ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (గతంలో ఆంధ్రా బ్యాంక్) 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేష్ రిలీజ్ చేసింది. ఈ ఖాళీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో 400 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2024 నవంబర్ 13లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేయాలి.
మొత్తం ఖాళీలు : 1500
తెలంగాణలో : 200 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ లో : 200 పోస్టులు
అర్హతలు ఏంటి ?
LBO పోస్టుకు అప్లయ్ చేయడానికి అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి. స్థానిక భాష (తెలుగు)లో మంచి పట్టు ఉండాలి.
వయస్సు ఎంత ?
01 అక్టోబర్ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 యేళ్ళు, గరిష్టంగా 30 యేళ్ళ మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ఎలా ?
Written Test / Group Discussion /Personal Interview ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్షలో : Aptitude, Reasoning, English, General Studies నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది.
జీతం ఎలా ఉంటుంది ?
రూ. 48,480 నుంచి రూ.85,920 వరకూ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు ఎంత ?
జనరల్, EWS, OBC అభ్యర్థులు రూ.850 + GST చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులైతే రూ.175 + GST చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు ఇవే
దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేది: అక్టోబర్ 24, 2024
దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 13, 2024
అప్లయ్ చేయాలంటే సర్టిఫికెట్స్ ఏమి ఉండాలి ?
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో with Signature
డిగ్రీ, 10th మార్కుల మెమోలు
కుల ధృవీకరణ /EWS సర్టిఫికెట్స్
ఎలా ధరఖాస్తులు చేసుకోవాలి ?
ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి… నోటిఫికేషన్ కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి