TGPSC GROUP. 1 MAINS : గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందా ? తెలుగు అకాడమీ బుక్స్ వేస్టా ?

TGPSC GROUP. 1 MAINS : గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందా ?  తెలుగు అకాడమీ బుక్స్ వేస్టా ?

TGPSC గ్రూప్ 1 కి గండాలు కొనసాగుతున్నాయి.  గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.  హైకోర్టులో  దాఖలైన పిటిషన్లపై గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. ఇవాళ పూర్తయ్యాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది.

కోర్టులో అసలు ఎలాంటి వాదనలు జరిగాయి… తెలుగు అకాడమీ పుస్తకాలు వేస్ట్ అని TGPSC ఎందుకు కోర్టుకు చెప్పింది… సబ్జెక్టులపై ఎంతో ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్లు రాసిన అకాడమీ బుక్స్ ఇజ్జత్ తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది… ఈ  Article లో డిస్కస్ చేస్తాను.  మన Telangana Exams you tube channel ను  subscribe చేసుకోండి…

BRS సర్కార్ హయాంలో పేపర్ లీక్స్ కారణంగా… గ్రూప్ 1 రద్దయింది…సరే… రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక… పాత నోటిఫికేషన్ రద్దు చేసి… ఏవో కొన్ని పోస్టులు కలిపి… కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 జూన్ 9న మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం TGPSC ప్రిలిమ్స్ నిర్వహించింది…జూన్ 13న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసింది… గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కీపై అభ్యంతరాలు రావడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.  పరీక్షలు రాసిన దాదాపు 3లక్షల మంది నుంచి ప్రిలిమ్స్‌ కీపై ఫిజికల్ గా 721 అభ్యంతరాలు… అలాగే ఆన్‌లైన్ ద్వారా 6 వేల 470 అబ్జెక్షన్స్ వచ్చాయి. TGPSC తరఫు న్యాయవాదే ఈ విషయం కోర్టుకు తెలిపారు. సరే…ఈ అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించినట్టు… అందులో మెయిన్ అబ్జెక్షన్ ని పరిగణనలోకి తీసుకుని కమిటీ సిపారసులతో కేవలం రెండు ప్రశ్నలు తొలగించి కీని రిలీజ్ చేసింది TGPSC. 150 మార్కుల ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం TGPSC కి రావడం లేదా… అన్నది ఇక్కడ అభ్యర్థుల ప్రశ్న. అయితే కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఏమన్నారంటే… గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 68, 79, 106, 112 ప్రశ్నలకు సమాధానాలపై అభ్యంతరం చెప్పారు… అంటే TGPSC ఇచ్చిన ఫైనల్ కీలో… రెండు కాదు… నాలుగు ప్రశ్నలకు తప్పులు ఉన్నాయని అభ్యంతరం చెప్పారు. అందుకోసం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ ని రిఫరెన్స్ గా పేర్కొన్నారు.

తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన… తెలంగాణ హిస్టరీ – కల్చర్ 2016, అలాగే తెలంగాణ రీజినల్ జాగ్రఫీ పుస్తకాలను రిఫరెన్స్ గా ఇచ్చారు అభ్యర్థులు…ఇక్కడే TGPSC ఛైర్మన్, అధికారులు… ఎవరైనా సరే… తమను తామను సమర్థించుకోడానికి… తెలుగు అకాడమీని వేస్ట్ సంస్థగా ముద్రవేశారు. తెలుగు అకాడమీ పుస్తకాల్లో పసలేదు… వాటిని ప్రామాణికంగా తీసుకోలేము…  అవి రన్నింగ్ నోట్సులాగా ఉన్నాయి… పైగా ఇంకా దారుణమైన మాట ఏంటంటే… ప్రొఫెసర్లు ఎలాంటి రీసెర్చ్ చేయకుండా రాశారు… అంటూ దారుణంగా హైకోర్టులో TGPSC అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు…

ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి దాకా మన అభ్యర్థులంతా తెలుగు అకాడమీనే నమ్ముకొని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు.  ప్రతి యేటా అకడమిక్ విద్యార్థులతో పాటు…TGPSC, ఇతర స్టేట్ లెవల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా… తెలుగు అకాడమీ నుంచి స్పెషల్ బుక్స్ ప్రింట్ చేస్తున్నారు…  పైగా అక్కడ నిష్ణాతులైన ప్రొఫెసర్లు ఉన్నారు. అలాగే అంబేద్కర్ అకాడమీ నుంచి నాలుగైదు పుస్తకాలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలీజ్ అయ్యాయి… అవి కూడా TSPSC మాజీ ఛైర్మన్ చక్రపాణి గారి ఆధ్వర్యంలోనే….అలాంటి తెలుగు అకాడమీ బుక్స్ ని వేస్ట్ మెటీరియల్ గా TGPSC డిక్లేర్ చేసింది… ఎంత దారుణం.  ఉస్మానియా, కాకతీయ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లనే తప్పుబట్టింది… పైగా ఆ పుస్తకాలు… డిగ్రీ, పీజీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలుగా లేవు… ప్రామాణిక పుస్తకాలు కావని తేల్చేసింది. TGPSC నియంతృత్వ వైఖరి అవలంభిస్తోంది అంటూ… ఇవాళ కొంతమంది నిరుద్యోగులు… TGPSC గోడల మీద పోస్టర్లు అంటించారు… అంతేకాదు… తెలుగు అకాడమీ పుస్తకాలు కొనొద్దు… అవి వేస్ట్ అని TGPSC చెబుతోందని… హైదరాబాద్ లో అకాడమీ బుక్స్ అమ్మే స్టాల్స్ దగ్గర కూడా పోస్టర్లు అంటించారు. పిటిషన్ వేసిన అభ్యర్థులు మొత్తమ్మీద 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చారనీ… వాటిని తొలగించి… లేటెస్గ్ గా మళ్ళీ కీ రిలీజ్ చేసి… ఫ్రెష్ గా అభ్యర్థుల లిస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

563 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. జనరల్‌ పోస్టులు 200, EWS 49, బీసీ(ఏ) 44, బీసీ (బీ)37, బీసీ(సీ) 13, బీసీ(డీ) 22, బీసీ(ఈ) 16, ఎస్సీ 93, ఎస్టీ 52, క్రీడాకారులు 4, దివ్యాంగులు 24 పోస్టులు చొప్పున ఉన్నాయి. అన్ని క్యాటగిరీలకు 1:50 నిష్పత్తి ఎంపికలో సర్వీస్‌ కమిషన్‌ విఫలమైందని, రిజర్వేషన్‌ క్యాటగిరీ అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని కూడా కోర్టులో పిటిషన్లు ఫైల్ అయ్యాయి.

ఇప్పుడు ఇంకా 17 రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి.  TGPSC అడ్డదిడ్డమైన వాదనలతో… ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయా… లేదా అని అభ్యర్థులు టెన్షన్ లో ఉన్నారు.  గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు తీర్పు హోల్డ్ చేయడంతో మెయిన్స్ రాసే అభ్యర్థుల్లో ఆ టెన్షన్ మరింత పెరిగిపోయింది.  మెయిన్స్ ఎగ్జామ్ ని దృష్టిలో పెట్టుకునే…  హైకోర్టు కూడా రెండు వర్గాల వాదనలు వినుకుంటూ వచ్చింది… ప్రస్తుతం రిజర్వులో ఉంది కాబట్టి… నెక్ట్స్ వీక్ లో తీర్పు వెల్లడించే ఛాన్సుంది… మరి TGPSC మెయిన్స్ ఎగ్జామ్స్ ని అందాక వాయిదా వేస్తుందా… వేయాల్సిందే … లేకపోతే… అభ్యర్థులు టెన్షన్ లో ఏమీ చదవలేకపోతున్నారు… పైగా తెలుగు అకాడమీ బుక్స్ వేస్ట్ అని చెప్పింది కాబట్టి… ఇప్పుడు కొత్త పుస్తకాలు వెతుక్కోవాలా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!