Civils Abhayahastham: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … సివిల్స్ ప్రిలిమ్స్ పాసైతే లక్ష సాయం

Civils Abhayahastham: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … సివిల్స్ ప్రిలిమ్స్ పాసైతే లక్ష సాయం

Rajiv Civils Abhayahastham Scheme: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో కొత్త పథకం తీసుకొచ్చింది. రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ (Rajiv Gandhi Civils Abhayahastham) పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజా భవన్‌లో ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఈ స్కీమ్ ప్రకటించారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఈ సాయం చేస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా ఉద్యోగం సాధించాలని కోరారు. సివిల్స్ సాధించి మన తెలంగాణాకే రావాలనీ…. IAS, IPSలు మనవాళ్ళయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం అన్నారు.

Watch this Video : TG GOVT JOB CALANDER

నిరుద్యోగుల సమస్యల పరిష్కరిస్తాం

ఉద్యోగాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. విద్యార్థుల త్యాగాల పునాదులపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అందుకే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల Appointment Letters ఇచ్చామన్నారు. గత పదేళ్ల BRS ప్రభుత్వంలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. అందుకే మేం అధికారంలోకి రాగానే UPSC తరహాలో TGPSCని తీర్చి దిద్దుతున్నట్టు చెప్పారు. Group.1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాం. DSC పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలను తరచుగా వాయిదా వేయడం కరెక్ట్ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ – 2 పరీక్ష వాయిదా వేశామనీ… మంచి ప్లాన్ తో పరీక్షలను కండక్ట్ చేస్తామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టబోతున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చి లోగా అన్ని ప్రభుత్వం శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పిస్తారు. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి… డిసెంబర్ 9 లోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్శిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్టూడెంట్స్ కి skill development training ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర పరిశ్రమల విభాగం ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్శిటీలను పరిశీలించినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఫార్మా, కన్‌స్ట్రక్షన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్.. లాంటి ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశపెడతామని చెప్పారు. మొదటి ఏడాది 2 వేల మందితో Skill Universityని ప్రారంభించి తర్వాత… ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేలా చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

అర్హతలు ఏంటంటే

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!