భారత వృద్ధి రేటుపై ప్రపంచ బ్యాంక్ అంచనాలు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.6% వృద్ధిరేటు ఉంటుందని గత జూన్ లో అంచనా వేసింది. లేటెస్ట్ గా దాన్ని 7 శాతానికి పెంచింది. వ్యవసాయ రంగం, గ్రామీణ గిరాకీ వృద్ధి రేటుకు పెంచడానికి ఉపయోగపడతాయని తెలిపింది. వర్షాలు, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు రాణించి, జీడీపీ వృద్ధిని పెంచుతాయని ప్రపంచ బ్యాంకు సీనియర్ ఆర్ధిక వేత్త రాన్ తెలిపారు. ‘ఇండియా డెవలప్మెంట్ అప్ డేట్ నివేదికలో ప్రపంచ బ్యాంకు వృద్ధి రేటు గురించి వెల్లడించింది.
2024-25 వృద్ధిరేటు:
ప్రపంచబ్యాంక్ : 7.0%
IMF : 7.0%
ABD: 7.0%
ఆర్థిక సర్వే : 6.5-7%
RBI : 7.2%
- UAE, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) వాణిజ్యం పెరిగేందుకు ఉపయోగపడతాయి.
* అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడం ద్వారా భారత్ తన వృద్ధిరేటుకు మద్దతు ఇస్తుంది.
ఇప్పటికే రాణిస్తున్న ఐటీ, వ్యాపార సేవలు, ఔషధ రంగాలతో పాటు జౌళి, దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, హరిత సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ భారత్ సత్తా చాటనుంది.
2030 కల్లా 1 లక్ష కోట్ల డాలర్ల (రూ.83 లక్షల కోట్లకు పైగా) వాణిజ్య ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది తప్పదని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
* వ్యవసాయ రంగంలో రికవరీ వల్ల, పారిశ్రా మిక మధ్యస్థ వృద్ధిని పాక్షికంగానైనా పూడ్చొచ్చు. సేవల రంగం బలంగా ఉండటం కలిసొచ్చే అంశం.
రూ.1.45 లక్షల కోట్ల ఆయుధ కొనుగోళ్లు!
భారత సైనిక దళాల కోసం రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన 2024 సెప్టెంబర్ 3నాడు సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి(DAC) నిర్ణయించింది. మొత్తంమీద 10 రకాల ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు ‘Acceptance of Necessity’ (AON) జారీ చేసింది. ఇందులో 99 శాతాన్ని దేశీయ సంస్థల నుంచే సేకరిస్తామని రక్షణ శాఖ తెలిపింది. భారత సైన్యంలోని యుద్ధట్యాంకుల ఆధునీకరణ కోసం Future ready combat vehicles (FRSV)లను సమకూరుస్తారు. ఇవి ఎలాంటి ఉపరితలంపైన అయినా చురుగ్గా కదిలే ట్యాంకులు. ఇవి అత్యంత కచ్చితత్వంతో శత్రు లక్ష్యాలపైకి కాల్పులు జరపగలవు. ఆకాశంలోని లక్ష్యాలను గుర్తించి, వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఆయుధ వ్యవస్థలకు గైడ్ లైన్స్ చేయడానికి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లను సమీకరిస్తారు. తీర రక్షక దళం కోసం డోర్నియర్-228 విమానాలు, వేగంగా సంచరించే కొత్త తరం గస్తీ నౌకలను కొంటారు.
పశ్చిమ బెంగాల్ లో ‘అపరాజిత బిల్లు’కు ఏకగ్రీవ ఆమోదం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 2024 ఆగస్టు 3నాడు రాష్ట్ర అత్యాచార నిరోధక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర రాజధాని కోల్ కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనతో ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్ మెంట్) 2024 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం.. అత్యాచారానికి గురైన బాధితులు మరణించినా, కోమాలోకి వెళ్లినా దోషికి ఉరిశిక్ష విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన దోషులకు పెరోల్ లేని జీవిత ఖైదును విధిస్తారు.
బ్రూనైలో ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటన
వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బ్రూనైతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా 2024 సెప్టెంబర్ 3నాడు మోడీ బ్రూనై చేరుకున్నారు. యువరాజు హజీ అల్ ముమ్ తడీ బిల్లా….. ఎయిర్ పోర్టులో ఆయనకు స్వాగతం చెప్పారు. ద్వైపాక్షిక పర్యటన కోసం బ్రూనైకు భారత ప్రధాని వెళ్లడం ఇదే మొదటిసారి. Act East విధానంలో భారత్ కు బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య స్నేహ బంధాలున్నాయి. బ్రూనై రాజధాని బండర్ సెరి బెగవాన్ లో భారత హైకమిషన్ కొత్త ఆఫీసును మోడీ ప్రారంభించారు. బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్ అలీ సైపుద్దీన్ మసీదును సందర్శించారు. బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కి యాతో చర్చలు జరుపుతారు. తర్వాత సింగపూర్ వెళ్తారు.
బ్రూనై గురించి క్లుప్తంగా….
బ్రూనై బోర్నియో ద్వీపంలోని ఒక చిన్న దేశం. మలేషియా, దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉంటాయి. బీచ్‌లు, బయో డైవర్స్ రెయిన్ ఫారెస్ట్ లకు ఇది ప్రసిద్ధి. రాజధాని బండర్ సేరి బెగవాన్. సంపన్నమైన జేమ్ అసర్ హస్సనిల్ బోల్కియా మసీదు, దానికి 29 బంగారు గోపురాలు ఉన్నాయి. రాజధానిలో ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ లో బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా నివసిస్తారు. 1700 గదులతో రాజభవనం ఉంది. సుల్తాన్ కి సొంతంగా 7 వేల కార్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద నివాస భవంతిగా ఇది గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. రాజకుటుంబం సంపద 4 వేల కోట్ల డాలర్లు అంటే రూ.3,28,000 కోట్లు. క్రూడాయిల్, సహజ వాయువు అమ్మకాలతో వచ్చే డబ్బులే వాళ్ళ సంపాదన.
అగ్రి స్టార్టప్స్ కి రూ.750 కోట్ల నిధి
వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్స్ ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 750 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘అగ్రి స్యూర్’ (Agri fund for start-ups & rural enterprises) పేరుతో దీన్ని ప్రారంభించారు. వ్యవసాయానికి సంబందించి రూ.14,000 కోట్ల విలువైన ఏడు పథకాలను కేంద్ర మంత్రివర్గం 2024 ఆగస్టు 2 నాడు ఆమోదించింది. ఇందులో భాగంగా కృషి నివేశ్ పోర్టల్ తో పాటు, అగ్రిస్యూర్ నిధిని కేంద్ర మంత్రి ప్రారంభించారు. వ్యవసాయరంగంలోని స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులకు ఈక్విటీ, రుణాల రూపంలో ఆర్థిక సహాయాన్ని ఈ నిధి అందిస్తుందని మంత్రి తెలిపారు
And if anyone has not joined our Group.2 excellence course… can join. Those writing Group.2 in December must join.
TGPSC Group 2 Excellence Series: From Beginner to Officer (EM & TM)