APPSC Group-2 Mains Exams Dates : గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్షల తేదీలు రిలీజ్

APPSC Group-2 Mains Exams Dates : గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్షల తేదీలు రిలీజ్

కూటమి ప్రభుత్వ వచ్చాక కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు దీపావళి పండగ ముందు శుభవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) గ్రూప్‌-2 మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ని ప్రకటించింది. 2024 జూన్ 28న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ని పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సిలబస్ లో మార్పుల వల్ల అభ్యర్థులు కూడా మరింత టైమ్ కావాలని అడిగారు. దానికితో ఏపీలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. వారం క్రితం APPSC ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ పోలీస్ అధికారి అనురాధ బాధ్యతలు చేపట్టడంతో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలైంది.

APPSC గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు 2025 జనవరి 5 నుంచి నిర్వహిస్తామని ప్రకటించింది. గ్రూప్ 2 కోసం మొత్తం 897 పోస్టులతో భర్తీకి గత వైసీపీ హయాంలోనే నోటిఫికేషన్‌ జారీ అయింది. దీనికి మరో 8 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 905కు చేరింది.

APPSC ఛైర్ పర్సన్ గా ఈమధ్యే రిటైర్డ్ IPS అధికారి AR అనురాధ బాధ్యతలు చేపట్టారు. వైసీపీ హయాంలో APPSC ఛైర్మన్ గా పనిచేసిన గౌతమ సవాంగ్ 2024 జులై 4న రిజైన్ చేశారు. అప్పగి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పట్లో నిలిచిపోయిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ను రీషెడ్యూల్ చేశారు. టెన్త్, ఇంటర్మీడియట్, డీఎస్సీ, పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని, పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రూప్-2 మెయిన్స్ తేదీలను నిర్ణయించినట్లు APPSC తెలిపింది. 13 ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

గ్రూప్‌-2 మెయిన్స్‌కు ఎంతమంది ?

ఈ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు అప్లయ్ చేశారు. 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కానీ 4,04,037 మంది (87.17) శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. వీళ్ళల్లో మెయిన్స్‌కు 92,250 మందిని ఎంపిక చేశారు.

ఇది కూడా చదవండి

APPSCకి కొత్త బాస్ అనురాధ… ఇక నోటిఫికేషన్లకు ఛాన్స్

గ్రూప్ 2 మెయిన్స్ ఎందుకు జరగలేదు ?

గత YCP హయాంలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూశారు. ఖాళీగా ఉన్న వేల పోస్టులు భర్తీ చేయాలంటూ ఆందోళనలు, ధర్నాలు కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఎన్నికల ముందు హడావిడిగా 2023 డిసెంబర్ 7న గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. వేల పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 897 పోస్టుల భర్తీకి మాత్రమే APPSC ప్రకటన ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు…గతంలో ఉన్న సిలబస్‌లో మార్పులు చేసి కొత్త సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించారు.

2 నెలల టైమ్ లోనే అంటే 2024 ఫిబ్రవరి 25నే గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది APPSC. మొత్తం 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, అందులో ప్రిలిమ్స్‌కు 4,04,037 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్త సిలబస్ ప్రకారం సరిగ్గా ప్రిపేర్ అయ్యే పరిస్థితులు లేక 79,498 మంది అభ్యర్థులు ఎగ్జామ్ కి అటెండ్ కాలేదు. 2024 ఏప్రిల్ 10న గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ ని APPSC రిలీజ్ చేసింది. మొత్తం 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించింది. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ను 2024 జులై 28గా ప్రకటించించింది. అయితే సిలబస్ లో మార్పుల వల్ల తాము సరిగా ప్రిపేర్ అవ్వలేమని నిరుద్యోగులు మండిపడ్డారు. కొన్ని చోట్ల ఆందోళనలు జరగడం, ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేయడంతో పరిపాలన కారణాలతో APPSC Group.2 Mains పరీక్షలు వాయిదా వేసింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక APPSC గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు 2025 జనవరి 5 నుంచి నిర్వహిస్తామని ప్రకటించింది.

CLICK HERE FOR APPSC WEBNOTE : APPSC WEBNOTE

కొత్త సిలబస్ ఏంటి ?

ఈ ఆర్టికల్ చూడండి : APPSC MAINS NEW SYLLABUS (click here)

APPSC కొత్త సిలబస్ ప్రకారం Multiple choice questions (MCQs) వీడియోలను Andhra Exams You tube channel లో ఇస్తాం. ఈ కింది లింక్ ద్వారా subscribe చేసుకోగలరు.

CLICK & SUBSCRIBE ANDRA EXAMS YOU TUBE LINK

 

🎯Join this Telegram group for more Jobs, Exams notifications, Results updates of Central & APPSC, TGPSC etc Updates: TELEGRAM LINK

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!