2025 Telangana Jobs : కొత్త ఏడాది… కొత్త కొలువు ! 2025 కి ప్లాన్ చేద్దామా ?

2025 Telangana Jobs : కొత్త ఏడాది… కొత్త కొలువు ! 2025 కి ప్లాన్ చేద్దామా ?

తెలంగాణలో ఈ ఇయర్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. గ్రూప్ 3 నవంబర్, గ్రూప్ 2 డిసెంబర్ లో జరుగుతోంది. ఒక్కో ఎగ్జామ్ కి 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఇయర్ లో జాబ్ కేలండర్ సక్రమంగా అమలు చేస్తే… ఈ అక్టోబర్ లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇంకా విద్యుత్ సంస్థల్లో లైన్ మెన్స్, AE పోస్టలుకు నోటిషికేషన్లు రావాలి. ఆర్టీసీలో కూడా జాబ్స్ కి నోటిఫికేషన్ పడే ఛాన్సుంది.

కానీ SC రిజర్వేషన్ వల్ల జాబ్ కేలండర్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఏడాదిలో కొత్త నోటిఫికేషన్లకు ఛాన్స్ లేదని అంటున్నారు. మరి నెక్ట్స్ ఇయర్ లో ఎప్పుడు పడతాయి అంటే… SC రిజర్వేషన్లపై కమిటీ నివేదిక ఇవ్వడానికి రెండు నెలల టైమ్ పడుతుంది. దాన్ని వివిధ ప్రభుత్వం ఆమోదించాక… వివిధశాఖలు పరిశీలించి… తమ డిపార్ట్ మెంట్ లో ఖాళీలు గుర్తించి… ఆయా రిజర్వేషన్లలో మార్పులు చేర్పు చేయాలి… ఆ తర్వాత TGPSC లేదా ఇతర నియామక సంస్థలకు ఆ జాబితా ఇవ్వాలి. అంటే… 2025 లో దాదాపు మార్చి నెల తర్వాతే కొత్త నోటిషికేషన్లకు ఛాన్సుంది. అప్పటి నుంచి మళ్ళీ జాబ్ కేలండర్ ఇచ్చి అమలు చేస్తే… మీకు ఏప్రిల్, మే నెలల నుంచి కొత్త కొలువులకు అప్లయ్ చేయడం… ఎగ్జామ్స్ రాయడం లాంటివి మొదలయ్యే ఛాన్సుంది. ఒక వేళ … ముందు నోటిఫికేషన్లు వేసి… తర్వాత రిజర్వేషన్ల సంగతి తేల్చవచ్చు అంటే జనవరి తర్వాత నోటిఫికేషన్లు పడే ఛాన్సుంది.

నోటిఫికేషన్లు ఆలస్యం అయితే… మాత్రం…ఇప్పటి నుంచి ఎంత టైమ్ ఉంది… అక్టోబర్ ఎండ్ కి వచ్చాం… ఈ నెల తీసేస్తే… నవంబర్, డిసెంబర్, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా… అంటే 5 నుంచి 6 నెలల దాకా టైమ్ ఉంది కొత్త నోటిఫికేషన్ల సండది మొదలవ్వడానికి. మరి అప్పటిదాకా మీరు ఏం చేస్తారు ?

ఈ ఐదారు నెలల టైమ్ గ్యాప్ ను మీరు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి… అందుకోసం నేను 10 టిప్స్ చెబుతాను. ఫాలో అవ్వండి.
ఇప్పటికీ ఇంకా TGPSC ఒక్క ఎగ్జామ్ రాయనివారు… కొత్తగా రాస్తున్న వారు… అలాగే డిగ్రీ ఫైనలియర్ లో ఉండి… నెక్ట్స్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళకి…పాత వాళ్ళకి కూడా ఈ టెన్ టిప్స్ యూజ్ అవుతాయి.

మీరు Central/AP/Telanganaలో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా ? రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ? ఈ లింక్ ను ఫాలో అవ్వండి.
https://examscentre247.com/telugu/jobs-recruitment/

నెంబర్ 1 Understand the exam patterns & Syllabus
ఎగ్జామ్స్ ప్యాటర్న్, సిలబస్ అర్థం చేసుకోండి

TGPSC కింద గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడతాయి. గ్రూప్ 4 కేడర్ కి ఎగ్జామ్ కూడా గ్రూప్ 3లోనే కలుపుతున్నారు. సో గ్రూప్ 4 లేదు. అలాగే… విలేజ్ లెవల్లో భర్తీ చేసే VRO లేదా JRO పోస్టులు… ఉంటాయి. ఇవి కాకుండా పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ సబ్ ఇన్సెపెక్టర్స్… ఇంకా టెక్నికల్, అగ్రికల్చరల్ పోస్టులు ఉంటాయి..ఇలా వివిధ కేటగిరీలకు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. అందుకే మీరు ఏ ఎగ్జామ్ ని లక్ష్యంగా పెట్టుకుంటున్నారో ముందు డిసైడ్ అవ్వండి. గ్రూప్ 1 … 2…3… లేదా పోలీస్ ఉద్యోగాల… వీటిల్లో ఏదో డిసైడ్ అయ్యాక… అప్పుడు ఆయా ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. ఎన్ని పేపర్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని మార్కులకు… ఏ సిలబస్ ఉందో చూడండి… మొత్తం సిలబస్ ను సబ్జెక్టుల వారీగా… టాపిక్స్ వారీగా… హైస్కోర్ ఇచ్చే ఏరియాల వారీగా డివైడ్ చేసుకోండి… పూర్తిగా సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోండి.
మన examscentre 247.com లో వివరంగా అప్ డేట్ చేస్తున్నాం… ఇస్తున్నాం. నాలుగైదు రోజుల్లో ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది… వీడియోలతో సహా ఇస్తాం. ఫాలో అవ్వండి. అంటే బేసిక్ అవగాహన లేకుండా దిగవద్దు.
ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసి ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నవాళ్ళు సరే.. ఇంకా tgpsc ఒక్క ఎగ్జామ్ కూడా రాయనివాళ్ళు, ఇప్పుడు డిగ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే… వీడియో లింక్ వాళ్ళకి ఫార్వార్డ్ చేయండి.

నెంబర్ 2 : Create a Time Table
టైమ్ టేబుల్ లేదా స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి

మీకు సిలబస్ లో టాపిక్స్ మీద పూర్తిగా అవగాహన వచ్చాక… టైమ్ టేబుల్ లేదా స్టడీ ప్లాన్ రెడీ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సిలబస్ మీద అవగాహన రాలేదు అంటే… దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది… ఏ ఎగ్జామ్ కి ఆ ఎగ్జామ్ లో ఉండే సిలబస్ ఏంటి… ఎంత డెప్త్ వరకూ ఉంటుంది లాంటి విషయాలపై… ప్రత్యేక ఆర్టికల్స్ examscentre247.com లో ఇస్తుంటాను. ఆ website ఫాలో అవ్వండి.
సిలబస్ తో పాటు టాపిక్స్ మీద అవగాహన వచ్చాక… వాటిని 5 లేదా 6 కాలానికి విభజించుకొని… ప్రతిరోజూ… ఏ గంటలో ఏమేమి చదవాలి… మీ సొంతంగా స్టడీ ప్లాన్ వేసుకోండి… అన్ని సబ్జెక్టులు ప్రతి రోజూ కవర్ అయ్యలాగా మీ ప్లానింగ్ ఉండాలి. మీకు హార్డ్ అనుకున్న ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ – రీజనింగ్ కి కాస్త ఎక్కువ టైమ్ కేటాయించుకోండి… కానీ అన్ని సబ్జెక్టులను కూడా ప్రతి రోజూ కవర్ అయ్యేలాగా … ఈ టైమ్ నుంచి ఈ టైమ్ వరకూ అని ప్లాన్ వేసుకోండి.. ఒక వేళ మీరు టెక్నికల్ లేదా అగ్రికల్చరల్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూనే… గ్రూప్ 1, 2,3 ల్లో ఏవైనా రాస్తుంటే… రెండు ఎగ్జామ్స్ కి పనికొచ్చేలాగా మీ డైలీ షెడ్యూల్ ఉండాలి గుర్తుంచుకోండి. టైమ్ స్లాట్స్ అలా విభజించుకోండి.

నెంబర్ 3 : Focus on Basics and Concepts

ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసిపోయింది… సిలబస్ మీద అవగాహన వచ్చింది…. టాపిక్స్ తెలిశాయి… స్టడీ ప్లానింగ్ వేసుకున్నారు… ఆ తర్వాత చదవడం స్టార్ట్ చేయాలి… ఏం చదవాలి… ఎలా మొదలు పెట్టాలి అని చాలా మంది కన్ ఫ్యూజ్ అవుతుంటారు. మనం హడావిడి పడి చదవాల్సిన అవసరం లేదు… మీకు 5 నుంచి 6 నెలల టైమ్ ఉంది… అందుకే మొదటగా బేసిక్ట కాన్సెప్ట్స్ మీద దృష్టి పెట్టాలి.
జనరల స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకామనీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ…. ఇలా వీటిల్లో ముందుగా బేసిక్ కాన్సెప్ట్స్ ని text books లో చదువుకొని వాటిని క్లియర్ చేయాలి… ప్రతి సబ్జెక్టులో మొదటి లెసన్ నుంచి చదవడం స్టార్ట్ చేయాలి…

నెంబర్ 4 : Practice Previous Year Papers

ఇప్పుడు మీ లక్ష్యం ఏంటో తెలిసింది… దాని వైపు అడుగులు పడుతున్నాయి… మీరు క్రమంగా గాడిలో పడుతున్న టైమ్ లోనే … ప్రీవియస్ పేపర్ల మీద దృష్టి పెట్టండి… మీరు ప్రిపేర్ అయ్యే … గ్రూప్ 1,2,3… మాత్రమే కాకుండా… మొత్తం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్ని ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయండి… నేను మొత్తం సిలబస్ అయ్యాక ఎగ్జామ్స్ రాస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు… ఇంకో నాలుగు రోజులు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు కూడా ఇలాంటి సాకే చెబుతుంటారు… అస్సలు మీరు సిలబస్ మొత్తం అయ్యాక… అనే మాట మీ మైండ్ లో నుంచి తీసేయండి… ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి… ప్యాటర్న్ తెలుసుకోవాలి అంటే… తప్పనిసరిగా అన్ని ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి… ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు… ఎంత డెప్త్ గా మనం చదవాలి అన్న ఐడియా వస్తుంది… అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుస్తాయి. డిఫకల్టీ లెవల్ ఎలా ఉందో కూడా అవగాహన వస్తుంది.

నెంబర్ 5: Mock Tests and Grand Tests

మీరు లెసన్స్ చదవడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే … లెసన్ వైజ్ మాక్ టెస్టులు రాసుకోండి. దాని వల్ల ప్రతి లెసన్ మీదా మీకు గ్రిప్ వస్తుంది. 1, 2 నెలలు అవగానే… మెల్లగా గ్రాండ్ టెస్టులు రాయడం మీద దృష్టి పెట్టండి… మళ్ళీ చెబుతున్నా… సిలబస్ అంతా అయ్యాక అనే కాన్సెప్ట్ మర్చిపోండి… ఇలాంటి మాక్, గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల మీరు ఇంప్రూవ్ అవడంతో పాటు… అసలు ఏయే టాపిక్స్ ఎగ్జామ్స్ లో వస్తున్నాయి… మనం ఇంకా ఏమేమి చదవాలి అన్న దానిపై అవగాహన వస్తుంది… టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్ తెలుస్తాయి. మీరు ఏ సబ్జెక్టులో స్ట్రాంగ్… ఎందులో వీక్ అన్నది తెలుస్తుంది.

మేమైతే… Telangana eXams plus యాప్ లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1ప్రిలిమ్స్ కి విడి విడిగా టెస్ట్ సిరీస్ నడుపుతున్నాం… ప్రస్తుతం ఏడాదికి 450 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి జనవరి నుంచి పెరిగే ఛాన్సుంది. అందుకే ఇప్పుడే జాయిన్ అవయితే బెటర్. వాటి లింక్స్ నేను ఈ కింద ఇస్తున్నాను.

