GSL) నిర్మించిన ప్రత్యేక నౌక ‘సముద్ర ప్రతాప్ ‘ను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ 29 ఆగస్టు నాడు భారత తీరగస్తే దళానికి (Indian Coastguards) కి అప్పగించారు. ఇందులో 72% పనిని ఆత్మనిర్భర్ కింద దేశీయంగానే పూర్తి చేసినట్లు తెలిపారు. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, చమురు వ్యర్ధాలను నిర్మూలించి జల చరాలను కాపాడేందుకు ఉపయోగపడే లేటెస్ట్ టెక్నాలజీ ఈ సముద్ర ప్రతాప్ నౌకలో ఉంది.