ప్రభుత్వ రంగ సంస్థ New India Assurance company Limited (NIACL)లో ఖాళీగా ఉన్న 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ -1) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వీటిని Online లో అప్లయ్ చేసుకోవాలి. మూడు దశల్లో అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
మొత్తం 170 ఖాళీలు ఉన్నాయి.
వీటిల్లో Unreserved : 71, EWS : 17, OBC : 45, SC: 25, STలకు: 12 పోస్టులు ఉన్నాయి.
1. Generalists: 120 Posts:
01.09.2024 25 60% మార్కులతో ఏదైనా Degree. SC/ST/PWDకు 55 శాతం
2. అకౌంట్స్-50 Posts:
60 శాతం మార్కులతో చార్టర్డ్ అకౌంటెంట్ (ICAI) / కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, SC/ST/ దివ్యాంగులకు 55 శాతం. లేదా 60 శాతం మార్కులతో MBA ఫైనాన్స్/ PGDM ఫైనాన్స్/ ఎంకాం. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55 శాతం.
వయో పరిమితి : 01.09.2024 నాటికి 21 నుంచి 30 యేళ్ళ మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో SC/STలకు 5 యేళ్ళు, OBCలకు 3 యేళ్ళు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు 100.
ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలతో పాటు ద్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష: ఆబ్జెక్టిన్ విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రశ్నాపత్రం ఇంగ్లిష్/ హిందీ భాషల్లో 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 60 నిమిషాలు,
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కు : 30 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కు : 35 మార్కులు.
ప్రతి సెక్షన్‌లోనూ కనీసార్హత మార్కులు సాధించాలి. దీంట్లో అర్హులను 115 నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
ఫేజ్-2 మెయిన్ పరీక్ష: ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. అబ్జెక్టివ్ టెస్ట్ పూర్తయ్యాక వెంటనే ఆన్ లైన్ లోనే డిస్క్రిప్టివ్ టెస్ట్ రాయాలి.
రీజనింగ్‌కు 50 మార్కులు (40 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వే జ్ కు 50 మార్కులు (40 నిమి షాలు), జనరల్ అవేర్నెస్ కు 50 మార్కులు (30 నిమిషాలు),
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్: 50 మార్కులు (40 నిమిషాలు).
మొత్తం 200 మార్కులు.
డ్యూరేషన్ : రెండున్నర గంటలు. ప్రతి సెక్షన్ లోనూ కనీసార్హత మార్కులు సాధించాలి.
Descriptive Test : 30 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. 30 నిమిషాలు ఈ ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్షలో.. లెటర్ రైటింగ్ కి 10 మార్కులు, Essayకు 20 మార్కులు ఉంటాయి. దీంట్లో జనరల్ అభ్యర్థులు 15, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 13.5 కనీసార్హత మార్కులు సాధించాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
ఇంటర్వ్యూ లేదా తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు.
మూడోదశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలకు 75: 25 నిష్ప త్తిలో వెయిటేజీ ఉంటుంది.
గుర్తుంచుకోండి :
ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. ఎక్కువ పంపితే అన్నింటినీ తిరస్కరిస్తారు.
* కాల్ లెటర్ ద్వారా ఇంటర్వ్యూ సెంటర్, అడ్రెస్, టైమింగ్స్ తెలియజే స్తారు. వీటిని website నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
* SC/ST/OBC(నాన్ క్రిమీ) /PWD అభ్యర్థులకు Online లో Pre-examination లో శిక్షణ ఇస్తారు.
పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయండి