APPSC ప్రకటించిన గ్రూప్ 2 మెయిన్స్ తేదీల్లో మార్పు తప్పదనిపిస్తోంది. మెయిన్స్ ని 2025 జనవరి 5 నుంచి నిర్వహిస్తామని APPSC ఇప్పటికే ప్రకటించింది. కానీ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. DSC పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకూ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. DSC కి ప్రిపేర్ అవుతున్న చాలా మంది నిరుద్యోగులు గ్రూప్ 2 మెయిన్స్ కి కూడా అర్హత సాధించారు. అందువల్ల తమకు ప్రిపరేషన్ కు టైమ్ ఉండదని వాపోతున్నారు. AP Mega DSC ప్రకటన కంటే ముందే APPSC గ్రూప్ 2 మెయిన్స్ డేట్స్ ప్రకటించింది. అక్టోబర్ 30నే షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి కనీసం 3 నెలలైనా టైమ్ ఇవ్వకుండా ఎగ్జామ్ నిర్వహిస్తే ఎలా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అటు DSC కోసం ఉపాధ్యయ నిరుద్యోగ అభ్యర్థులతో పాటు 3 నెలల టైమ్ ఇవ్వాలని మిగతా నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్ 2 మళ్ళీ ఎప్పుడు ?
నిరుద్యోగ అభ్యర్థుల రిక్వెస్ట్ ను APPSC లెక్కలోకి తీసుకుంటే గ్రూప్ 2 ని ఎప్పుడు నిర్వహిస్తారు. ఏప్రిల్ దాకా దాదాపు టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయి. అప్పటిదాకా GROUP.2 ఎగ్జామ్స్ నిర్వహణకు సెంటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అందుకే ఏప్రిల్ లేదా మేలో మాత్రమే నిర్వహించేందుకు ఛాన్సుంది. DSC షెడ్యూల్ ను బట్టి Group.2 Mains ఎగ్జామ్స్ డేట్స్ మార్చాలా… వద్దా అన్న దానిపై APPSC ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు Group.2 Mains పరీక్షలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి రావు, లక్ష్మణ్ రావు APPSC కి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వాయిదాపై APPSC నిర్ణయం తీసుకుంటే Group.2 Mains ఎగ్జామ్ 2025 ఏప్రిల్ లేదా మేలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి.