ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉద్యోగాల నియామకానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టులు. ఇప్పటికే TET పరీక్షలు అయిపోవడం, రిజల్ట్స్ కూడా రావడంతో ఇక DSC నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలోనే కూటమి ప్రభుత్వం నుంచి మొదటి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
AP Job Notifications 2024: నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కొన్నేళ్ళుగా గత ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో పోస్టుల భర్తీ సరిగా నిర్వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే తాము అధికారంలోకి రాగానే మెగా DSC ని వేస్తామని ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 16347 పోస్టులతో మెగా డిఎస్సీ వేసేందుకు సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం కూడా చేశారు.
నోటిఫికేషన్ ఎప్పుడు ?
నవంబర్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సిద్ధమవుతున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువత సంతోషంగా ఉన్నారు. గత YCP ప్రభుత్వం ఎన్నికలకు ముందు దాదాపు 6 వేల పోస్టులతో DSC నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఎగ్జామ్ నిర్వహించలేదు… నియామక ప్రక్రియ ముందుకు కదలలేదు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో DSC కి బ్రేక్ పడింది. ఎన్నికల ముందు హడావిడిగా పోస్టులు ప్రకటించి జగన్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది. దాంనికి మరో 10 వేల ఉపాధ్యాయ పోస్టులను జత కలిపి మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది.
డిసెంబర్లోగా ప్రక్రియ పూర్తి… వెంటనే పోస్టింగ్స్
వచ్చే డిసెంబర్ లోగా ఏపీలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ Mega DSC పూర్తయితే రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూళ్ళకు అదనపు టీర్లు వస్తారు. మెగా DSC కి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో ఉపాధ్యా నిరుద్యోగులు ప్రిపరేషన్లో ఫుల్లు బిజీగా ఉన్నారు.
Mega DSC లో ఏమేమి పోస్టులు ఉంటాయంటే ?
Secondary Grade Teachers : 6371 Posts
School Assistants : 7725 Posts
Trained Graduate Teachers : 1781 Posts
Post Graduate Teachers : 286, Posts
PET G 132 Posts
Principal Posts : 52 Posts
మెగా డీఎస్సీకి అధికారుల ఏర్పాట్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ కావడంతో అధికారులు మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారీగా రోస్టర్ పద్ధతిలో నియామక ప్రక్రియ ఉంటుంది. అందుకోసం జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే స్కూళ్ళ విలీనం పేరుతో గత YCP ప్రభుత్వం GO 117 ని తీసుకొచ్చింది. ఈ GO వల్ల ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తగ్గే అవకాశముంది. ఆ GO రద్దు చేయాలని ఉపాధ్యా నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.