GROUP.3 Exam మీ టార్గెట్టా ? పక్కాగా ఈ ప్లాన్ ఫాలో అవ్వండి !!

GROUP.3 Exam మీ టార్గెట్టా ? పక్కాగా ఈ ప్లాన్ ఫాలో అవ్వండి !!

మీరు ఈ ఏడాదిలో కొత్త కొలువు కోసం ప్రయత్నిస్తున్నారా ?  నవంబర్ లో జరిగే గ్రూప్ 3 లో ఎలాగైనా విజయం సాధించాలి అని మీరు అనుకుంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి… గ్రూప్ 3 కి సంబంధించిన వీడియోలను కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నాం… వాటిని కూడా చూడండి… మీకు క్లిస్టల్ క్లారిటీ వస్తుంది… All the best 

తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ నవంబర్ 17,18 తేదీల్లో జరగబోతున్నాయి. చాలామంది గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 3 కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే కేవలం గ్రూప్ 3 కే ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి ఈ ఆర్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చదవడంతో పాటు దీన్ని మీ ఫ్రెండ్స్ కి ఫార్వార్డ్ చేయండి… అలాగే ఈ కింద ఇచ్చిన వీడియో పూర్తిగా చూడండి.

గ్రూప్ 3 కి మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకునేవారు…. ఒకసారి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో బ్రీఫ్ గా చూద్దాం. గ్రూప్ 3 లో మొత్తం 3 పేపర్లు ఉంటాయి.

అందులో ఒకటి జనరల్ స్టడీస్ 150 మార్కులు

రెండోది… హిస్టరీ, పాలిటీ, సొసైటీ కలిపి… 150 మార్కులు

మూడో పేపర్ ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ … దీనికి 150 మార్కులు ఉంటాయి.

మొత్తం 450 మార్కులు

Only Group.3 టార్గెట్ గా పెట్టుకుంటే మాత్రం… మీ ఫస్ట్ ప్రియారిటీ థర్డ్ పేపర్ కి కేటాయించండి. ఇది ముందుగా కంప్లీట్ చేయండి… ఎకనామీ నుంచి 150 ప్రశ్నలు ఉన్నాయి… మిగతా పేపర్లు చూస్తే… ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ లో 11 అంశాలకు 150 మార్కులు ఉన్నాయి. అలాగే సెకండ్ పేపర్ లో మూడు సబ్జెక్టులకు కలిటిపి 150 మార్కులు ఉన్నాయి. కానీ థర్డ్ పేపర్ ఎకానమీ ఒక్కటే 150 మార్కులు… సో దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి….మీరు ఎకానమీ మీద దృష్టి పెట్టాలి… ఇందులో ఎక్కువ స్కోరింగ్ కి ప్రయత్నించాలి… అప్పుడే మీరు ఉద్యోగం డెఫినెట్ గా పొందగలుగుతారు.

ఎకానమీలో కరెంట్ ఈవెంట్స్, కరెంట్ ఫిగర్స్, బడ్జెట్ … అంటే ప్రస్తుత అంశాలకే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది… వీటి నుంచే దాదాపు 60 నుంచి 70 శాతం ప్రశ్నలు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లు, ఎకనమిక్ సర్వే అంశాలు… లేటెస్ట్ ఎకానమీ ఇష్యూస్, గవర్నమెంట్ సర్వే రిపోర్టులు… అప్ డేటేడ్ గా ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వరల్డ్ ఎకనామీ దృష్ట్యా భారత్ స్థానం… సర్వేలు.. ఇండెక్సుల్లో భారత్ ఏ స్థానాల్లో ఉంది… నీతి ఆయోగ్… లాంటి వాటికి ప్రియారిటీ ఇవ్వాలి. ఎకానమీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే…. మీరు ఈ సబ్జెక్టును కూడా ప్రతి రోజూ చదవాలి. అందుకోసం నోట్స్ రాసుకోవాలి. ఎకానమీని రోజువారీగా ప్రిపేర్ అయితేనే… కంటిన్యూటీ ఉంటేనే… మీకు అర్థమవుతుంది. దాని మీద పూర్తిగా పట్టు వస్తుంది. సబ్జెక్ట్ హార్డ్ అని వదిలేస్తే… ఎక్కువ రోజులు చదవకుండా గ్యాప్ ఇస్తే… మళ్ళీ మొదటి నుంచి ప్రిపరేషన్ అవ్వాల్సి వస్తుంది. కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి రోజూ టైమ్ కేటాయించుకోండి.

మేం GROUP.2 EXCELLENCE కోర్సుతో పాటు గ్రూప్ 3 Power pack series లో కూడా కరెంట్ ఎకనామికల్ ఇష్యూస్… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు, ఎకనామికల్ సర్వేలు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు… వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. వీటికి సంబంధించిన మెటీరియల్ పాయింట్స్… టెస్టులు యాప్ లో కోర్సులో చేరిన వారికి UPDATE చేస్తుంటాం. ప్రతి వారంలో సోమవారం నాడు ఇచ్చే కొత్త టెస్టుల్లో కూడా ఎకానమీ అంశాలు మస్ట్ గా ఉంటాయి.

సెకండ్ ప్రియారిటీ… గ్రూప్ 3 లో సెకండ్ పేపర్ సెకండ్ టాపిక్ పాలిటీ కి ఇవ్వాలి… actual గా సిలబస్ ప్రకారం పాలిటీ నుంచి 50 మార్కులకే ప్రశ్నలు రావాలి… కానీ దానికి ఉన్న ప్రియారిటీని బట్టి… సెకండ్ పేపర్ మొత్తం 150 మార్కుల్లో పాలిటీలో 70 నుంచి 80 ప్రశ్నలు వచ్చే ఛాన్సుండి. అంటే సగం మార్కులు పాలిటీకే ఉంటాయి. అందుకే గ్రూప్ 3 కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు.. ఎకానమీ తర్వాత పాలిటీకి ప్రాధాన్యత ఇవ్వండి. మీ డైలీ టైమ్ టేబుల్ లో పాలిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి.

గ్రూప్ 3లోనే గ్రూప్ 4 కూడా కలిసింది… గుర్తుంచుకోండి… గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ స్ట్రాటజీని తప్పకుండా ఫాలో అవ్వండి. గ్రూప్ 3 లో మొదట ఎకానమీ, రెండు పాలిటీ అయ్యాక… మూడో ప్రాధాన్యత తెలంగాణ అంశాలు…. తెలంగాణ మూవ్ మెంట్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ కల్చర్ … ఈ మూడింటినీ ప్రిపేర్ అవ్వండి.

Read this Article : గ్రూప్ 3 హాల్ టిక్కెట్స్ రెడీ : 20 రోజుల్లో రివిజన్ ఎలా ?

పేపర్ 1 జనరల్ స్టడీలో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అంటే…

1) రీజనింగ్ – 25 ప్రశ్నల దాకా

2) ఇంగ్లీష్ – 20 ప్రశ్నలు

3) తెలంగాణ కల్చర్ -15 ప్రశ్నలు

4) కరెంట్ ఎఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ – 30 ప్రశ్నలు

5) జాగ్రఫీ, డిజాస్టర్, ఎన్విరాన్ మెంటల్ ఇష్యూస్ – 25 ప్రశ్నలు

6) సైన్స్ అండ్ టెక్నాలజీ : 15 ప్రశ్నలు

పేపర్ 1 జనరల్ స్టడీస్ లో ఈ అంశాలపై తప్పకుండా ఫోకస్ పెట్టాలి… అలా చేయకపోతే… మీకు మార్కులు బాగా తగ్గిపోతాయి… గ్రూప్ 2 లో ఉన్నట్టే… గ్రూప్ 3 ఫస్ట్ పేపర్ లో కూడా 11 అంశాలు ఉన్నాయి కదా… వీటిల్లో తెలంగాణ సంస్కృతి అంశాలను బగా ప్రిపేర్ అయితే 20 మార్కులు మీరు సాధించినట్టే… దీంతో పాటు… రీజనింగ్ అండ్ ఇంగ్లీష్.. ఈ రెండు ఏరియాల నుంచి దాదాపు 50 ప్రశ్నలు వస్తాయి… వీటిని రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మ్యాథ్స్ వాళ్ళు… నాన్ మ్యాథ్స్ వాళ్ళు … ఎవరైనా సరే… డైలీ ప్రాక్టీస్ ఉండాలి.

ఈ రెండింటి తర్వాత

గ్రూప్ 3 జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ లో మీ ప్రియారిటీ …కరెంట్ ఎఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్… మీద ఉండాలి. ఈ రెండింటి నుంచి దాదాపు 35 నుంచి 40 మార్కుల దాకా వస్తాయి.
అంటే గ్రూప్ 3 లో పేపర్ 1 జనరల్ స్టడీస్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది

1) రీజనింగ్

2) ఇంగ్లీష్

3) తెలంగాణ కల్చర్

4) కరెంట్ ఎఫైర్స్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్

5) సైన్స్ అండ్ టెక్నాలజీ

6)జాగ్రఫీ, డిజాస్టర్, ఎన్విరాన్ మెంటల్ ఇష్యూస్ కూడా చదవండి…

గ్రూప్ 3కి మాత్రం మీ ఫస్ట్ ప్రియారిటీ పేపర్ 3 ఎకానమిక్స్ మీద ఉండాలి. అలాగే సెకండ్ ప్రాధాన్యత పాలిటీ మీద ఉండాలి… ఆ తర్వాత ఫస్ట్ పేపర్ లోని 11 అంశాల్లో ఆరింటి మీద మీ ఫోకస్ ఉండాలి.

Telangana Exams plus app లో కోర్సులు నడుస్తున్నాయి. ఎవరైనా ఉంటే ఇంకా జాయిన్ అవ్వకపోతే అవ్వండి. లింక్ కింద ఉంది.

🎯TGPSC Group 2 కోర్సులో జాయిన్ కి లింక్ : https://atvqp.on-app.in/app/oc/447150/atvqp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

🎯 🎯 Join this Telegram group for more Jobs, Exams notifications, Results updates of Central & APPSC, TGPSC etc Updates: https://t.me/group1aspirants_ExamsCentre🎯

 

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!