Group.1 Mains: వాయిదాకి అభ్యర్థుల నాలుగు డిమాండ్స్ ఇవే !

Group.1 Mains: వాయిదాకి అభ్యర్థుల నాలుగు డిమాండ్స్ ఇవే !

TGPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ జరుగుతోంది. గత BRS హయాంలో 3 సార్లు పేపర్లు లీక్స్ తో ప్రిలిమ్స్ రద్దు అవడంతో అభ్యర్థులు విసుగెత్తిపోయారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక…గతంలో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి మరికొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడైనా గ్రూప్ 1 ఎగ్జామ్ సజావుగా సాగుతుంది. రిక్రూట్ మెంట్ పూర్తయితే జిల్లా స్థాయిలో గ్రూప్ 1 అధికారులుగా స్థిరపడవచ్చని చాలా మంది అభ్యర్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ జీవో 29, ప్రిలిమ్స్ ఫైనల్ కీలో తప్పులు లాంటి వివాదాలతో కోర్టుల్లో కేసులు నడిచాయి. అసలు నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్న ప్రధానమైన 4 డిమాండ్స్ ఏంటో చూద్దాం.

1) తెలుగు అకాడమీ మెటీరియల్ వేస్ట్ ? మరి ఏవి బెస్ట్ ?

గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా 10 రోజులు ఉందన్న టైమ్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ తో నిరుద్యోగ అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి దాకా TGPSC, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తెలుగు అకాడమీ పుస్తకాలపైనే అభ్యర్థులు ఆధారపడుతున్నారు. అవే ప్రామాణికం అని నమ్ముతున్నారు. ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ, ఉద్యమం, జాగ్రఫీ లాంటి పుస్తకాలు ఫుల్ డిమాండ్ ఉంది. కానీ హైకోర్టు్కు TGPSC సమర్పించిన అఫిడవిట్ లో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు… ఎలాంటి రీసెర్చ్ లేకుండా పబ్లిష్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది. Group.1 Prelims ఫైనల్ కీలో తప్పులను ఎత్తి చూపిన పిటిషనర్లు, అందుకు సరైన జవాబులును తెలుగు అకాడమీ పుస్తకాలను రిఫర్ చేశారు. దాంతో TGPSC అధికారులు తెలుగు అకాడమీ పుస్తకాలపై తప్పుడు ఆరోపణలు చేయడంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు.

2) న్యాయ వివాదాలు

గ్రూప్ 1 ఉద్యోగాల్లో జీవో నెంబర్. 29 ని అమలు చేయడంతో రిజర్వేషన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ జీవో వల్ల గతంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆ తర్వాత అనర్హులు అయ్యారు. రిక్రూట్ మెంట్ మధ్యలో ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో భయం నెలకొంది. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కోర్టు తుది తీర్పు 2024 నవంబర్ 20 నాడు ఇవ్వనుంది. గ్రూప్ 1 ఫలితాలను ఆ తుది తీర్పునకు లోబడి విడుదల చేయాలని ఆదేశించింది. దాంతో ఒకవేళ కోర్టు తీర్పు GO 29కి వ్యతిరేకంగా వస్తే మళ్ళీ ఎగ్జామ్స్ రద్దయ్యే ఛాన్స్ ఉందని అభ్యర్థులు భయపడుతున్నారు. 2011లో జరిగినట్టే మళ్ళీ గ్రూప్ 1 కి గండం పొంచి ఉందని అంటున్నారు. జీవో 29 రద్దు సంగతి తేల్చకుండా గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

3) రిజర్వేషన్ హక్కులను కాలరాస్తారా

జీవో 29 ని అమలు చేయడం వల్ల ఆర్టికల్స్ 15, 16 ప్రకారం తమకు ఉన్న హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లుతోందని మండిపడుతున్నారు. గతంలో జీవో 55 ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ కి క్వాలిఫై అయిన SC, ST, BC, EWS అభ్యర్థులు… ఈ జీవో 29 కారణంగా అనర్హులు అయ్యారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అంటున్నారు.

4) అభ్యర్థుల్లో ఒత్తిడి, మానసిక ఆందోళన

గ్రూప్ 1 ఎగ్జామ్స్ పైూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలతో చాలామంది అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. మానసికంగా చాలా ఆందోళన పడుతున్నారు. దాంతో మొన్న మొన్నటిదాకా సిన్సియర్ గా ప్రిపేర్ అయి, గ్యారంటీ జాబ్ కొడతామన్న విశ్వాసంతో ఉన్న అభ్యర్థులు నీరుగారిపోయారు. ఓ వైపు అభ్యర్థుల ధర్నాల, మరోవైపు కోర్టుల్లో కేసులో, ఇంకో వైపు తెలుగు అకాడమీ బుక్స్ వేస్ట్ అంటూ TGPSC ప్రకటనలతో టెన్షన్ వాతావరణం కనిపించింది. విద్యార్థుల ఆందోళనల విషయంలోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హాస్టళ్ళ నుంచి కొందరు అభ్యర్థులను బలవంతంగా లాక్కొని వెళ్ళినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. ఆడవాళ్ళను కూడా రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్ళారని అంటున్నారు. తమ తల్లిదండ్రులతో అశోక్ నగర్ లో టీ తాగుతున్న ఓ అభ్యర్థి, ఆమె కుటుంబంపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

ఇన్ని ఒత్తిడుల మధ్య గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రాయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.

BREAKING : గ్రూప్ 1 మెయిన్స్ పై ప్రభుత్వ ప్రకటన

నిరుద్యోగుల 8 డిమాండ్స్

1) జీవో 29ని రద్దు చేయాలి

2) గ్రూప్ 1 మెయిన్స్ రీ షెడ్యూల్ చేయాలి

3) ప్రిలిమ్స్ ఫలితాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి

4) అభ్యర్థుల ప్రిలిమ్స్ మార్కులను TGPSC వెల్లడించాలి

5) తెలుగు అకాడమీ వేస్ట్ అన్నారు. మరి ప్రామాణిక పుస్తకాలు ఏంటో చెప్పాలి

6) కోర్టు కేసులు క్లియర్ చేసి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పోస్టులను భర్తీ చేయాలి

7) గ్రూప్ 1 లో పోస్టుల సంఖ్య పెంచాలి

8) హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో కూడా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!