ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేయనున్నారు. 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకూ టెట్ పరీక్షలు జరిగాయి. వీటిని 3,68,661 మంది రాశారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
CLICK HERE: AP TET RESULTS
ఫలితాలు ఎలా చూడాలి ?
Step 1: AP TET రాసిన అభ్యర్థులు ముందుగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి
Step 2: హోం పేజీలో కనిపించే AP TET Results-2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
Step 3: మీ వివరాలను ఎంట్రీ చేసి submit బటన్ నొక్కితే మీ TET స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
Step 4: దాన్ని ప్రింటవుట్ తీసుకోవచ్చు లేదంటే డౌన్లోడ్ ఆప్షన్ నొక్కి కాపీని మీ మొబైల్ లేదా సిస్టమ్ లో సేవ్ చేసుకోవచ్చు.
AP TET పరీక్షలు మొత్తం 17 రోజుల పాటు జరిగాయి. ప్రతి రోజూ రెండు సెషన్స్ లో నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 4.27 లక్షల మంది TET ఎగ్జామ్ కి అప్లయ్ చేశారు. వీళ్ళల్లో 3.68 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. రెండు రోజుల క్రితమే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. విద్యామంత్రి నారా లోకేశ్ అందుబాటులో లేకపోవడంతో ఫలితాలు వాయిదా పడ్డాయి. టెట్ ఫలితాలు వెల్లడి అవగానే ఈ నెల 6న APలో Mega DSC నిర్వహణకు విద్యాశాఖాధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
AP DSC లో ఎన్ని పోస్టులు ?
AP లో విడుదలయ్యే మెగా DSC లో మొత్తం 16,347 పోస్టులు ఉంటాయి. ఇందులో
Secondary Grade Teachers (SGT) : 6,371
School Assistant (SA) : 7,725
Trained Graduate Teachers (TGT): 1,781
Post Graduate Teachers (PGT): 286
Principals : 52
PET : 132
ఈనెల 6న అధికారికంగా విద్యాశాఖ విడుదల చేసే AP DSC Notification లో మార్పులు చేర్పులు ఉండే అవకాశముంది.