సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి శుభవార్త. NICL లో 500 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్స్ తక్కువ ఉన్నాయని అప్లయ్ చేయడం మానొద్దు. గట్టిగా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. జీతం 24 వేల నుంచి 62 వేల రూపాయల దాకా ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థ National Insurance Company Limited (NICL) లో 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు.
NICL లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో 58 ఖాళీలు ఉన్నాయి. మహారాష్ట్ర 52, కర్ణాటక 40, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 35 ఖాళీలు ఉన్నాయి.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 33 (ఆంధ్ర ప్రదేశ్ 21+ తెలంగాణ 12) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు ఏంటి ?
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. అలాగే స్థానిక భాష(తెలుగు)పై పట్టు ఉండాలి.
ఎంత వయస్సు ?
వయోపరిమితి: 01 అక్టోబర్ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 21 నుంచి 30 యేళ్ళ మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు ఎంత ?
దరఖాస్తు ఫీజు: SC/ ST/ PwBD/EXS అభ్యర్థులు రూ.100/ చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.850 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ ఎలా ?
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా Online prelims, Mains హాజరవ్వాలి. Mains Examలో అర్హత సాధించిన మార్కులు, ప్రాంతీయ భాషపై పట్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు కంపెనీ ప్రాంతీయ భాష (తెలుగు)లో పట్టుపై పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో కూడా అర్హత సాధించాలి
ప్రొబేషన్ పిరియడ్: ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల పాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. ఈ కాలంలో కంపెనీ అంచనాలను అందుకోవడంలో విఫలమైన అభ్యర్థుల ప్రొబేషన్ కాలం పొడిగించే అవకాశం ఉంది.
జీతం ఎంత ?
జీతం : రూ.22,405 నుంచి రూ.62,265 వరకు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 24, 2024
దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 11, 2024
ఎలా అప్లయ్ చేయాలి ?
ఆన్ లైన్ అప్లయ్ చేయాలి … లింక్ ఇదే:https://ibpsonline.ibps.in/niclaoct24/
పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి