గ్రూప్ 1 మెయిన్స్ ఈనెల 21 నుంచి జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. TGPSC ఎగ్జామ్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలో లీకుల కారణంగా అనేకసార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు అయింది… అందుకే ఈసారి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు… గ్రూప్ 1 నిర్వహించే సెంటర్ లో ఒక్కో సెంటర్ కి ఒక్కో పోలీస్ అధికారి… ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్స్ పెక్టర్ కు బాధ్యతలు ఇస్తోంది… ఎగ్జామ్స్ అక్టోబర్ 21 నుంచి కాబట్టి… దానికి వారం రోజుల ముందు… అంటే… దసరా పండగ తర్వాత 14 నుంచి మెయిన్స్ హాల్ టిక్కెట్లు ఇష్యూ అవుతాయి. దీనికి సంబంధించి వెబ్ నోట్ కూడా రిలీజ్ అయింది.
అన్ని గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఒకే హాల్ టిక్కెట్‌తో హాజరు కావాలి. మొదటి పరీక్షకు వాడిన హాల్‌టికెట్‌నే అన్ని పరీక్షలకు తీసుకురావాలి. ఎందుకంటే ప్రతిరోజు ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పై సంతకం చేస్తారు… అభ్యర్థి కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ హాల్‌టికెట్‌ను పరీక్షలు ముగిసే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ తర్వాత… అంటే రిక్రూట్మెంట్ పూర్తయ్యే దాకా ఈ హాల్ టికెట్‌ను దాచిపెట్టుకోవాలని TGPSC సూచించింది. పరీక్షకు గంట ముందు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని పరీక్షకు రావాలి. బూట్లతో అస్సలు రావొద్దు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్స్, బ్యాగులు పెట్టుకోడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదు. అందువల్ల… విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ అధికారులు సూచించారు… అభ్యర్థులు ఎగ్జామ్ కంటే గంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలని కమిషన్ తెలిపింది.
అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల టైమ్ లో రాయాలి… ఒక్కో పేపర్ కు 150 మార్కులు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ని ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల దాకా నిర్వహిస్తారు.
గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ :
జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) – అక్టోబర్ 21, 2024.
పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23, 2024.
పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24, 2024.
పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) – అక్టోబర్ 25, 2024.
పేపర్- V (సైన్స్ & టెక్నాలజీ, Data interpretation ) – అక్టోబర్ 26, 2024.
పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27, 2024.
మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాసుకోవాలి…
వెబ్ నోట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
GROUP-1-MAINS-HTS-WEBNOTE20241009171635