AB PM JAY: Ayushman Bharat ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం-జేఏవై.

AB PM JAY: Ayushman Bharat ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం-జేఏవై.

దేశంలో 70 యేళ్ళు నిండిన వృద్ధులు అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ( AB-PMJAY) కింద ఉచితగా ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద పేదలు, తక్కువ ఆదాయం కలిగిన వారికి మాత్రమే ఉండేది. ఇకపై ఎవరి ఆర్థికపరిస్థితో సంబంధం లేకుండా 70 యేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ PMJAY కింద రూ.5 లక్షల Health కవరేజీ అందిస్తారు.

దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న Ayushman Bharat హెల్త్ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో 1350 మెడికల్ ప్యాకేజీలకు ఈ 70 యేళ్ళు నిండిన వారికి కవరేజ్ లభిస్తుంది. ఈ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో సహా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.

ఆయుష్మాన్ భారత్

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా 2018 సెప్టెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ప్రారంభించారు.దేశంలోని 12 కోట్ల పేద కుటుంబాలు, అంటే దాదాపు 55 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. లేటెస్ట్ గా ESI పథకాన్ని కూడా ఆయుష్మాన్ భారత్ PM JAY లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ PM JAY .. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య బీమా పథకం.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!