నెంబర్ 6 : Stay Updated on Current affairs

కరెంట్ ఎఫైర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు చివర్లో చూసుకుందాం అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. TGPSC, APPSC వీటిల్లో కరెంట్ ఎఫైర్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది… ఏ రోజు కారోజు అప్ డేటెడ్ గా ఉంటూ… నోట్స్ రాసుకుంటే బెటర్. ముఖ్యంగా కరెంట్ ఎఫైర్స్ తో నే మిగతా కొన్ని సబ్జెక్టులు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వ పథకాలు, పాలసీలు… ఇంటర్నేషనల్ రిలేషన్స్.. ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకొని బ్యాకెండ్ లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది.

ఉదా: మొన్న సెప్టెంబర్ నెల కరెంట్ ఎఫైర్స్ వీడియో ఇచ్చాను. అందులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు… వాళ్ళ పదవీ కాలం తర్వాత వచ్చే నెలకు 36 వేల ఫించన్ ఇవ్వొద్దంటూ… హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానించారు… చట్టం చేశారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గోడ దూకుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు చేశారు… రాజీవ్ గాంధీ హయాంలో తెచ్చిన చట్టానికి వాజ్ పేయి హయాంలో తెచ్చిన చేర్పులు ఏంటి లాంటి అంశాలు ఆ వీడియోలో ఇచ్చా. ఇలా మీరు కూడా ప్రతి కరెంట్ ఎఫైర్ టాపిక్ నీ అన్వయించుకుంటూ చదుకోవాలి… CA ప్రతి రోజూ నోట్స్ రాయడం మర్చిపోవద్దు.

నెంబర్ 7: Revise Regularly రెగ్యులర్ గా రివైజ్ చేస్తూ ఉండాలి.

రివిజన్ చేసుకోవడం అంటే… మనం చదవింది మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం… అందుకే ప్రతి లెసన్స్ లేదంటే కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నప్పుడు… షార్ట్ ఫామ్ లో నోట్స్ రాసుకుంటే… వాటిని మధ్య మధ్యలో తిరగేసి చూసుకోడానికి అవకాశం ఉంటుంది. రీజనింగ్, అర్థమెటిక్ లో ఫార్ములాలు గుర్తు పెట్టుకోవాలి… ఇలా రెగ్యులర్ గా రివజిన్ చేయడం వల్ల… మీరు చదివింది ఎట్టి పరిస్తితుల్లో మర్చిపోవడానికి అవకాశం ఉండదు. మీరు రాసుకున్న నోట్స్, మైండ్ మ్యాప్స్, క్విక్ రివిజన్ ట్రిక్స్ లాంటివి … ఎగ్జామ్ ముందు వరకూ బాగా ఉపయోగపడతాయి.

నెంబర్ 8 : Group. Discussions & Doubt Clearing:

మీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళంతా కలసి … లెసన్స్, కరెంట్ ఎఫైర్స్ మీద గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే చాలా మంచిది… గ్రూప్ డిస్కషన్ లో నలుగురైదుగురు కంటే ఎక్కువ ఉంటే… సోది అవుతుంది… ఈ నలుగురుదైగురికీ… ఉద్యోగం సాధించాలి అన్న కమిట్ మెంట్ ఉండాలి… ఒకరు చదువుతుంటే… మరొకరు సోది పెట్టే బ్యాచ్ ఉండొద్దు. కొన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ కూడా ఇలాంటి గ్రూప్ డిస్కషన్ చేసుకోడానికి అవకాశం ఇస్తున్నాయి… అలాంటిది ఏవైనా మన యాప్స్ లేదా సోషల్ మీడియా గ్రూపుల్లో ఎరేంజ్ చేయొచ్చేమో నేను కూడా ప్రయత్నం చేస్తా.

నెంబర్ 9 : Maintain Physical & Mental Health:

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాం అంటే… కొంత వరకూ ఒత్తిడి ఉంటుంది. సాధించాలన్న లక్ష్యం ఓవైపు… చాంతాడంత సిలబస్ మరో వైపు…. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి… ఏదైనా మనం ఇష్టంతో చేస్తే… కొత్త విషయం నేర్చుకుంటున్నాం అన్న ఉత్సాహంతో చదితితే ఏదీ కూడా బోరు కొట్టదు. అయినప్పటికీ… గంటకి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం… హెల్డీ డైట్… ఉదయం లేవగానే 10 నిమిషాల మెడిటేషన్…. ప్రాణాయామం లాంటివి చేసుకుంటే… మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు… ఎంత చదువైనా చదవగలుగుతారు. నేను మెడిటేషన్ వీడియో ఇస్తాను అని గత వీడియోల్లోచెప్పా… ఆ వీడియో Telugu Talks లో అప్ లోడ్ అయింది. లింక్ ఈ కింది description లో ఇస్తాను. ప్రతి రోజూ ఉదయం టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఆయిల్ ఫుడ్ ఐటెమ్స్ కి దూరంగా ఉండండి… పూరీలు, బోండాలు లాంటివి రోజూ తింటే… చదువుకోకుండా ఎంచక్కా నిద్ర పోవచ్చు… మత్తులో తూగుతుంటాం…

నెంబర్ 10: Stay consistent and Positive

మీరు ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు… ఒక్కోసారి జాబ్ నోటిఫికేషన్లు లేట్ అవుతాయి… ఒక్కోసారి కోర్టు తీర్పులతో రద్దవుతాయి… వాయిదా పడతాయి… ఇలాంటి టైమ్ లో చాలామంది ఫ్రస్టేట్ అవుతుంటారు… ఆ ఫ్రస్టేషన్ తో… చదువు మానేస్తారు. మొన్న గ్రూప్ 1 విషయంలో చాలామంది మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇలాగే ప్రస్టేట్ అయ్యారు. జరిగింది గవర్నమెంట్ తప్పో… tgpsc తప్పో… కోర్టుల్లో కేసులో… ఏదైనా కావొచ్చు… అసలు దాని మీద దృష్టిపెట్టి… మీరు పూర్తిగా పుస్తకాలు పక్కన పారేస్తే ఎలా ? నోటిఫికేషన్ డిలే అయితే… మనకి ఇంకాస్త టైమ్ వచ్చింది అనుకోవాలి… మీరు మీ సిలబస్ ను హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ కోసం రెడీగా ఉండాలి.. అంతేగానీ… నోటిఫికేషన్ పడ్డాక అప్పుడు మొదలుపెట్టడం కాదు… లక్షల మందికి ఈ స్టడీ ప్లానింగ్ మీద అవగాహన లేకపోవడం వల్లే… డబ్బుకంటే విలువైన టైమ్ ని కోల్పోతున్నారు… సో… దేనికైనా సరే… గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి సహనం కావాలి… స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్… మన దృష్టి అంతా 100 పర్సెంట్ సిలబస్ కంప్లీషన్… 100 పర్సెంట్ రివిజన్ మీదే ఉండాలి… సోషల్ మీడియాలో గవర్నమెంట్ నో… లేకపోతే నన్నో తిట్టుకుంటే లాభం లేదు.

be positive…..
మీరు నేను చెప్పిన ఈ 10 సూత్రాలు ఫాలో అవ్వండి… 2025 లో కొత్త కొలువుతో మీ కుటుంబానికి… మీ అక్క చెల్లెళ్లు… మీ అన్నదమ్ముల ముఖాల్లో చిరునవ్వును నింపండి.. ఇప్పటి నుంచే మీ జర్నీ మొదలు పెట్టండి… Don’t wait for notifications… start now your success journey…..

వీలుంటే… మన Telangana exams plus యాప్ లో group.2, group.3 కోర్సుల్లో జాయిన్ అవ్వండి… ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా త్వరలో నోటిఫికేషన్లను బట్టి … examscentre247 యాప్ లో ఎగ్జామ్స్ కి ప్లాన్ చేస్తున్నాం.

మన Telangana exams , Andhra exams you tube channels ని subscribe చేసుకోండి… ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి… అలాగే ఎగ్జామ్స్ సెంటర్ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి… ప్రతీ రోజూ అప్ డేట్స్ అందిస్తాం…

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!