APPSC Group.2 Mains ఫిబ్రవరి 23 ?

APPSC Group.2 Mains ఫిబ్రవరి 23 ?

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష అనుకున్న టైమ్ కి నిర్వహిస్తారా ? వాయిదా వేస్తారా అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ లో ఇంకా గందరగళం నెలకొన్నది. ఈమధ్యే APPSC అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. కానీ.. జనవరిలో DSC పరీక్షలు జరుగుతుండటంతో APPSC Group.2 Mains ని ఫిబ్రవరికి వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడిస్తుందని భావిస్తున్నారు.

ఇప్పటికే DSC నోటిఫికేషన్ రిలీజ్ అవడం, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల ప్రిపరేషన్‌ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని గతంలో APPSC జనవరి తేదీలను ఖరారు చేసింది. కానీ..DSC నోటిఫికేషన్ వాయిదా పడటంతో Group.2 మెయిన్స్ డేట్స్ మార్చాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంతో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23న నిర్వహించాలని APPSC ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వంతో చర్చించాక అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తారని అంటున్నారు.

APPSC గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కి 92,250 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ ఎగ్జామ్ రెండు సెషన్లలో జరుగుతుంది. 2023 డిసెంబర్‌లో 899 పోస్టులతో APPSC Group.2 నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2024 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. 2024 జులై నాటికే Group.2 మెయిన్స్ పూర్తి చేయాల్సి ఉంది. కానీ YCP హయాంలో వాయిదా పడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం గెలిచి అధికారం చేపట్టింది. APPSC Chairperson గా బాధ్యతలు స్వీకరించిన అనూరాధ.. గ్రూప్-2 మెయిన్స్‌ డేట్స్ పై నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: APPSC Group.2 Mains New Syllabus 

గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు ఏపీలో 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీళ్ళల్లో 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత 4,04,037 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం హాజరు నమోదైనట్టు APPSC వర్గాలు తెలిపాయి

గ్రూప్ 2 మెయిన్స్ లో 2 పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో పేపర్ కి 150 మార్కులు.

పేపర్-1: ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం

పేపర్-2 : భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ప్రతి సెక్షన్ కు 75 మార్కులు

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!