Power Grid Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

Power Grid Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గురుగ్రామ్‌లోని కంపెనీలో 70 ట్రైనీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టులు ఏంటి ?

70 ట్రైనీ సూపర్ వైజర్ పోస్టులు
General -30, EWS: 07, OBC 18, SC-10, ST-05 లకు పోస్టులు
మొత్తం ఖాళీల్లో దివ్యాంగులకు 3 పోస్టులు, Ex-Servicemen : 10 పోస్టులు

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా equivalent educational qualifications
టెక్నికల్ బోర్డ్ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
డిప్లొమాతో B.Tech., లేదా M.Tech.,BE, ME కలిగి ఉండాలి.
డిప్లొమాలో జనరల్, OBC(NCL), EWS అభ్యర్థులకు కనీసం 70 శాతం మార్కులు ఉండాలి.
SC/ST/PWD అభ్యర్థులు పాస్ అయితే చాలు.

వయో పరిమితి:

2024 నవంబర్ 6 నాటికి 27 యేళ్ళకు మించరాదు.
రిజర్వుడ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంది.

అప్లికేషన్ ఫీజు ఎంత ?

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి.
SC/ST/PWD/Ex Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

చివరి తేది: 

నవంబర్ 6లోగా దరఖాస్తులు సమర్పించాలి.

ఎలా ఎంపిక చేస్తారు ?

ట్రైనీ సూపర్ వైజర్ పోస్టులకు రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

శాలరీ ఎంత ?

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,000 సాలరీ

ఎగ్జామ్ ఎప్పుడు ?

ఎగ్జామ్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటిస్తారు.

పరీక్ష విధానం :

మొత్తం 170 మార్కులకు Written Test. Objective type లో 170 ప్రశ్నలు
పార్ట్-1లో 120 మార్కులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్,
పార్ట్-2లో 50 మార్కులకు ఆప్టిట్యూడ్ టెస్ట్
ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్. ప్రతి రాంగ్ ఆన్సర్ కు 0.25 మార్కులు నెగిటివ్ మార్కులు ఉంటాయి.

ఎగ్జామ్ సెంటర్స్ :

నాగ్‌పూర్, భోపాల్‌, బెంగళూరు, చెన్నై

పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ చూడండిTrainee-Sup-Detail-Advt-CC-09-2024-dtd-16102024

వెబ్ సైట్ లింక్ : https://www.powergrid.in/en/job-opportunities

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!