APPSCకి కొత్త బాస్ అనురాధ… ఇక నోటిఫికేషన్లకు ఛాన్స్

APPSCకి కొత్త బాస్ అనురాధ… ఇక నోటిఫికేషన్లకు ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ఛైర్‌పర్సన్‌గా Retired IPS ఏఆర్‌ అనురాధను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. YCP ప్రభుత్వంలో APPSC ఛైర్మన్‌గా పనిచేసిన గౌతమ్‌ సవాంగ్‌ 2024 జులై 4న రిజైన్ చేశారు. ఆ తర్వాత నుంచి APPSC ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు అనురాధను నియమించడంతో కూటమి ప్రభుత్వం ఇక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

APPSCని ప్రక్షాళన చేయాలని CM చంద్రబాబు భావిస్తున్నారు. ఎలాంటి రాజకీయాలకు అవకాశం లేకుండా ఉద్యోగాల నియామక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే రిటైర్డ్ IPS ఆఫీసర్ కు కమిషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలో టీడీపీ హయాంలోనే AP ఇంటెలిజెన్స్ విభాగానికి హెడ్ గా పనిచేశారు. ఏఆర్ అనురాధ. డీజీ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలోనూ పనిచేశారు. 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి. APPSC ని గాడిలో పెట్టి మళ్ళీ నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించడానికి సమర్ధవంతంగా, నిష్పాక్షికంగా పనిచేసే అధికారి కోసం సీఎం చంద్రబాబు వెతికినట్టు అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక APPSC ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకాలపై ఒక్క ప్రకటన వెలువడలేదు. ఇప్పటికైనా పోస్టుల సంఖ్యను గుర్తించి నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!